మోకాళ్ళ నొప్పి మరియు బిగుసుకు పోయిన భుజాలు 03502...USA
63-సంవత్సరాల మహిళ గత రెండు సంవత్సరాలుగా భుజాల నొప్పి తో బాధ పడుతూ ఉంది. కనీసం ఆమె వంట గదిలో దినచర్యలకు సంబంధించిన చిన్న చిన్న బరువులు ఎత్తడానికి కూడా చాలా దుర్భరంగా ఉంది. వీరి యొక్క అలోపతి డాక్టర్ దీనిని ఆర్థర్రైటిస్ గా గుర్తించి కొన్ని జాగ్రత్తలు చెప్పారు. వీరికి నోటికి వేసుకోవడానికి మందులే కాక భుజానికి కూడా అప్పుడప్పుడూ ఇంజక్షన్ ఇచ్చేవారు. భుజాలకు రాయడానికి ఒక ఆయింట్ మెంట్ కూడా ఇచ్చారు. ఏమైనప్పటికీ ఈ వైద్యం ఖరీదయినదే కాక దీని నుండి పొందే బాధా నివారణ అంతంతమాత్రము గానే ఉంది. పైగా మందులు తీసుకోవడం ఆపగానే తిరిగి నొప్పి విజ్రుమ్భించేది. 2014 జూలై నెలలో ప్రాక్టీ షనర్ క్రింది రెమిడి ఆమెకు ఇచ్చారు :
CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.1 SMJ tonic + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue + CC20.6 Osteoporosis…TDS
మూడు వారాలు ఈ మందులు వేసుకోగానే వీరు నొప్పి నుండి పూర్తిగా విముక్తి పొందారు. మూడు నెలల అనంతరం ప్రాక్టీ షనర్ వీరిని కలసి నపుడు ఆవిడ ఆనందంగా ఏ విధమైన భుజాల నొప్పి లేకుండా వంటింట్లో పనులు చేసుకుంటూ కనిపించారు. డోసేజ్ ని ఒక నెల రోజులు OD గానూ అనంతరం ప్రివెంటివ్ డోసేజ్ OW గా మరో నెల రోజులు తీసుకోవలసింది గా సూచించారు. 2016 ఫిబ్రవరి నెల నాటికీ పేషంటుకు ఏ విధమైన నొప్పి లేకుండా ఉండటమే కాక డోసేజ్ ను OW గా కొనసాగిస్తూ ఉన్నారు.