శిశువులో నిద్ర సమస్య 03507...UK
2016,జనవరి 14 న చిన్నప్పటినుండి నిద్ర సమస్యతో బాధ పడుతున్న 20 నెలల శిశువును అతని తల్లి ప్రాక్టీ షనర్ వద్దకు తీసుకొని వచ్చారు.యితడు రాత్రిళ్ళు నిద్ర పట్టక ప్రతీ అర్ధ గంటకు లేస్తూ రాత్రంతా మెలుకువ గా ఉంటాడు. అతడు పెద్దవాడవుతున్న కొద్దీ సమస్య కూడా పెరుగుతూ వచ్చింది. దీనివల్ల అతని తల్లి కూడా ఇబ్బంది పడుతూ నిద్ర లేక పోవడంతో నీరసంతో పాటు మానసిక వత్తిడికి కూడా గురియవుతున్నారు. ఈ శిశువుకు ప్రాక్టీ షనర్ క్రింది రెమిడి ఇచ్చారు:
CC12.2 Child tonic + CC15.6 Sleep disorders...నిద్ర పోవడానికి అరగంట ముందు,నిద్రకు ఉపక్రమించే ముందు మరియు బాబు మధ్యలో నిద్ర లేచిన మొదటిసారి కూడా ఒక డోస్ ఇవ్వవలసింది గా తల్లి సూచించబడింది .
రెండు రోజుల తర్వాత శిశువు లో నిద్ర 80% పెరిగింది. ఈ రెండు రోజులలో అతడు రోజుకు రెండు సార్లు మాత్రమే లేచేవాడు. 2016 జనవరి 27 న అ తల్లి ప్రాక్టీ షనర్ తో బాబు రాత్రిళ్ళు ఒక్కసారి మాత్రమే నిద్ర లేచి నట్లు తిరిగి వెంటనే నిద్ర పోతున్నట్లు తెలిపారు. ఇది 20 నెలల వయసున్న శిశువుకు ఇది సాధారణం కనుక ఆవిడ ఈ పరిణామానికి చాలా ఆనందించారు. ప్రస్తుతం ఆమెకు తన కొడుకు వల్ల నిద్రాభంగం లేక హాయిగా నిద్ర పోగలుగు తున్నారు. మరొక నెల రోజులు డోసేజ్ ని అలానే ఇవ్వమని ఆ తర్వాత రోజు విడిచి రోజు ఆ పైన మెల్లిగా తగ్గించు కుంటూ రావలసిందిగా ప్రాక్టీషనర్ సూచించారు.