నిద్ర లేమి వ్యాధి 01620...France
ఆఫ్రికా దేశం నుండి వచ్చి ప్రస్తుతం యూరప్ లో పని చేస్తున్న 30-సంవత్సరాల యువ ఇంజినీరు నిద్రలేమితో బాధ పడుతూ నిత్యమూ అలసటకు గురి ఔతున్నారు. వారు చెప్పిన దాని ప్రకారము గత 10 సంవత్సరాలగా రోజుకు రెండు గంటలు నిద్ర పట్టడం కూడా కష్టమే. మందులకు బానిస అవకూడదనే ఉద్దేశంతో వాటిని తీసుకునేవారు కాదు. 2015 నవంబర్ 15 న వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది :
CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC15.6 Sleep disorders…నిద్ర పోవడానికి అరగంట ముందు ఒకడోసు,నిద్రపోయే ముందు ఒక డోసు,అవసరాన్ని బట్టి నిద్రపట్టే వరకు ప్రతీ అరగంటకు ఒక డోసు.
రెండు రోజుల పాటు కేవలం రెండు డోసులు తీసుకున్నంత మాత్రాననే చక్కగా నిద్రపట్టేదట. ఇతని సహోద్యోగులు వీరిలో చాలా మార్పు వచ్చిందని ఇప్పుడు అలసట లేకుండా చాల ఉత్సాహంగా ఉంటున్నట్లు గమనించారట. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలా నిద్రపట్టడం అద్భుతం అని వీరు భావిస్తున్నారు. ప్రస్తుతం వీరు ప్రతీ రొజూ రెమిడి తీసుకుంటూ నిద్రలేమి సమస్యకు దూరమయ్యారట . 2016 జనవరిలో రెమిడి తిరిగి భర్తీ చేయబడింది.