మెదడులో కణితి - గ్లైయోబ్లాస్తోమా మల్టిఫార్మస్ గ్రేడ్ 4 02749...New Zealand
ఒక 53 ఏళ్ళ వ్యక్తికి మెదడులో కణితి ఉండడం కారణంగా శస్త్రచికిత్స చేసారు. సర్జరీ తర్వాత శాస్త్ర నిపుణులు ఈ రోగి కేవలం మరో 14 నెలలు మాత్రమే జీవించి ఉంటాడని రోగియొక్క కుటుంభానికి తెలియచేశారు. రోగి మరియు అతని కుటుంభ సభ్యులు నిరాశ చెందకుండా ఒక వైబ్రో సాధకురాలని సంప్రదించారు.ఆమె ఈ రోగికి ఈ క్రింద వ్రాసిన మందులను ఇచ్చింది:
CC2.1 Cancers - All + CC2.3 Tumours + CC12.1 Adult Tonic + CC18.1 Brain & Memory Tonic...TDS
ఇన్ఫెక్షన్ (అంటువ్యాధి) నివారణకై ఈ కింద వ్రాసిన మందును తీసుకోమని చెప్పబడింది:
CC9.2 Acute fever...OD ఇన్ఫెక్షన్ కలిగితే TDS తీసుకోమని చెప్పబడింది
ఈ రోగికి తాజా కూరగాయలు, పండ్లు, పండ్ల రసాలు ,గోధుమ గడ్డి, బార్లీ గడ్డి, ఖనిజాలు, విటమిన్లు మరియు అవిసెగింజల నూనెతో పాటు పన్నీరు వంటి శాఖాహార ఆహారాన్ని తీసుకోమని సాధకురాలు సలహా ఇచ్చింది.
అదే సమయంలో ఈ రోగికి రేడియేషన్ చికిత్స కూడా ఇవ్వబడింది. దీనికారణంగా రోగికి బరువు తగ్గడం తప్ప మరే విధమైన దుష్ప్రభావాలు కలుగలేదు. సాధకురాలు రోగికి ఇచ్చిన మందులో CC4.1 Digestion Tonic…TDS చేర్చివ్వడంతో రోగి తిరిగి బరువు పెరిగాడు.
మూడు నెలల్లో ఈ రోగికి చాలా వరకు ఉపశమనం కలిగింది కాని తలస్సేమియా వ్యాధి కలిగించే ఒక రక్తవ్యాధి కారణంగా ఇతని బ్లడ్ కవుంట్ ప్రమాదకరంగా తగ్గిపోయింది. అల్లోపతి డాక్టర్లు ఈ రోగికి రక్త మార్పిడి చేయించుకోమని సలహా ఇచ్చారు కాని CC3.1 Heart Tonic రెండు సార్లు తీసుకోవడంతో రక్త మార్పిడి చేయించుకునే అవసరం తప్పింది!
వైబ్రో చికిత్స తీసుకున్న పది నెలల తర్వాత, ఈ రోగి ఒక ఆశ్పత్రిలో రక్త పరిశీలన మరియు MRI స్కాన్ చేయించుకున్నాడు. పరిశీలన ఫలితాలను చూసి, చివరి దశలో ఉన్న ఒక వ్యాధి పూర్తిగా మాయమవ్వడం చూసి డాక్టరు చాలా ఆశ్చర్య పడ్డారు. ప్రతిరోజు ఈ వ్యాధిని నయం చేయమని మన ప్రియమైన భగవాన్ శ్రీ సత్య సాయి బాబావారిని, రోగి, రోగి యొక్క కుటుంబ సభ్యులు మరియు సాధకురాలు ప్రార్థించారని సాధకురాలు ఉద్గాటించి చెప్పింది. ఆమె నివేదికలో ఈ విధంగా వ్రాసింది: "మానవుడు చికిత్సను అందిస్తాడు కాని నివారించే కర్త భగవంతుడే"