తామరవ్యాధి 01427...Singapore
మార్చి 2013 లో, 50 ఏళ్ల మహిళ, గత 30 ఏళ్ళుగా తన ముంజేతుల పైగల తీవ్రతామర కొరకు చికిత్స కోరింది. రెండు ముంజేతులపై చర్మం నల్లగా, మొద్దుబారి, పొడిగా, పెళుసుగా, చాలా దురదగా ఉంది. రోగి తన పరిస్థితికి కలత చెంది, దయనీయంగా కనిపించింది. ఆమె వివిధ చికిత్సలను ప్రయత్నించింది, వీటిలో ఏది కూడా పనిచేయలేదు. ప్రస్తుతానికి ఏమీ తీసుకోలేదు. ఆమెకు అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వుండేవి. కానీ అల్లోపతి మందుల ద్వారా తగ్గినవి. ఆమె ఈ రెమిడీ తో చికిత్స పొందింది:
#1. SR295 Hypericum 30C + SR299 Lycopodium 200C + SR315 Staphysagaria + SR382 Croton Tig…TDS
కొన్ని రోజుల తరువాత, కొంత మెరుగుదల ఉంది కాని ఔషదం చాలా నెమ్మదిగా పని చేస్తుందని భావించి రోగి అసంతృప్తి చెందినది. ఆమె వేగంగా నయమగుటకు, పైన పూతకు ఏదయినా యిమ్మని కోరినది. నోటిద్వారా మందుతోపాటు, తామరగల స్థలంపై పూయుటకు, ఆమె విబూతిలో కలిపిన #1 ఇవ్వబడింది. 6వారాల తర్వాత, తామర ఆనవాళ్ళన్నీ పోయాయి. రోగి సంతోషంగా అభ్యాసకునకు తన పూర్తిగా నయమైన ముంజేతులు రెండింటినీ చూపినది.
ఆమె వైబ్రియోనిక్స్ చికిత్సపట్ల ఆసక్తితో ఇప్పుడు తన ఇతరసమస్యలకు కూడా చికిత్స కోరింది. 2007 లో గర్భాశయ శస్త్రచికిత్స జరిగిననాటినుండి, ఆమెకు తరచుగా కడుపునొప్పి వచ్చి, కొన్నిగంటలపాటు వుంటున్నది. డాక్టర్ ఆమె శస్త్రచికిత్స సమయంలో, స్కార్ టిష్యూ ఆమె అండాశయము, ప్రేగులు, ఫెలోపియన్ నాళాలకు అతుక్కోవటంవల్ల నొప్పి వస్తోందని, దాన్ని జీవితమంతా భరించాల్సిందేనని చెప్పేరు. గత 4 ఏళ్ళుగా, ఆమెకు తరచూ మూత్రనాళాల సంక్రమణ కూడా ఉంది, కాబట్టి ఆమె మూత్రపిండ ప్రదేశం తరచుగా చాలా మృదువైపోయినట్లు (పాడవుతున్నట్లు) భావించింది. ఆమె దీనికి ఏ మందులను తీసుకోవడం లేదు. ఆమెకు ఇవ్వబడిన రెమిడీ:
మూత్రనాళాల సంక్రమణ, కడుపునొప్పి కొరకు:
#2. CC4.6 Diarrhoea + CC13.2 Kidney & Bladder infections + CC15.1 Mental & Emotional tonic…TDS
కొన్నిరోజుల్లోనే మెరుగుదల కలిగి, రోగి మూత్రనాళాల సంక్రమణ, కడుపునొప్పి చాలావరకు నయమైనవి. ఆమె TDS మోతాదుతో చికిత్సను తీసుకుంటూ ఉన్నంతవరకు, ఆమె నొప్పిలేకుండా హాయిగా ఉంటున్నది.