దీర్ఘకాలిక కాలునొప్పి 03504...UK
31 జూలై 2015 న, అభ్యాసకుడు, కాళ్లనొప్పివల్ల కష్టపడుతూ నడుస్తున్న 70 ఏళ్ల మహిళని చూసారు. గత 5 సం.ల.లో ఆమె కాళ్ళలోని కండరాల బలహీనత వృద్ధి చెందుతున్న కారణంగా నొప్పి సంభవించింది. ఆమె తన డాక్టరుకు చూపించారు కానీ నిర్దిష్ట చికిత్స చేయగల పరిస్థితిలో రోగనిర్ధారణ చేయబడలేదు. ఈనొప్పికి ఆమె ఏ మందులను తీసుకోవడం లేదు. ఆమెకు చికిత్సచేసిన రెమిడీ:
CC3.7 Circulation + CC12.1 Adult tonic + CC18.5 Neuralgia + CC20.1 SMJ tonic + CC20.4 Muscles & Supportive tissue…QDS
2 వారాలలో, రోగి కాళ్ళనొప్పి 50% నయమై, 3 వారాలయేసరికి మరో 20% మెరుగుదల కనిపించింది. రోగి తనకు చాలా మెరుగైనదని, ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తున్నట్లు తెలిపారు. 7వారాలచికిత్స తర్వాత (20 సెప్టెంబర్ 2015), ఆమెకు 100% తగ్గింది. పూర్తిగా తగ్గిపోయినందుకు రోగి చాలా కృతజ్ఞతతో ఉన్నారు. ఆమెకు 3 నెలలపాటు మోతాదును TDS కు తగ్గించమని, తరువాత మరో 3 నెలలు BD గా తీసుకొని, ఆ పిమ్మట OD గా తీసుకోమని సూచించారు.