మధుమేహం, చెవి క్రింద గడ్డ 10399...India
41 సం.ల. వ్యక్తి గత 3 ఏళ్ళుగా మధుమేహంతో బాధపడుతూ, జూన్ 2010 లో వైబ్రియోనిక్స్ వైద్యుని వద్దకు చికిత్స నిమిత్తం వచ్చారు. అల్లోపతీ మందులు తీసుకుంటున్నా వైబ్రో కూడా వాడాలని భావించారు. అతనికి ఈ క్రింది రెమిడీ యివ్వబడినది:
మధుమేహమునకు:
#1. CC3.1 Heart tonic + CC6.3 Diabetes + CC7.1 Eye tonic + CC12.1 Adult Tonic + CC13.1 Kidney & Bladder tonic…TDS
అతను తన నెలవారీ రీఫిల్ మందులకోసం క్రమం తప్పక అభ్యాసకుని వద్దకు వచ్చేవారు. 9నెలల తర్వాత అతని ఎడమ చెవిక్రింద, మెడభాగాన కండరాల ముడి ఏర్పడింది. దానికోసం అతను తన డాక్టర్ని సంప్రదించారు. డాక్టర్ అతనికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేకుండా, శస్త్రచికిత్సతో తొలగించాలని సలహా ఇచ్చారు, కానీ రోగికి శస్త్రచికిత్స చేయించుకోవటం యిష్టంలేదు. తరువాతి 2-3 నెలల్లో, ఈ కండరాల ఉబ్బు చాలా పెద్దదిగా మారింది, అందువలన అతను వైబ్రియోనిక్స్ వైద్యుని వద్ద చికిత్స తీసుకోదలిచారు. అభ్యాసకుడు రెమిడీ యీవిధంగా మార్చారు:
గడ్డకు, మధుమేహమునకు:
#2. CC2.3 Tumours & Growths + #1…TDS
ఒక సంవత్సరం తరువాత గడ్డ మెత్తగా మారి, 20 నెలల తరువాత పూర్తిగా అదృశ్యమయ్యింది. రోగి చికిత్స తిరిగి మార్చబడింది #1 ...TDS. అక్టోబర్ 2015నుండి, రోగి చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే అతని డాక్టర్ క్రమంగా తన మధుమేహం అల్లోపతిమందులు తగ్గించారు. రోగి # 1 తీసుకోవడం కొనసాగించారు.