ముక్కుపై కణితి, దీర్ఘకాలిక అజీర్ణం 03524...USA
83 సంవత్సరాల వ్యక్తి తన ముక్కుకొనపై ఏర్పడిన పెద్దకణితి చికిత్సకోసం వైబ్రియోనిక్స్ వైద్యుని వద్దకు వచ్చారు. ఆ కణితి నిరపాయమైనదైనా, దానిపై గత 5సం.లు.గా యితర గడ్డలు పెరుగుతున్నవి. వైద్యుడు అతనికి వివిధ అల్లోపతీ మందులతో చికిత్స చేసినా ప్రయోజనం కలగలేదు. నిజానికి యాంటిబయోటిక్ minocycline మందు దుష్ప్రభావాలతో, కణితి అధ్వాన్నంగా తయారైంది. అతను తనముక్కును తాకినప్పుడల్లా దురద, జిడ్డుతో చాలాచికాగ్గా ఉంది. రోగి తనకి సుమారు 20 సం.లు.గా దీర్ఘకాల అజీర్ణం వున్నదని ఫిర్యాదు చేసారు. అతనికి ఇంకా చాలా ఆరోగ్య సమస్యలున్నవి. అతను మొదట కణితి, అజీర్తికి మందిమ్మని కోరారు. 3 జూలై 2015 యీ క్రింది రెమిడీ యివ్వబడినది:
కణితి, అజీర్తికి:
#1. CC2.3 Tumours & Growths + CC4.10 Indigestion + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic...TDS మొదటివారం తర్వాత అతను వైబ్రియోనిక్స్ వైద్యునితో పరిహారం బాగా పనిచేసిందని చెప్పారు. అతని జీర్ణక్రియ 40% నయమైంది. కణితిలో మార్పు లేకున్నను, కొత్త గడ్డలు లేవకపోవటం ఆశాజనకమూగ ఉంది. నెల తరువాత అతను తనజీర్ణశక్తి గొప్పగా నయమై, కనీసం 70% మెరుగైనదని చెప్పారు. కణితి చిన్నదవటం ప్రారంభించినందున అతను చాలా ఆనందంగా ఉన్నారు. కణితి 20% చిన్నదై, చర్మం రంగు కూడా మెరుగు పడింది. మరొక నెలలో అతని అజీర్ణం పూర్తిగా నయమైంది. కణితికూడా 80% క్షీణించి, అద్భుతమైన మెరుగుదల కనిపించినది. జీర్ణశక్తి కాంబో మోతాదు తగ్గించాల్సిన అవసరం ఉన్నందున, నివారణలు మార్చబడ్డాయి. అక్టోబరు 18 న రోగికి క్రింది రెమిడీలు ఇవ్వబడినవి:
అజీర్ణమునకు:
#2. CC4.10 Indigestion + CC10.1 Emergencies....OD
కణితికి:
#3. CC2.3 Tumours & Growths + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic...TDS
వైబ్రియోనిక్స్ వైద్యచికిత్సలో వున్నంతకాలం, తన కణితికి కానీ అజీర్ణం కోసంకానీ అతను ఏ ఇతర మందులను తీసుకొనలేదు. నవంబర్ 10వతేదీన, అన్ని గడ్డలు మెత్తబడి అణిగిపోయినవి. మొదట్లో కణితి చాలా త్వరగా కుంచించుకు పోయింది గానీ తరువాత మందగించింది. దురద, చికాకు పోయి, కణితి పొడిగా ఉంది. # 3 నోటిద్వారా తీసుకోవడంతో పాటు, అభ్యాసకుడు అతనికి క్రింది రెమిడీ ఇచ్చారు:
# 4 CC2.3 Tumours & Growths… కల్తీలేని పెట్రోలియం జెల్లీతో కలిపి, అవసరాన్నిబట్టి పైన పూయాలి.
రోగి వైబ్రియోనిక్స్ వైద్యుని వద్దకు రాగా, వారు మాయమయిన కణితిచూసి "వైబ్రియోనిక్స్" అద్భుత నివారణశక్తికి ఆశ్చర్య పోయారు. రోగి వైబ్రియోనిక్స్ చికిత్సవల్ల చాలా సంతోషించి, డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుకోసం చికిత్సను ప్రారంభించారు.