దీర్ఘకాల కడుపునొప్పి 10363...India
గత ఏడాదిగా 14 ఏళ్ల బాలుడు కడుపునొప్పితో బాధపడుతున్నాడు. బాల్యంనుండి బాలునికిగల పుప్పొడి అలెర్జీల దీర్ఘకాలిక ప్రభావమే ఆ కడుపునొప్పని అతని డాక్టర్ అభిప్రాయం. కడుపునొప్పి తీవ్రతవల్ల ఆ బాలుడు గంటలకొద్దీ నేలమీద పొర్లుతూ, పాఠశాలకు కూడా నెలల తరబడి హాజరు కాలేకపోయేవాడు. అతనికి స్టెరాయిడ్స్ తోసహా అల్లోపతి మందులతో చికిత్స చేయించినా, ఏమాత్రం నొప్పి తగ్గ లేదు. 2013 ఆగష్టు15న ఇతరమందులన్నీ ఆపి, వైబ్రియోనిక్స్ అభ్యాసకుని వద్దకు వచ్చినప్పుడు, బాలునికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC4.10 Indigestion + CC9.2 Infections acute + CC15.1 Mental & Emotional tonic...QDS
మరునాడు ఆ బాలుడితల్లి కేవలం ఒక మోతాదుతో తనకొడుకు నొప్పులు బాగా తగ్గినవని, వైబ్రియోనిక్స్ అభ్యాసకునకు తెలియచేసినది. కడుపునొప్పి 90% తగ్గినది. ఆ బాలుడు 4నెలలు చికిత్సను కొనసాగించాడు, అప్పటికి అతనికి పూర్తిగా నయమయింది. మోతాదు అప్పుడు క్రమంగా తగ్గించి, జూన్ 2014 నాటికి OW నిర్వహణ స్థాయికి తగ్గించబడింది. అక్టోబర్ 2015 నాటికి బాలుడు తన తోటిబాలురవలె మంచి ఆరోగ్యంతో వున్నట్లు కనుగొనబడినది.