మైగ్రేన్ తలనొప్పి 11568...India
గత 4 ఏళ్లుగా తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్న 32ఏళ్ల స్త్రీ ఆగష్టు 2015 లో చికిత్సకోరి వచ్చారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో అనగా శారీరక పరమైనవి (ఆమె ప్రయాణాలు, బజారుపన్లు, కుటుంబ శుభకార్యాలలో విపరీతమైన పనులు), మానసిక ఒత్తిడి, పెద్దధ్వనితో పాటలు, శబ్దాలు, ఎండలో తిరగడం, నిద్రలేమి వంటి వానివల్ల మైగ్రేన్ ఎక్కువ ఔతోంది. తలనొప్పి సాధారణంగా 24 - 48 గంటల వరకు కొనసాగుతుంది. ఆమె ఆయుర్వేద చికిత్స తీసుకున్నా ఫలితం కలగలేదు. ఆమె నొప్పి నివారణకు అలోపతి మాత్రలు తీసుకునేది కానీ ఆమె ఇప్పుడు మానేయాలని చూస్తోంది. వికారం, ఆందోళనలతో ఆమె దినచర్యకు కూడా ఆటంకం కలిగి చేయలేకపోతోంది. ఆమెకు ఈ క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC11.4 Migraines + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS నీటితో తీసుకోవాలి. నొప్పిగా వున్నప్పుడు 10నిముషాలకొక మోతాదు చొప్పున 2గం.ల వరకు అవసరాన్నిబట్టి తీసుకోవాలి.
3రోజుల చికిత్స తర్వాత మైగ్రేన్ వచ్చింది. కానీ లక్షణాలు కనపడగానే ఆమె గంటవరకు, ప్రతి 10 ని.ల.కొకసారి కాంబో మోతాదు తీసుకొనసాగించారు. ఆమె 5వ మోతాదు తీసుకొనగానే నొప్పితగ్గినట్లు సంతోషం, ఆశ్చర్యాలతో చెప్పినది. ఆమె రెమిడీ TDS చొప్పున తీసుకొన సాగినది. 14 అక్టోబర్ 2015 నాటికి, ఆమెకు 90% తగ్గింది. మోతాదు OD కు తగ్గించబడింది. 15రోజుల తర్వాత (29 అక్టోబర్), రోగి తనకు పూర్తిగా తగ్గినట్లు, అధిక శారీరకశ్రమ, మానసిక వొత్తిడి, తగినంత నిద్ర లేకపోయినను కూడా మైగ్రేన్ తలనొప్పి రాలేదని చెప్పినది. ఆమెకు ప్రస్తుతం రోజువారీ OW మోతాదు సూచించారు. తలనొప్పికనుక వస్తే, వెంటనే కాంబో మోతాదు నీటిలో కలిపి ప్రతి 10 నిముషాలకొకసారి ఒక మోతాదు చొప్పున ఒక గంటసేపు తీసుకొనమని చెప్పారు.