దవడ నొప్పి, చిగుళ్ళ మరియు అంగుడు వాపు 01163...Croatia
ఒక 56సం.ల. స్త్రీ వైబ్రో వైద్యునివద్దకు చికిత్స కోరి వచ్చారు. 2నెలల క్రితం ఆమె పై దవడకు నోటిలో శస్త్ర చికిత్సచేయగా ఆమెకు నయమైంది కాని తర్వాత ఆమెకు దవడ నొప్పి మొదలైంది. ఆమె నోటిలో చిగుళ్లు, అంగుడు (నాలుక ఎదురు భాగం) వాచినవి. ఆమె దంతముల బ్రిడ్జ్ సిమెంట్ చేసినప్పటికీ చాలా అసౌకర్యంగా ఉంది. మే 2015లో రోగికి క్రింది రెమిడీ ఇచ్చారు:
#1. NM3 Bone Irregularity + NM39 Teeth Decay + NM89 Mouth & Gums + SM26 Immunity + SM27 Infection…TDS
10రోజుల చికిత్స తరువాత, ఆమెకు 30% మెరుగుదల కనిపించినది. అందువలన దంతవైద్యుడు ఆమెకు బ్రిడ్జ్ తగిలించగలిగెను. 2నెలల తరువాత, ఆమెకు చిగుళ్ళవాపు, అంగుడు బాధ 80% తగ్గినవి. కానీ దవడ బాధ పూర్తిగా తగ్గనందున ఆమెకు క్రింద పేర్కొన్న రెండు కొత్త కోంబోలు కలిపారు:
#2. NM96 Scar tissue + SR576 Tumours + #1…TDS
సెప్టెంబర్ నాటికి అన్ని రోగ లక్షణములు పూర్తిగా పోయి, రోగి తనకింక దంత సమస్యలేమీ లేవని చెప్పారు.