బాధపూరితమైన, క్రమబద్ధత లేని బహిష్టు, కండ్లకలక 11177...India
30 సెప్టెంబర్ 2010న 21సం.ల. మహిళ బాధాపూరితమైన, క్రమబద్ధత లేని బహిష్టుల కొరకు చికిత్సకై వచ్చినది. గత 1½ సం.లు గా ఆమె ఋతుక్రమం ప్రతినెల 5-10 రోజుల వరకు ఆలస్యముగా వచ్చుచున్నది. అంతకు 3రోజులముందు కండ్లకలక కూడా వచ్చుచున్నది. ఆమె ఈ సమస్యలు వేటికి కూడా యెటువంటి మందు తీసుకొనుటలేదు. ఆమెకు ఈ పరిహారముల నిచ్చిరి:
ఋతుక్రమమునకు:
#1. CC8.8 Menses Irregular…TDS
కండ్లకలకకు:
#2. CC7.3 Conjunctivitis…TDS
నాలుగు రోజులలోనే ఆమె కండ్లకలక పూర్తిగా పోయినది. రోగి పరిహారం #2 మరొక వారం వరకు తీసుకొని ఆపివేసినది. 3వారాల తరువాత #1 వాడుటవలన, ఆమె ఋతుక్రమం మామూలు సమయంలో, ఏ ఆలస్యం లేకుండా, ఎటువంటి బాధలేకుండా వచ్చినది. పూర్వపు బాధలేమీ తిరిగి రాలేదు. మరొక 2 నెలలు ఆమె #1 తీసుకొని, తరువాత మానివేసినది.