మూర్ఛలు, క్రమ రహితమైన బహిష్టులు, మలబద్ధకం 11310...India
16 సెప్టెంబరు 2013 న మూర్ఛచికిత్స కోసం 13 ఏళ్ల అమ్మాయి వైబ్రో అభ్యాసకుని వద్దకు తీసుకొనిరాబడినది. ఆమె 8 సం.ల. వయస్సులో వుండగా, 10' అడుగుల ఎత్తైన పైకప్పునుండి పడిపోయిన 6నెలల తర్వాత మూర్ఛలు ప్రారంభమైనవి. ఆమెకు నెలకోసారి మూర్ఛరావడం మామూలైపోయింది. ఆమె చికిత్స కోసం వచ్చిన సమయానికి, ప్రతి 15 - 20 రోజులకు ఆమెకు మూర్ఛ వస్తున్నది, ఆమె తలనొప్పి, వాంతి వస్తున్నట్లు కడుపులో వికారంతో బాధపడుతున్నది. ఆమె చాలా బలహీనంగా వుండడంతో పాటు మలబద్ధకం కూడా వున్నది. అభ్యాసకుడు ఇచ్చినది:
మూర్చకు:
#1. NM50 Epilepsy + NM63 Back-up + NM86 Immunity…6TD
బలం, శక్తి కొరకు:
#2. CC3.2 Bleeding disorders + CC3.7 Circulation…TDS
మలబద్ధము కొరకు:
#3. CC4.4 Constipation + CC4.10 Indigestion…BD
నవంబర్ 10 ని ఆమె తిరిగి వైద్యుని వద్దకు 8 వారాల తర్వాత వెళ్లినప్పుడు, రోగి తనకు ఒక్కసారే, ఆ ముందురోజు, మూర్ఛవచ్చినట్లు చెప్పింది. తనకు తలనొప్పి, కడుపులో వికారం కూడా 50% - 60% తగ్గినట్లు చెప్పింది. చికిత్స మరో 3 నెలలు కొనసాగింది. అప్పటికి మొదటి రోగలక్షణాలు 90% మెరుగయ్యాయి. కాని ఆమెకు అపసవ్యమైన బహిష్టులు వస్తున్నవి. ఆమె బహిష్టులు తరచుగా 2-3 రోజుల ఆలస్యంతో వస్తున్నవి. ఆమెకు చాలా ఎక్కువగా తెలుపు యోని ఉత్సర్గ, దానితోపాటు పొత్తికడుపులో నొప్పి వస్తున్నవి. ఈ సమయంలో (4 ఫిబ్రవరి 2014), #1 యొక్క మోతాదు OD కు తగ్గించి, #2 మరియు #3 నిలిపేసి, ఒక నూతన పరిహారం తయారు చేయబడింది:
అపసవ్యమైన బహిష్టు, యోని ఉత్సర్గ కొరకు:
#4. CC8.5 Vagina & Cervix + CC8.8 Menses Irregular...6TD
అభ్యాసకుడు రోగికి ప్రోటీన్ పౌడర్ ని తీసుకోమని, ఎక్కువగా నీరు త్రాగమని సలహానిచ్చిరి. 2 నెలలతర్వాత (7 ఏప్రిల్ 2014) రోగి తనకు మూర్ఛలు, తలనొప్పులు, కడుపులో వికారం, బహిష్టు సమస్యలు అన్నీ పూర్తిగా నయమైనట్లు చెప్పినది. ఆమె చికిత్స మరి కొన్నాళ్లు కోరింది. అందువలన #1 ని OD కొనసాగించి, #4 ని BD కి తగ్గించిరి. మరో 2 నెలలతర్వాత (3 జూన్ 2014) మరో కాంబో చేర్చబడినది:
శరీర వ్యవస్థ ప్రక్షాళనకు:
#5. CC17.2 Cleansing…TDS ఒక నెలకు మాత్రమే, నీరు అధికంగా తీసుకొనవలెను.
రోగి ప్రక్షాళణా చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినది. అక్టోబర్ 2015 నాటికి, ఆమెకు మూర్ఛలు తిరిగి రాకుండా నివారించడానికి #1 ... OW నిర్వహణ మోతాదుని కొనసాగించినది.
సంపాదకునివ్యాఖ్య: 108CC బాక్స్ వున్న అభ్యాసకులు #1 కు బదులు CC12.2 పిల్లల టానిక్+ CC18.3 మూర్ఛతో భర్తీ చేయవచ్చు.