కంటికి గాయం 02711...Malaysia
62 సంవత్సరాల వయసుగల ఒక మహిళ ప్రమాదవశాత్తు కళ్ళజోడు యొక్క కొసతో తన ఎడమ కంటిని పొడుచుకుంది. దీనివల్ల కంటిలో ఒక రక్తనాళం పగిలిపోయి, కంటిగుడ్డు పూర్తిగా ఎర్రబడి వాచిపోయింది. ఈ విధంగా ఎర్రబడిన కంటిని ఇతరులు చూడకుండా మరియు పిల్లలు భయపడకుండా ఉండడానికి ఈమె నల్ల కళ్ళద్దాలు పెట్టుకునేది. ఈమె యొక్క వైద్యుడు ఈమెకు పెయిన్ కిల్లెర్లు మరియు ఆంటిబయాటిక్లు ఇచ్చి మరో మూడు వారాలలో ఈమెకు పూర్తిగా తగ్గే అవకాశముందని చెప్పారు. వైధ్యుడను సంప్రదించిన మూడు రోజుల తర్వాత, వైధ్యుడుచే ఇవ్వబడిన మందుల కారణంగా రోగికి వికారం కలగడం వల్ల, వైబ్రో చికిత్సా నిపుణులను సంప్రదించింది. ఈమెకు క్రింది మందులు ఇవ్వబడినాయి:
NM17 Eye + BR 20 Eye + BR21 Injury + SM41 Uplift…TDS
మూడు రోజుల తర్వాత కంటి ఎరుపు పూర్తిగా తగ్గిపోయింది. ఒక వారం రోజులలో రోగి యొక్క కన్ను సాధారణమైన స్థితికి చేరుకోవడంతో ఆమె చాలా సంతోషపడింది.
గమనిక:
పైనున్న మందులకు బదులుగా 108 కామన్ మిశ్రమాల పెట్టెలో ఉన్న CC7.1 Eye tonic + CC7.6 Eye injury ఇవ్వవచ్చు.