మూత్రాశయపు వుధృత, అస్వాధీనత 03507...UK
2015 ఏపిల్ 21 న 79 సం.ల. వృద్దుడు మూత్రాశయపు అనారోగ్యంవల్ల మూత్రము ఆపుకోలేక, బాధతో వచ్చారు. 15సం.ల క్రితం, అతను ప్రోస్టేట్ క్యాన్సర్తో బాధపడుతూ, దానికి శస్త్రచికిత్స (radical prostatectomy) కూడా చేయించుకున్నారు. శస్త్రచికిత్స తర్వాత కొంత కండర కణజాల మచ్చ ఏర్పడింది. దీని కారణంగా, మూత్రాశయం సామర్ధ్యం తగ్గి, చాలా తరచుగా మూత్రవిసర్జన, రాత్రిళ్లు మరీ ఎక్కువై ఆపుకొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. రోగికి నిద్ర చెదిరిపోతున్నది. రోగి దీనికోసం ఏ మందులు తీసుకోవడం లేదు. అతనికి క్రింది కాంబో మిశ్రమాలనిచ్చి చికిత్స చేసారు:
CC10.1 Emergencies + CC12.1 Adult Tonic + CC13.2 Kidney & Bladder infections + CC13.3 Incontinence + CC15.1 Mental & Emotional tonic…QDS
4 వారాల తరువాత, కొంత మెరుగయింది, కానీ స్థిరంగా లేదు. కొన్ని రాత్రులు అతను మూత్రవిసర్జనకొరకు బాధపడుతూ ఉంటాడు. జూన్ లో అతని భార్య కాలు విరిగింది. ఆమెకు సహాయపడుతూ, అన్ని గృహకృత్యాలు చేయడంతో, అతను 6వారాల పాటు తన వైబ్రో చికిత్స ను ఆపివేసారు. తన వైబ్రోను పునఃప్రారంభించిన 2 నెలల తరువాత, రోగి తన మూత్రాశయ సమస్యల్లో 50% మెరుగయినట్లు చెప్పారు. అప్పటినుంచి మెరుగుదల కొద్దికొద్దిగా కొనసాగింది. 2015 సెప్టెంబరు26 న, అతను 75% మెరుగుదలను నివేదించారు. రాత్రి సమయాల్లో మూత్రవిసర్జన సమస్య అరుదుగా వుంది. అతను తన మెరుగుదల పట్ల సంతోషంగా ఉన్నారు. అక్టోబర్ 2015 నాటికి, అభ్యాసకుడు సూచించిన మోతాదులో కాంబో మిశ్రమాలను తీసుకొంటున్నారు.