దీర్ఘకాల మైగ్రేన్ తలనొప్పి, చర్మసంబంధిత అలెర్జీ 02802...UK
వైబ్రో వైద్యుని పొరుగునున్న వృద్దులకు సంరక్షకురాలిగా పనిచేసిన 50 ఏళ్ల మహిళ తీవ్ర పార్శ్వపు తలనొప్పి కోసం చికిత్స కోరి వచ్చారు. ఆమె తన జీవితమంతా తీవ్రమైన పార్శ్వపు తలనొప్పితో బాధపడుతూ ఉన్నారు. వికారం, అప్పుడప్పుడూ వాంతులతో చాలా రోజులు ఈ తలనొప్పి అనుభవించారు. సాధారణంగా తలనొప్పికి రోజుకు 8 పారాసెటమాల్ మాత్రలు తలనొప్పికోసం తీసుకుంటూ ఉండేవారు. ఇటీవల, రోగికి ముఖం మీద కాస్త దురదతో ఒక రకమైన చర్మ అలెర్జీని కూడా వచ్చింది. ఆమె దీనికి ఏ మందులు తీసుకోవడం లేదు. 28 జూలై 2015 న, అభ్యాసకుడు ఆమెకు ఈ క్రింది రెమిడీ ఇచ్చారు:
#1. CC4.2 Liver & Gallbladder tonic + CC4.6 Diarrhoea + CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC11.3 Headaches + CC11.4 Migraines + CC15.1 Mental & Emotional tonic + CC21.3 Skin allergies…గంటకొకసారి మైగ్రేన్ తలనొప్పి వున్నంతవరకు వాడవలెను. తర్వాత క్రమంగా OD కి తగ్గించవలెను.
వారం తరువాత రోగి తనకు 75% మెరుగైనట్లు చెప్పారు. 31/2 నెలల తరువాత (17 సెప్టెంబర్ 2015) తిరిగి చూసినప్పుడు, రోగి చాలా సంతోషంగా తనకు పూర్తిగా తగ్గినట్లు చెప్పింది. ఆమె పారాసెటమాల్ ను పూర్తిగా ఆపివేసి, వైబ్రో నివారణ OD మాత్రమే తీసుకుంటున్నది. తలనొప్పి దాదాపు నిలిచినప్పటికీ, ఆమెలో ఇప్పటికీ తన ముసలితల్లి గురించి ఆందోళన, మానసిక ఒత్తిడి వున్నవి. కనుక ప్రస్తుతం గురించే పూర్తిగా ఆలోచిస్తూ, ఆందోళనను తగ్గించుకొని, సానుకూల ఆలోచనలు చేయువిధానాలు ఆమెకు చెప్పబడినది. ఆమె పరిహారం కూడా మార్చబడింది:
#2. CC18.1 Brain disabilities + #1...OD
అక్టోబర్ 2015 నాటికి, ఆమె తన చింతలను భరించగలిగేందుకు పైవిధంగా చెప్పిన మోతాదులో పరిహారం తీసుకుంటున్నది.