మలభాద్దకము,తొడలు,కాళ్ళల్లో ఉబ్బు వ్యాధి (ఇడీమా) 02779...Japan
ఒక 45 ఏళ్ళ మహిళ విపరీతమైన మలభాద్దకము చాలా నెలలు గా బాదపడుతున్నది. దీనితోపాటు తొడలు, కాళ్ళలో ఉబ్బువ్యాది సమస్య కలగడంతో తను మటం వేసుకుని నేలమీద కూర్చోలేకపోయేది. 2011 జూలై 23వ తేదిన ఈమె అభ్యాసకుడిని సంప్రదించింది. ఈ కింద రాయబడిన మందులు ఈమెకు ఇవ్వబడినాయి.
CC4.4 Constipation + CC12.1 Adult tonic + CC13.1 Kidney & Bladder tonic + CC15.1 Mental & Emotional tonic...TDS
మందులు తీసుకున్న మూడు రోజులలోనే ఈమెకు ప్రేగులు కదిలి మలభాద్దకము పూర్తిగా నయమైంది. ఆపై మూడు రోజులకు ఈమెకు ఉబ్బువ్యాది తగ్గి సామాన్యంగా నేలమీద కూర్చోగాలిగింది.ఈమె ఇంకొక్క వారం ఈ మందుల్ని తీసుకుని ఆపివేసింది.
రోగి వ్యాఖ్యానము:
నేను ఈ మందుల్ని కృతజ్ఞ్యత భావం భావముతో తీసుకున్నాను.నాపై అల్లోపతి మందులు పని చెయ్యక పోయేసరికి ఈ చికిత్సా విధము నాకెంతో ఆశ్చర్యము కలిగించింది. నేను భగవాన్ శ్రీ సత్య సాయి బాబావారిని స్వయముగా ఎరుగను, ఐనను నేను నమ్ముతున్న దైవంపై నాకు మరింత విశ్వాసం కలిగింది.