కీళ్ళ భాద 12051...India
ఒక 75 ఏళ్ళ వృద్ధుడు రోజుకి ఒకటి నుండి రెండు కిలోమీటర్లు నడవగలిగేవారు. హఠాత్తుగా 2014 మార్చ్లో ఒక రోజు ఆయిన కుడి మోకాలులో విపరీతమైన నొప్పివల్ల నడవలేక పోయారు. డాప్లర్ సొనోగ్రఫీ, ఎక్సరే, MRI మరియు ఇతర పరీక్షల ద్వారా ఆయన యొక్క కుడి మోకాలులో ఆస్టియో ఆర్థరైటిస్ (కీళ్ళ భాద) ఉందని డాక్టర్ నిర్ధారించారు. ఒక నెల పైన అల్లోపతి మందులు వాడినప్పడికి ఫలితం కనపడలేదు. ఆయిన మరో వైద్యుడిని సంప్రదించినప్పుడు ఆయినకు బయోపెప్తయిడ్లు, కొలాజన్ మరియు సోడియం హ్యాలురోనేట్ కలిపిన మిశ్రమం ఇవ్వబడింది.
ఇదే సమయంలో ఆయినకు వైబ్రో మందులు కూడా ఇవ్వడం జరిగింది
CC12.1 Adult Tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.3 Arthritis + CC20.4 Muscles and Supportive tissue + CC20.5 Spine…QDS
ఒక నెల రోజుల తరవాత ఆయినకు 70% ఉపశమనం కలిగింది. ఇదే మందుల్ని ఆయినకు చిటికడు విభూతి మరియు ఆలివ్ ఆయిల్లో కలిపి మోకాలు మీద వ్రాయడానికి ఇవ్వబడింది. ఇలా చేయడం ద్వారా ఆయినకు అద్భుతమైన ఫలితం లభించింది. మరో నెల తరవాత ఆయిన సాధారణంగా నడవగలిగాడు. మోకాలు మీద మందు మరియు విభూతి కలిపిన ఆలివ్ ఆయిల్ వ్రాయడం వలన ఉపశమనం మరింత వేగంగా లభించిందని ఆయిన గమనించారు.
ఇంత ఉపశమనం కలగడంవలన ఆయిన యొక్క డాక్టర్ అల్లోపతి మందుల మోతాదు వారానికి ఒకసారిగా తగ్గించారు. 2014 డిసంబర్ నుండి ఆయిన కీళ్ళ భాద సంభందించిన మందుని రోజువారి రెండుసార్లు (BD) తీసుకుంటూ మరియు ఒకసారి (OD) మోకాలు పైన వ్రాస్తున్నారు. కొన్ని నెలల క్రితం అసాధ్యం అనిపించిన పని ఇప్పుడు సాధ్యమైనందుకు చాలా సంతోషంగా ఉందని ఆయిన చెప్పారు. భగవానియొక్క అపారమైన కరుణ వల్ల ఆయినకి నయమైందని, స్వామికి కృతజ్ఞ్యతలు తెలుపుకున్నారు.