పారాడెంటోసిస్ 01619...Serbia
2014 జూన్ 5 వ తేదీన 45 సంవత్సరాల మహిళకు క్రింది దవడలో పారాడెంటోసిస్ కలిగింది. దీని వలన ఆమెకు తీవ్రమైన మంట, పళ్ళు ఊగిపొతున్నట్లు, ఇంకా చిగుళ్ళు ఎరుపెక్కి బాధాకరంగా ఉండసాగాయి. ప్రాక్టీషనర్ వద్దకు రాకముందు 20 రోజులుగా దంత వైద్యుని వద్దకు వెళుతూనే ఉన్నప్పటికీ తగ్గక పోవడంతో పళ్ళు పీకివెయ్యాలని చెప్పారు. కనుక పేషంటు వై బ్రో రెమిడి తీసుకోవాలని నిశ్చయించారు.
ఈమెకు క్రింది రెమిడి ఇవ్వబడింది :
NM89 Mouth & Gum + NM113 Inflammation + SR293 Gunpowder...TDS.
ఈమె మరే చికిత్స తీసుకోకుండానే 15 రోజులలో వ్యాది లక్షణాలు పూర్తిగా మాయమయ్యాయి. ఐనప్పటికీ ఈమె మరో మూడు నెలల పాటు రెమిడి తీసుకోవడంతో చిగుళ్ళు గట్టిపడి తర్వాత ఒక్క పన్ను కూడా ఊడలేదు.
పేషంటు వ్యాఖ్య:
2014 జూన్ నుండి నేను పారాడెంటోసిస్ వ్యాధితో బాధపడుతున్నాను. నా డాక్టరు పళ్ళను పీకివెయ్యాలని చెప్పారు. వైబ్రో రెమిడి తీసుకున్న తర్వాత పరిస్థితి మారిపోయింది ఇప్పుడు పండ్లను పీకవలసిన అవసరమే లేదు. ఇవి వాడినప్పటి నుండి నాకు ఏ సమస్యా లేకుండా ఆనందంగా ఉన్నాను.