కండరము ములు మరియు నాడీ తంతువుల వద్ద అస్వస్థత (మాయాస్తెనీయ గ్రావిస్) 10001...India
55 సంవత్సరాల మహిళా సహాయక చికిత్సా నిపుణురాలు 2001 నుండి మాయాస్తెనీయ గ్రావిస్ వ్యాధితో బాధ పడుతూ 2014.జూన్ నెలలో ప్రాక్టీ షనర్ ను సంప్రదించారు. ఆమె శరీరంలో కండరాలన్నీ ఈ వ్యాధికి గురయ్యాయి. కానీ ముఖ్యంగా ఈమెకు గల మూడు సమస్యలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. అవి 1. ఈమెకు ద్వంద్వ దృష్టి (వస్తువులు రెండుగా కనబడడం) ఉండడంతో దృష్టిని ఒకే చోట నిలపలేరు. దీనివలన ఆమె 15 నిమిషాలకు మించి చదవలేరు. రాత్రి పూట అసలు చదవలేరు 2. ఈమె గొంతులోని కండరాలు చాలా బలహీనంగా ఉంటాయి అందువలన ఆమె అలసిపోయినపుడు నాలుక బరువెక్కిపోయి ఆమె మాట్లాడలేని స్థితి ఎదురవుతోంది. 3. చివరగా ఈమె భుజాలు బరువుగా ఉండి త్వరగా అలసటకు గురియవుతాయి. ఇంతేకాకుండా ఈమెకు మాయాస్తెనీయ గ్రావిస్ వ్యాధికి సంబంధించిన స్వాదీనములో లేని మూత్ర విసర్జన వంటి సమస్యలు కూడా ఉన్నాయి.
ఇవేకాక అదనంగా వీరికి 2011 నుండి స్టెరాయిడ్స్ వాడడం ద్వారా వచ్చిన మధుమేహ వ్యాధి, ఇంకా 2013 నుండి హైపో థైరాయిడిజం వ్యాధి కూడా ఉన్నాయి. మందులు తీసుకుంటూ ఉన్నప్పటికీ వీరికి రక్తంలో చెక్కెర శాతంలో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. ఐనప్పటికీ ప్రస్తుతం వీరు ఈ రెండు వ్యాధులకు అలోపతి చికిత్స తీసుకుంటూ ఉన్నారు. వీరి ఎనర్జీ లెవెల్ కూడా చాలా తక్కువగా ఉన్నట్లు ప్రాక్టీషనర్ గుర్తించారు. ప్రాక్టీషనర్ వీరికి క్రింది రెమిడి లు ఇచ్చారు:
బలహీన కండరాలకు, మూత్రం ఆపుకోలేని తనానికి, శక్తికోసం :
#1. CC13.3 Incontinence + CC18.4 Paralysis + CC20.4 Muscles & Supportive tissue + NM2 Blood + NM3 Bone I + NM5 Brain TS + NM7 CB7 + NM12 Combination 12 + NM17 Eye + NM21 KBS + NM45 Atomic Radiation + NM48 Vitamin Eye Compound + NM63 Back-up + NM86 Immunity + NM90 Nutrition + NM104 Tops + BR18 Circulation + BR23 Skeletal + SM14 Chemical Poison + SM26 Immunity + SR233 Ruby + SR281 Carbo Veg + SR291 Gelsemium 200C + SR360 VIBGYOR + SR374 Causticum 1M...TDS
మధుమేహ వ్యాధికి :
#2. CC6.3 Diabetes + CC12.4 Autoimmune diseases...BD, మధ్యాహ్నo మరియు రాత్రి భోజనo చేసిన 30 నిమిషాల తరువాత
అలసట/నిస్సత్తువ కోసం :
#3. SR221 Heart Chakra + SR223 Solar Plexus...అవసరం మేరకు
#4. Nosode made from the allopathic medicines Wysolon, Shelcal, Glycifase, Zivast, Thyronorm, Gemohos, Folytrax, Multivitamin and Vitamin D...TDS
#5. Blood nosode...BD, ఖాళి కడుపుతో ఉదయము మరియు సాయంత్రం
మూడు నెలల తర్వాత పేషంటుకు మాట్లాడే శక్తి 70 శాతం పెరిగడమే కాక ఆమె భజనలు కూడా పాడగలుగుతున్నారు. వీరి దృష్టి కూడా 30 శాతం మెరుగవడంతో ఒకేసారి అరగంట సేపు చదవగలగడమే కాక రాత్రిపూట కూడా కొన్ని నిముషాలు చదవ గలుగుతున్నారు. వీరికి రక్తంలో చెక్కెర శాతం కూడా పైన ఇచ్చిన మందుల వల్ల స్థిర పడ్డాయి. వీరి థైరాయిడ్ పని తీరు లో మార్పు ఏమీ లేదు కానీ మొత్తంగా వీరికి ముఖ్యంగా #3, వలన నిస్సత్తువ పోయి బలం చేకురినట్లు అనిపించింది. 2014 సెప్టెంబర్ నాటికి వీరు వైబ్రో రెమిడిలు వాడుతూనే ఉన్నారు. అలోపతి ద్వారా MG వ్యాధికి చికిత్స లేని తరుణంలో సంజీవని లా వైబ్రో రెమిడి లు లభించాయని అందువలన ఎంతో ఆనందంగా ఉందని వీరు తెలిపారు.