చేతి చర్మము పైన దద్దుర్లు 02806...Malaysia
59 సంవత్సరాల మహిళ చేతుల పైన మరియు అరికాళ్ళకింద దద్దుర్లు మరియు దురద అనే సమస్యతో ప్రాక్టీ షనర్ ను సంప్రదించారు. గత 6 నెలలుగా ఈ సమస్య ఆమెను బాధిస్తోంది. ముఖ్యంగా ఆమె వ్రేళ్ళ ద్వారా ఏర్పడిన సమస్య మరీ బాధిస్తోంది. ఈ దద్దుర్లు ఉన్నచోట ఆమె వ్రేళ్ళవద్ద చర్మము పగిలి ఉన్నట్లు ( క్రింది ఫోటోలు గమనించండి ) ప్రాక్టీషనర్ గుర్తించారు. ఆమె వ్రేళ్ళ చివర్లలో బొబ్బలు కూడా ఉన్నట్లు ప్రాక్టీషనర్ గుర్తించారు. బాధ ఉపశమనం కోసం ఈవిడ ఒక స్టెరాయిడ్ క్రీం ( బెటాసాలిక్) మరియు ఎలర్జీ నిరోధానికి యాంటీ హిస్టామినిక్స్, ఉదయం అరస్ 10 mg రాత్రి అటారక్స్ మందులు వాడుతున్నారు. ఐతే ఆమె ఈ మందులు ఆపివేయాలని నిశ్చయించుకున్నారు.
2014 మే 10 వ తేదీన ప్రాక్టీషనర్ క్రింది రెమిడి ఇచ్చారు:
CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.3 Skin allergies + CC21.5 Dry sores ...90 మీ.లీ.నీటిలో 6 గోళీలు వేసుకొని ప్రతీ 6 గంటలకు ఒక చెంచా
పైన పూత గా రాయడానికి వీరు CC21.3 Skin allergies + CC21.5 Dry sores, ప్రతీ రెమిడి ౩ చుక్కలు మృదువుగా ఉండే లిక్విడ్ పారఫిన్ క్రీం లో కలిపి BD గా రాసుకునేందుకు సూచించారు.
3 వారాల తర్వాత అనగా 2014 మే 31వ తేదీన పేషంటు తన వ్రేళ్ళ పైన పొక్కులు గతంలో కన్నా వేగంగా మానిపోయాయని చెప్పారు. గతంలో ఇలా మానడానికి 7 రోజులు పట్టేదని ప్రస్తుతం 2 రోజులలోనే తగ్గిపోయిందని చెప్పారు. అలాగే దురద కూడా చాలావరకు తగ్గిపోయిందని చెప్పారు. అలాగే పైన పూతగా ఇచ్చిన క్రీం అద్భుతంగా పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉందని దీనిని ఇలాగే వాడడానికి నిశ్చయించుకున్నట్లు తెలిపారు. 2014 జూన్ 5 నాటికి మొట్టమొదట వచ్చిన వ్యాధి లక్షణాలు 90% తగ్గిపోయాయని తెలిపారు. క్రింద ఫోటోలు కూడా ఇవ్వబడ్డాయి. ప్రాక్టీ షనర్ ను మరలా సందర్శించే నాటికి అనగా 2014, ఆగస్టు 28 నాటికి పేషంటు యొక్క చర్మ వ్యాధి పూర్తిగా తగ్గిపోయినప్పటికీ మరల రెమిడి రిఫిల్ చేయించుకోవలసిందిగా సూచింపబడ్డారు.
మే 10 (ఎడమవైపు ) మరియు జూన్ 5 (కుడివైపు ) 2014, కుడి చూపుడు వేలును చూడండి:
మే 10వ తేదీ (ఎడమవైపు ) మరియు జూన్ 5వ తేదీ (కుడి వైపు ) 2014, ఎడమ బొటన వేలు క్రింద భాగం చూడండి:
మే 10వ తేదీ (ఎడమవైపు ) మరియు జూన్ 5వ తేదీ (కుడి వైపు ) 2014, కుడి బొటన వేలు క్రింద భాగం చూడండి::