మూసి ఉన్న స్థలాలను చూసి భయపడే వ్యాధి 02806...Malaysia
74 సంవత్సరాల పెద్దమనిషి గత 7 సంవత్సరాలుగా క్లాస్త్రోఫోబియా వ్యాధితో బాధ పడుతున్నారు. మూసి ఉన్న స్థలాలకు అనగా లిఫ్టులు, మరుగుదొడ్లు, విమానాలు, ఇంకా ఏమైనా ఇరుకుగా ఉండే ప్రదేశాలకు వెళ్ళినపుడు వీరు విపరీతంగా భయపడుతూ ఉంటారు. వెంటనే అక్కడ నుండి పారిపోయి విశాలంగా ఉండే ప్రదేశానికి చేరుకోవలసిందే. వీరు ఒక మానసిక చికిత్సా నిపునుడిని, చివరి ప్రయత్నంగా ఒక హిప్నాటిస్ట్ ను కూడా సంప్రదించారు కానీ ఫలితం లేదు.
2014,ఫిబ్రవరి 18 న వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC15.2 Psychiatric disorders…TDS
మార్చి 3 వ తేదీ న వీరు రెండవసారి వచ్చినపుడు తనకు రెమిడి తీసుకున్న మూడు రోజుల లోనే వ్యాధి పూర్తిగా నయమయ్యిందని తను మామూలు మనిషి నయ్యానని చెప్పారు.