శిశువులో యాంజియోమా (angiomaoma) 02640...India
నాలుగు నెలల వయసున్న ఒక చిన్ని బిడ్డను యాంజియోమా చికిత్సకోసం తీసుకువచ్చారు. ఆ పిల్లవాడు చాలా చిన్న వయసులో ఉన్నందున అల్లోపతి వైద్యులు చికిత్స చేయలేదు. అతను చాలా బలహీనంగా ఉన్నందున శిశువుకు సంవత్సరం వయసు వచ్చే వరకూ వైద్యులు శస్త్రచికిత్స చేయలేమన్నారు. ఆ పిల్లవానికి జ్వరం, జలుబు మరియు దగ్గు ఉంది. బాలుడిని వారి అల్లోపతి కుటుంబ వైద్యుడు అయిన అభ్యాసకుని వద్దకు తీసుకు వచ్చినప్పుడు చాలా బలహీనంగా ఉన్నాడు. పిల్లవానికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:
#1. CC9.2 Infections acute + CC19.2 Respiratory allergies + CC19.6 Cough chronic + NM6 Calming: 2 గోళిలు అర కప్పు మరిగించి చల్లార్చిన నీటిలో…TDS. అభ్యాసకుడు మొదటి మోతాదు ఇచ్చారు. శిశువుకు తొమ్మిది నెలల వయసు వచ్చే వరకు నీటిలో నివారణ ఇవ్వమని కుటుంబానికి సూచించారు. ఆ తర్వాత మాత్రలు నేరుగా శిశువు నోటిలో వేయడానికి సూచించబడింది. తీవ్రమైన సమస్యలు ముగిసిన తర్వాత క్రింది రెమిడీ ఇవ్వబడింది :
#2. NM6 Calming + NM27 Skin + NM113 Inflammation + SR293 Gunpowder + SR528 Skin + SR576 Tumours…BD
ఆరు నెలల చికిత్స అనంతరం, కణితి చాలాచోట్ల కనుమరుగయ్యింది, మరియు ఇది చర్మంతో చాలా వరకు కలిసిపోయింది ఇది చాలా అద్భుతమైన కేసు. శిశువుకు ఇప్పుడు 30 నెలల వయసు వచ్చేసరికి పూర్తిగా నయం అయిపోయింది. చర్మంలో అక్కడక్కడ కొన్ని మచ్చలు ఉన్నాయి కానీ ఆందోళన చెందడానికి ఏమీ లేదు. పిల్లవాడు పూర్తిగా నయం అయినందుకు ఆనందంగా ఉన్నాడు. అతనికి ఇప్పటికీ అదే రెమిడి ఇవ్వబడుతోంది.