అరికాళ్లలో మంట 11632...India
2022 సెప్టెంబరులో, 54 ఏళ్ల వయస్సు గల ఒక పురుష ఉపాధ్యాయుడికి పాదాల అడుగుభాగంలో మంట ప్రారంభమైంది. ఇది ఆరు నెలల ముందు తీసుకున్న COVID-19 బూస్టర్ టీకా వల్ల వచ్చి ఉండవచ్చని భావించారు. ఉదయం ఈ మంట స్వల్పంగా ఉండేది, కానీ రోజు గడిచేకొద్దీ పెరిగి రాత్రికి భరించలేనంతగా మారేది. పాదాలను మంచు నీటిలో ఉంచితే తాత్కాలికంగా ఉపశమనం లభించేది. 2022 అక్టోబర్ 3న, సెన్సరీ నర్వ్ పరీక్షలు మరియు రక్త పరీక్షలు నిర్వహించగా నరాలకు ఎటువంటి నష్టం లేదని తేలింది. అయితే, యాదృచ్ఛిక రక్తంలో చక్కెర (Random Blood Sugar) 225 mg/dLగా ఉండటంతో ఆహార నియమాలు పాటించాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని వైద్యులు సూచించారు. పాదాల మంట కోసం మాత్రలు కూడా ఇచ్చారు. వాటిని రెండు నెలలు వాడినా ప్రయోజనం కనిపించలేదు.
2022 డిసెంబరులో, ఆయనకు విటమిన్ B12 లోపం ఉన్నట్లు నిర్ధారణ అయింది. దానికి B12 ఇంజెక్షన్లు ఇవ్వగా మంచి ఉపశమనం లభించింది. అయితే, ఒక నెల తర్వాత మళ్లీ పాదాల మంట తిరిగి వచ్చింది. ఇదే సమయంలో, రక్తంలో చక్కెర స్థాయిలు నిరంతరం ఎక్కువగా ఉండటంతో వైద్యులు మెట్ఫార్మిన్ మరియు గ్లైకోమెట్ మందులు ప్రారంభించారు. దీంతో మధుమేహం నియంత్రణలోకి వచ్చినప్పటికీ, పాదాల మంట మాత్రం కొనసాగింది. అందువల్ల, 2024 మే 6న ఆయన ఒక ప్రత్యామ్నాయ ప్రాక్టీషనర్ని సంప్రదించగా ఈ క్రింది చికిత్స అందించారు:
#1. CC3.7 Circulation + CC18.5 Neuralgia + CC20.4 Muscles & Supportive tissue…BD ఆవ నూనెతో బాహ్యంగా రాయడానికి
#2. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + #1…TDS
చికిత్స పురోగతి:
Ø 9 మే 2024: అరికాలు మంట సుమారు 30% తగ్గుదల కనిపించింది.
Ø 19 మే 2024: ఉపశమనం 80% వరకు కలిగింది.
Ø 20 జూన్ 2024: అరికాలు మంట పూర్తిగా తగ్గిపోయింది. #1 పూర్తిగా నిలిపివేశారు.
Ø 19 జులై 2024: #2 ను OD కి తగ్గించారు. రోగి తన ఇష్టప్రకారం దానిని కొనసాగిస్తునే వున్నారు.
2025 జూన్ నాటికి, పాదాల మంట మళ్లీ తిరిగి రాలేదు మరియు రోగి ఆరోగ్యంగా ఉన్నారు. అయన మధుమేహం నియంత్రణ కోసం అల్లోపతి మందులను మాత్రం కొనసాగిస్తున్నారు.