నిద్రలేమి 11669...India
ప్రాక్టీషనర్ కు పొరుగునున్న 65 సంవత్సరాల వయస్సు గల ఒక మహిళ రెండు సంవత్సరాలకు పైగా తీవ్రమైన నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఆమె ప్రతిరోజూ రాత్రి 10 గంటలకు పడుకున్నప్పటికీ, నిద్ర పట్టడానికి సుమారు ఒక గంట సమయం పట్టేది. అనంతరం కేవలం 3 నుంచి 4 గంటలకే మేల్కొని, మిగిలిన రాత్రంతా మళ్లీ నిద్రపట్టక ఇబ్బంది పడేవారు. వారానికి సుమారు రెండు రోజులు పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉండి, కేవలం 2 నుంచి 3 గంటల నిద్ర మాత్రమే లభించేది.
2014 వరకు ఆమెకు ప్రతిరోజూ 8 నుంచి 9 గంటల పాటు ప్రశాంతమైన, నిరాటంకమైన నిద్ర ఉండేది. అయితే, అదే సంవత్సరం ఆమె కుమార్తెలు శాశ్వతంగా ఆస్ట్రేలియాకు వెళ్లిన తరువాత, భావోద్వేగ ఒత్తిడి కారణంగా ఆమె రాత్రి నిద్ర 5 నుంచి 6 గంటలకు తగ్గిపోయింది. ఈ పరిస్థితి జూలై 2022 వరకు కొనసాగింది.
ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనం అనంతరం ఒక గంట పాటు నిద్రపోయినప్పటికీ, రాత్రి సరిపడా నిద్ర లేకపోవడంతో ఆమె రోజంతా అలసట, మగతతో బాధపడుతూ, ఇంటి పనులు చేయడం కూడా కష్టంగా మారింది. అదనంగా, కళ్ల కింద నల్లటి వలయాలు (డార్క్ సర్కిల్స్) ఏర్పడ్డాయి. వీటికి కూడా తగినంత నిద్ర లేకపోవడమే కారణమని ఆమె భావించారు.
30 నవంబర్ 2024 న ఆమెకు ఈ క్రింది వైబ్రియానిక్స్ రెమెడీ ఇవ్వబడింది:
CC15.6 Sleep disorders… ప్రతి రాత్రి నిద్రకు అరగంట ముందు ఒక మోతాదు.
చికిత్స పురోగతి:
Ø 7 డిసెంబర్ 2024: రెమెడీ తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే నిద్ర పట్టడం ప్రారంభమైంది.
Ø 15 డిసెంబర్ 2024: గత వారం రోజులుగా 4 నుంచి 5 గంటల పాటు నిరాటంకంగా, ప్రశాంతమైన నిద్ర లభించింది.
Ø 22 డిసెంబర్ 2024: గత వారం రోజులుగా 5 నుంచి 6 గంటల పాటు గాఢమైన నిద్ర లభించింది. పగటి సమయంలో ఉల్లాసంగా, శక్తివంతంగా అనిపించింది.
Ø 30 జనవరి 2025: రెమెడీ నిలిపివేయబడింది.
జూన్ 2025 నాటికి కూడా ఆమె ప్రశాంతమైన నిద్రను కొనసాగిస్తూ, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. అంతేకాకుండా, కళ్ల కింద ఉన్న నల్లటి వలయాలు పూర్తిగా మాయమయ్యాయి.