చర్మము పై ఎలెర్జీ 11658...India
45 ఏళ్ల మహిళ కు గత 30 సంవత్సరాలుగా సబ్బు, లేదా కూరగాయలను తాకినప్పుడల్లా ఆమె రెండు చేతులకు ఎలర్జీ వచ్చేది. ఆమె అరచేతులు నల్లబడి గుర్తించదగిన గీతలు మరియు కోతలు ప్రత్యేకించి ఆమె గోళ్ళ చుట్టూ కనిపిస్తాయి. నెలకు ఒకసారి ఈ కోతలు రక్తస్రావం కలిగించడమే కాక జ్వరం కూడా వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఆమె అరచేతులు దురదగా ఉంటాయి. ఆమె ఆయుర్వేద క్రీం పెట్రోలియం జల్లి మరియు ఆవాల నూనెను ఆశ్రయించగా అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగించింది. దీంతో ఆమె రోజువారి పనులు ఎవరి సహాయం లేకుండా చేయడం కష్టంగా మారింది. ఆమె తన తండ్రి లో ఇలాంటి పరిస్థితిని చూసినందున ఇది నయం చేయలేని వ్యాధిగా భావించి ఏ వైద్యుడిని సంప్రదించలేదు. వైబ్రియానిక్స్ సమర్థత గురించి తెలుసుకున్న తర్వాత ఆమె వెంటనే 2023 డిసెంబర్ 28న ప్రాక్టీషనర్ను సంప్రదించి క్రింది రెమిడి పొందారు:
CC21.3 Skin allergies + CC21.5 Dry Sores...TDS శుద్ధమైన కొబ్బరి నూనెలో బాహ్య అనువర్తనం కోసం…BD
ఆమె తన సాధారణ క్రీములు మరియు నూనెను పూయడం మానేశారు, డిసెంబర్ 30న మూడు రోజుల్లో ఆమె తన లక్షణాల్లో 80% ఉపశమనాన్ని పొందారు, అతి త్వరలోనే 2024 జనవరి 2 నాటికి ఇది 100% పెరిగింది. ఇంత త్వరగా స్వస్థత చేకూరడం చూసి ఆమె చాలా ఆశ్చర్యపోయారు. రోగ లక్షణాలు పెంచే సాధారణ ప్రేరేపితములకు నిరంతరం గురియైనప్పుడు కూడా ఎటువంటి అలర్జీ జాడలేదు. మౌఖికంగా తీసుకొనే రెమిడీ ఒక్ వానికి BD అనంతరం మరో వారానికి OD కి తగ్గించబడింది మరియు ఫిబ్రవరి 5న ఆపడానికి ముందు క్రమంగా తగ్గించబడింది. బాహ్య అనువర్తనం కోసం రోగి రెమిడీ కొనసాగించడానికి ఇష్టపడడంతో OD కి తగ్గించబడింది. ఆమె వైబ్రియానిక్స్ కు అపారమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ తన ఇద్దరు స్నేహితులను ప్రాక్టీషనర్ కు సూచించారు.
2024 ఏప్రిల్ నాటికి ఎటువంటి పునరావృతం లేదు.
పేషెంట్ వాంగ్మూలము:
“నా యుక్తవయసు నుండి అరచేతులపై చర్మ అర్జీ కారణంగా నేను ఎలాంటి ఇంటి పనులు చేయలేకపోయాను. పెళ్లయిన తర్వాత ముగ్గురు పనిమనుషులపై పూర్తిగా ఆధారపడి ఉండేదానిని, వారు నా పనంతా చేసేవారు. కానీ వైబ్రియానిక్స్ తీసుకున్న తర్వాత నా అరచేతులకు ఎటువంటి అలర్జీ లేకుండా పోవడంతో నేను నా రోజువారి పనులన్నింటిని చేయగలగడం చూసి ఆశ్చర్యపోయాను. నా అరచేతులు ఇప్పుడు చాలా మృదువైనవి గానూ మరియు ఎటువంటి గాట్లు లేకుండా ఉన్నాయి. ఈ ఉచిత సేవకు నేను కృతజ్ఞు రాలిని. ఇప్పుడు నా కుమార్తె తన కాళ్ళపై వెరికోస్ వీన్స్ కు కూడా మందు తీసుకుంటుంన్నది. వచ్చే నెల నుండి నా మైగ్రేన్ మరియు కండరాల నొప్పుల కోసం అల్లోపతి మందులపై ఆధారపడకుండా వైబ్రియానిక్స్ ను పూర్తిగా నమ్మి ఈ రెమిడీ తీసుకోవాలని భావిస్తున్నాను.”
