Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

గేంగ్రీన్, మధుమేహం 02494...Italy


ప్రశాంతినిలయంలో వైద్యులైన ఒక భార్యాభర్తల బృందం ఇటలీలో జబ్బుతోవున్న తమ మిత్రుడికి ఫోన్ చేసేసరికి అతను ప్రమాదస్థితిలో వున్నాడు. 64 సం.ల వారి మిత్రుడు, గత 30సం.లుగా మధుమేహంతో బాధపడుతూ, ఇన్సులిన్ పై ఆధారపడి ఉన్నా తన ఆరోగ్యంపై తగినంత శ్రద్ద తీసుకోలేదు. మధుమేహం వలన కలిగిన గేంగ్రీన్ సమస్యలవల్ల, అతని కుడికాలి బొటనవేలు తొలగించారు. మిగతా వ్రేళ్ళలో కూడా గేంగ్రీన్ సోకి, ఎముకలకు ఇన్ఫెక్షన్ వ్యాపించింది. అందువలన వైద్యులు త్వరగా శస్త్రచికిత్సచేసి, మోకాలు క్రిందవరకు కుడికాలు తీసేయాలని చెప్పారు. అతను జ్వరంతో బాధపడుతూ మంచానికే పరిమితమైయ్యాడు. అతను చాలా నిరాశ చెంది తనకిక వైద్య చికిత్స వలన కోలుకొనే  అవకాశమే లేదని భావించాడు. పూర్వం అతను వైబ్రియోనిక్స్ చికిత్సను పూర్తిగా నిరాకరించేవాడు. ఇప్పుడు ప్రాక్టీషనర్స్ అతడికి వైబ్రయోనిక్స్ ప్రసారం చేయడానికి, రోగి అనుమతిని అడగగా, వెంటనే అతను అంగీకరించాడు. వైద్యులు తనకి తగిన మందు మిశ్రమం మరియు వైబ్రియో ప్రసారం మర్నాటి ఉదయం చేస్తామని వాగ్దానం చేశారు. ఎందుకంటే అప్పటికే బాగా రాత్రయి, వారు అలిసిపోయారు. కానీ కొంతసేపటికి ఆ రోగి యొక్క  యాతన గుర్తువచ్చి, వారు ఉదయంవరకు ఆగలేక, వెంటనే క్రింది మందు తయారు చేశారు:
NM6 Calming + NM21 KBS + NM32 Vein-Piles + NM36 War + OM3 Bone + BR11 Kidney + SM15 Circulation + SM17 Diabetes + SM26 Immunity + SM27 Infection + SM29 Kidney + SR293 Gunpowder + SR316 Streptococcus + SR457 Bone + SR501 Kidney + SR556 Pyrogenium

వైద్యులు స్వామిని ప్రార్థిస్తూ డిసెంబర్ 8, 2007 న 11:30కు ప్రసారం చేశారు. 10 ని.లలో, రోగికి ఫోన్ చేసి, తాము ప్రసారం చేశామని, మార్పులను గురించి తెలుపమని అతన్ని కోరారు. ఆనందశ్చార్యాలతో, రోగి గతకొద్దినిమిషాల్లో తననొప్పి, జ్వరం పోయాయని చెప్పగా వైద్యులు అతని మాటలు నమ్మలేకపోయారు. వారు మరి కొన్నిరోజులు యంత్రంలో కాంబో 24 గంటలు నిరాటంకంగా ఉంచి ప్రసారాన్ని కొనసాగించారు. రోగి యొక్క కాలు దినదినానికి మెరుగయినది. వారం తరువాత, అతను పరీక్ష కోసం వెళ్లగా, వైద్యులు అతని కాలుకు శస్త్రచికిత్స అవసరం లేదని తెలుసుకొని ఆశ్చర్యపోయారు.

అభ్యాసకుని వ్యాఖ్యానము:
మేము ఇటలీకి తిరిగి వచ్చినప్పుడు, రోగి యొక్క కాలు చాలావరకు నయమైంది. అతను తనకు పిల్ల్స్ తో మధుమేహం చికిత్స కొనసాగించమని మమ్ము కోరాడు. అతనికి విబ్రియోనిక్స్ ప్రభావం తెలిసిందని, మేము చాలా సంతోషించాము. కానీ దురదృష్టవశాత్తు అతని క్రమశిక్షణాలోపం, శ్రద్ధగా సరైన మోతాదులో మందులు వాడక పోవడం వలన అతనికి పూర్తిగా నయమవలేదు.  కొన్నినెలల్లో అతను గుండెపోటువల్ల చనిపోయాడు. అతను తనకి స్వామి ఎంతో కరుణతో ఇచ్చిన అపూర్వ అవకాశాన్ని తెలుసుకోలేకపోయాడు. అందువలన ‘మనకి మనం తోడ్పడితేనే, దేవుడుకూడా తోడ్పడగలడు’ అనే సామెత నిజమైంది. దురదృష్టవశాత్తు, చాలా రోగులకు  ప్రేమ మరియు జ్ఞానంతో ఒక రెమెడీ చేయబడినప్పటికీ, రోగి దానిని క్రమశిక్షణతో తీసుకుంటే తప్ప అది తన ప్రభావం చూపించజాలదు.