శ్వాస కోస అలెర్జీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది 03609...यूएई
45 ఏళ్ల వ్యక్తి, గత 20 సంవత్సరాలుగా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శ్వాసలో గురక, మరియు పొగ వాసన కారణంగా ఛాతీలో బిగింపు (ఇది ఎగువ వెన్నునొప్పికి కారణమవుతున్నది), డస్ట్ అలెర్జీ కారణంగా ముక్కులో అవరోధం వంటి లక్షణాలతో బాధ పడుతూ ఉపశమనం కోసం రోజూ ఇన్హేలర్లు వాడేవారు. చలికాలంలో ఈ లక్షణాలు తీవ్రమవుతూ ఉండేవి. 31 ఆగస్టు 2022న, అతనికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:
#1. CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic…6TD
ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని ఎక్కువగా తినాలని, వంట కోసం కోల్డ్ ప్రెస్డ్ నూనెను వాడాలని, ప్యాక్ చేసిన ఆహారాన్ని తినడం మానేయాలని ప్రాక్టీషనర్ సూచించారు. అలాంటి పద్ధతుల గురించి తెలుసుకున్న పేషంటు ఇప్పుడు వాటిని ఖచ్చితంగా పాటించాలని నిర్ణయించుకున్నారు. అక్టోబరు 8 నాటికి, పొగ లేదా ధూళికి గురిఅయినప్పటికీ అతనికి శ్వాసలో గురక లేదు, మరియు శ్వాస తీసుకోవడంలో 50% మెరుగుదల కలిగింది, అతని వెన్నునొప్పి కూడా దాదాపు అదృశ్యమైపోయింది. అతను వారానికి ఒకసారి మాత్రమే ఇన్‌హేలర్‌ను ఉపయోగించాల్సిన అవసరం కలుగుతోంది, త్వరితగతిన ఏర్పడిన ఈ మెరుగుదల ద్వారా ప్రేరణ పొంది, 10 సంవత్సరాలకు పైగా, బయటి ఆహారం తినడం వల్ల తనకు గ్యాస్, ఉబ్బరం మరియు అజీర్ణం ఏర్పడ్డాయని అయితే ఇంటిలో వండిన ఆహారంతో ఇప్పుడు అలాంటి సమస్యలు ఏమీ లేవని తెలిపారు. కాబట్టి #1 క్రింది విధంగా మెరుగుపరచబడింది:
#2. CC15.4Eating disorders+ #1…6TD
ఒక వారం తర్వాత అతను తన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరింత తీవ్రమైందని కనుక ఇన్హేలర్‌ను కొన్ని సార్లు మాత్రమే ఉపయోగించాల్సి వచ్చిందని తెలుపుతూ అక్టోబర్ 24 న ప్రాక్టీషనర్ ను సంప్రదించగా #2ను నిలిపివేసి, #1 పునరుద్ధరించడంతో పాటు విడిగా #3 ఇచ్చారు.:
#3. CC15.4Eating disorders…TDS
ఒక వారంలో రోగికి శ్వాస, గ్యాస్, ఉబ్బరం మరియు అజీర్ణ సమస్యలలో 75% తగ్గుదల ఏర్పడడంతో #1 TDSకి తగ్గించబడింది. నవంబర్ 24 నాటికి, అతను అన్ని శ్వాసకోశ లక్షణాలలో కనీసం 90% వరకు తగ్గిపోవడంతో అతను ఇన్హేలర్‌ను ఉపయోగించడం మానేశారు. అతను ఇప్పుడు ధూళి మరియు అగరవత్తులనుండి వచ్చే ధూపాన్ని తట్టుకోగలుగుతున్నారు అలాగే అతని వెన్నునొప్పి కూడా పూర్తిగా పోయింది. డిసెంబర్ 15న, #1 BDకి తగ్గించబడింది. 15 జనవరి 2023 నాటికి, అతని లక్షణాలన్నీ మాయమయ్యాయి మరియు #1 ODకి తగ్గించబడింది, దానిని నెమ్మదిగా మరింత తగ్గించి మే నెలలో ఆపివేయడం జరిగింది. #3 మార్చిలో నిలిపివేయబడింది. అతనికి 2022-23 లో శ్వాసకోశ సమస్యలు లేని మంచి శీతాకాలము అనుభవించారు.
10 ఆగస్టు 2023 నాటికి, ఏ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా జీవనం కొనసాగిస్తున్నారు.