చెవి బయట భాగంలో సంక్రమణ (ఇన్ఫెక్షన్), కాళ్ళలో నీరు చేరుట 02711...Malaysia
64 ఏళ్ల మహిళ, గత 3 నెలలకు పైగా, చెవులనుండి, దుర్గంధపూరితమైన ద్రవం కారుతూ బాధపడుతోంది. అంతేకాక 10 రోజులై ఆమెకాళ్లు ఎర్రగా, వాచిపోయేయి. ఇప్పటికే ఆమె జిపి (GP), చెవి సంక్రమణ కోసం యాంటీబయాటిక్స్ మాత్రమేకాక, ఆమె కాళ్లలో నీరు నిలుపుదలకోసం మాత్రలు సూచించిరి. ఆమె కు జూన్ 13, 2011 న క్రింది పరిహారం ఇచ్చిరి:
#1. NM16 Drawing + NM26 Penmycin + NM36 War + OM10 Ear + BR19 Ear…TDS
జూన్ 18న ఆమె తన జిపి (GP) కి, చెవులకు తీసుకుంటున్న యాంటీబయాటిక్స్ వల్ల తీవ్రంగా బాధపడుతున్నందున అవి ఆపేస్తానని, తనకు అనారోగ్యం కలిగించనందున, వైబ్రియోనిక్స్ మాత్రలు మాత్రమే తీసుకుంటానని చెప్పింది. ఆమె జూన్ 20 న తన డాక్టర్ పంపగా 'చెవి, ముక్కు, గొంతు’ నిపుణుని వద్దకు వెళ్లింది. 18 జూన్ న విబ్రో అభ్యాసకుని చూచుటకు మళ్ళీ వెళ్లినప్పుడు, ఆమెకు ఇవ్వబడింది:
#2. NM36 War + OM10 Ear + BR19 Ear...OD సీసాలో మందు పూర్తయేవరకు తీసుకోవలెను.
జూన్ 20 తేదీన నిపుణుడు ఆమె చెవులు పరీక్షించగా, చీము పూర్తిగా మాయమైంది. చెవిలో గులిమి (వేక్స్) తొలగించిన తర్వాత, ఆమె చెవులు మామూలుగా, ఆరోగ్యంగా వున్నట్లు నిపుణుడు చెప్పిరి. 22 జూన్, తదుపరి నియామకంరోజున వెళ్లినప్పుడు, రోగి విబ్రియోనిక్స్ అభ్యాసకునితో గతంకన్నా తన కాళ్ల ఎరుపు, వాపు తగ్గినవని, కానీ ఇప్పుడు రక్త ప్రసరణమీద దానిప్రభావం కలగవచ్చుననే అనుమానం వెలిబుచ్చింది. ఆమెకు ఈ కింది పరిహారాన్ని #2 తో పాటుగా ఏకకాలంలో తీసుకోవలసిందిగా యివ్వడమైనది:
#3. NM32 Vein-Piles + BR18 Circulation + SM15 Circulation + SR539 Vein…TDS
ఆగస్టు 12 న మళ్ళీ వెళ్ళినప్పుడు, రోగి బాహ్య చెవి సంక్రమణంలో వందశాతం మెరుగై, చెవులలో చీము, దుర్వాసన పోయినట్లు తెల్పిరి. ఆమె కాళ్ళలో నీరు చేరుట కూడా మెరుగుపడినట్లు చెప్పిరి. ఆగష్టు 12, 2011 న ఈ క్రింది నివారణలు ఇవ్వబడ్డాయి:
#4. BR18 Circulation + SM6 Stress + SR503 Ligament + SR510 Muscle...TDS
#5. CC12.1 Adult tonic... TDS
మార్చి 2012 న, రోగి తనకాళ్ళ సమస్యలన్నీ పూర్తిగా తగ్గటమే కాక, చివరి రెండు సంబంధమిశ్రమాలవల్ల, నూతనశక్తి పుంజుకున్నట్లు భావిస్తున్నట్లు నివేదించారు.