సక్రమంగా రాని ఋతుక్రమం 11616...India
21 ఏళ్ల యువతికి తొమ్మిదేళ్ల క్రితం రజస్వల అయినప్పటినుండి సక్రమంగా రుతుక్రమం లేదు. ఆమెకు మూడు నెలలకు ఒకసారి మాత్రమే పీరియడ్స్ వస్తూ ఒక్కో ఋతు చక్రం 6 రోజులు కొనసాగుతూ వీనిలో ఎక్కువ రోజుల పాటు అధిక రక్తస్రావం ఏర్పడ సాగింది. ఆమె ఎలాంటి చికిత్స తీసుకోలేదు. వ్యక్తిగత పరిస్థితుల కారణంగా, ఆమె ప్రస్తుతం చాలా ఒత్తిడిలో ఉన్నారు. ఆమెకు చివరి పీరియడ్ 2021 జనవరిలో కలుగగా 2021 మార్చి 11 న ఆమె ప్రాక్టీషనర్‌ను సంప్రదించారు, వీరికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC8.8 Menses irregular + CC15.1 Mental & Emotional tonic…ప్రతీ 10 నిమిషాలకు ఒక మోతాదు చొప్పున 2 గంటల వరకు అనంతరం 6TD
ఆమె తదుపరి ఋతుస్రావం ఏప్రిల్ 15న వచ్చింది, రెండు వారాల పాటు ఉన్నప్పటికీ సాధారణ రక్తస్రావంతో కొనసాగింది. మోతాదు TDS కి తగ్గించబడింది.
రోగి తదుపరి ఋతుక్రమం వరకు TDS లో కొనసాగాలని సూచించినప్పటికీ, ఆమె ఏప్రిల్ 25 నుండి మోతాదును OD కి తగ్గించారు. మే 6న, ఆమె తను ఏమాత్రం వత్తిడిని అనుభవించడం లేదని ప్రాక్టీషనరుకు తెలిపారు. మే మరియు జూన్‌లో రోగికి సాధారణ రక్తస్రావం ఏర్పడి ఐదు రోజులు మాత్రమే ఉంది, కాబట్టి ఆమె జూన్‌లో రెమిడీను తీసుకోవడం మానివేసారు. 2022 మార్చి నాటికి, ఆమెకు 3 నుండి 4 రోజుల పాటు సాధారణ రక్తస్రావంతో రెగ్యులర్ పీరియడ్స్ కొనసాగుతున్నాయి.