చర్మముపై దురద 11592...India
ప్రాక్టీషనర్ తల్లి ఐన 62 మహిళ తన శరీరమంతా దురద మరియు కొన్ని చోట్ల తేలికపాటి దద్దురుతో 15 సంవత్సరాలుగా బాధపడుతున్నారు. సూచించబడిన అల్లోపతి మందులు మూడేళ్లపాటు, ఆయుర్వేద చికిత్స నాలుగేళ్లపాటు తీసుకున్నా ఫలితంలేదు. ఆమె బెండకాయ మరియు పుల్లని ఆకులను తిన్నప్పుడల్లా, దురద తీవ్రమవుతోంది, కాబట్టి ఆమె తన ఆహారం నుండి వీటిని తొలగించారు. ఆమె కుమారుడు పదే పదే విజ్ఞప్తులు చేసినప్పటికీ ఆమె వైబ్రియానిక్స్ చికిత్స తీసుకోవాలనుకోలేదు. ఆమె లక్షణాలు చాలా అధ్వాన్నంగా మారినప్పుడు, ఆమె చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించేవారు, సూచించిన మందులు ఆమెకు కడుపులో చికాకు మరియు వికారం కలిగించగా దానిని ఆమె తట్టుకోలేక పోయారు. కాబట్టి ఆమె ఒక నెల తర్వాత వాటిని ఆపివేసి చివరకు వైబ్రియోనిక్స్ ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. 2018 నవంబర్ 30 న ప్రాక్టీషనర్ తన తల్లికి ఈ క్రింది రెమిడీని ఇచ్చారు:
#1. CC21.2 Skin infections + CC21.3 Skin allergies…TDS
ఒక నెల తర్వాత దురదలో 20% ఉపశమనం లభించింది, అది మరో నెలకి 40%కి పెరిగింది. దద్దుర్లు యొక్క కొత్త మచ్చలు ఏర్పడడంతో ఇవి ఆహార అలెర్జీ వల్ల కావచ్చునని భావించినందున, ప్రాక్టీషనర్ 2019 జనవరి 29 తేదీన రెమిడీ క్రింది విధంగా మెరుగుపరిచారు:
#2. CC4.10 Indigestion + CC21.6 Eczema + #1…TDS
ఫిబ్రవరి 24 నాటికి, అనగా ఒక నెల లోపే రోగికి ఆనందం మరియు ఆశ్చర్యం కలిగించే విధంగా, ఆమె దద్దుర్లు మరియు దురద నుండి 100% ఉపశమనం పొందారు. 2019 ఏప్రిల్ 22 నాటికి రెమెడీని ఆపడానికి ముందు రెండు నెలల వ్యవధిలో డోసేజ్ ODకి ఆపై OWకి తగ్గించబడింది. లక్షణాలు తిరిగి రాలేదు.
మే మొదటి వారంలో, రోగికి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ క్రింది వాటిని అందించారు.
#3. CC12.1 Adult tonic + CC12.4 Autoimmune diseases…OD ఒక సంవత్సరం వరకు
2022 ఫిబ్రవరి నాటికి ఆమె తన ఆహారంలో బెండకాయ మరియు సోరెల్ ఆకులను చేర్చుకోవడంపై ఇంకా భయపడుతూ ఉన్నారు కనుక #2 ను ముందస్తు జాగ్రత్త కోసం OD మోతాదులో సూచించబడింది, ఇది ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. అప్పటి నుండి ఆమె ఎటువంటి ఇబ్బంది లేకుండా అప్పుడప్పుడు పైన పేర్కొన్న కూరగాయలను ఆస్వాదించడం ప్రారంభించారు.