చూపు కోల్పోవడం 11520...India
53 ఏళ్ల వ్యక్తికి 2018 జులై 25 నుండి నుదిటిపై తీవ్రమైన నొప్పి, ముఖం ఎడమవైపు వాపుతో పాటుగా ఎడమ కంటిలో మంట మరియు దృఢత్వముతో (స్టిఫ్నెస్ తో) బాధ పడుతున్నాడు. తర్వాతి కొద్ది రోజులలోనే, అతను ఈ కంటిలో దృష్టిని కోల్పోయారు. రెండు వారాల తర్వాత, అతను నేత్ర వైద్యుడిని చూసినప్పుడు, అతని పరిస్థితి టెంపోరల్ BRVO (బ్రాంచ్ రెటినాల్ వెయిన్ ఆక్యులూజన్, అంటే చిన్న సిరల్లో అడ్డు ఏర్పడడం) అని నిర్ధారణ అయింది. రోగికి గత పదేళ్లుగా అధిక బిపి ఉంది, దీని కోసం అతను ఆల్ప్రాక్స్ 0.5 మి.గ్రా. తీసుకుంటున్నారు. బిపి హెచ్చుతగ్గులే BRVO కి కారణమని కంటి పరీక్షలో నిర్ధారించారు. రక్తం గడ్డలను కరిగించడానికి డాక్టర్ ఐ-సైట్ క్యాప్సూల్స్ మరియు నెపాఫెనాక్ కంటి చుక్కలు మరియు నొప్పి మరియు వాపు కోసం 30,000 ($400) విలువ చేసే ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్‌లను సూచించారు. ఇంజెక్షన్‌లు తన పరిస్థితిని నయం చేస్తాయనే నమ్మకం లేక అతను వాటిని తీసుకోలేదు. 2018 ఆగస్టు 18 నుండి ఇతర రెండు మందులను తీసుకోవడం ప్రారంభించారు. అదే రోజు, అతను ప్రాక్టీషనర్ ను సంప్రదించగా క్రింది రెమిడీ ఇచ్చారు.
#1. NM17 Eye + NM36 War + NM109 Vision + NM113 Inflammation + OM11 Eye + OM25 Eye-Retina + OM26 Eye Muscles + BR20 Eye + SM20 Eyes + SR216 Vitamin-E + SR247 Triple Warmer + SR405 Ruta…6TD
ఏడు వారాల తర్వాత, సెప్టెంబర్ 30 న నొప్పిలో 50% మెరుగుదల మరియు వాపులో 20% మెరుగుదల ఏర్పడింది, అయినప్పటికీ, అతను తీవ్రమైన నొప్పి అనేక సార్లు ఏర్పడుతూ వేదన అనుభవిస్తూ ఉన్నారు. అటువంటి సమయాల్లో సాధారణ 6TDతో పాటు ప్రతీ ఐదు నిమిషాలకు ఒక మోతాదు చొప్పున మొత్తం మూడు డోసులను అదనంగా తీసుకోవాలని ప్రాక్టీషనర్ రోగికి సూచించారు. 10 రోజుల తర్వాత, ఈ తీవ్రమైన నొప్పి యొక్క తరుచదనం గణనీయంగా తగ్గింది మరియు వాపు మరియు మంటలో 100% మెరుగుదల కలిగింది. నవంబర్ 8 న రోగి నొప్పి పూర్తిగా తగ్గిపోయిందని నివేదించారు. ప్రభావితమైన కంటిలో అప్పుడప్పుడు మాత్రమే దృఢత్వం ఉంటోంది. ఇప్పుడు కొన్ని రెమిడీలు అవసరం లేనందున, #1 క్రింది విధంగా సవరించబడింది.
#2. NM36 War + NM109 Vision + OM25 Eye-Retina + OM26 Eye Muscles + BR20 Eye + SM20 Eyes + SR216 Vitamin-E + SR247 Triple Warmer + SR405 Ruta…6TD
2019 జనవరి 30 న చూపు కోల్పోవడం తప్ప, తనికు ఏ ఇతర కంటి సమస్యలు లేవని రోగి తెలిపారు. అల్లోపతి మందులు చూపు పునరుద్ధరణకు సహాయం చేయనందున మరియు రోగ నిరూపణ సరిగా లేనందున వాటిని నిలిపివేయమని అతని వైద్యుడు అతనికి సలహా ఇచ్చారు.
తీవ్రమైన కాంతి నుండి దూరంగా ఉండాలని మరియు ఆరోగ్యకరమైన కుడి కన్ను ఒత్తిడికి గురికాకుండా ఉండటానికి ఎక్కువసేపు టీవీ, కంప్యూటర్ లేదా మొబైల్ ఉపయోగించవద్దని ప్రాక్టీషనర్ రోగికి సూచించారు. నాలుగు నెలల తర్వాత, మే నెలలో ఇప్పుడు తను చిత్రాలను రేఖమాత్రంగా చూడగలుగుతున్నానని సంతోషంగా తెలియ జేసారు! మోతాదు QDSకి తగ్గించబడింది మరియు ప్రాక్టీషనర్ అదే రెమిడీ OD గా ప్రసారం చేయడం ప్రారంభించారు.
మరో రెండు నెలల తరువాత, జూలైలో, రోగి ఎటువంటి రంగు లేకుండా నలుపు చిత్రాలను చూడగలిగారు, మరియు సెప్టెంబర్ 9 నుండి, అతను సుదూర చిత్రాలను మాములుగానే చూడగలుగుతున్నారు కానీ ఇప్పటికీ అక్షరాలు చదవలేకపోతున్నారు. మోతాదును TDSకి తగ్గించి, హృదయపూర్వకమైన ప్రార్థన తో ప్రసారాన్ని కొనసాగించారు. ఒక నెల తర్వాత, అక్టోబర్ 10న, అతను కొన్ని అక్షరాలు అలలుగా మరియు అస్పష్టంగా కనిపించినప్పటికీ వాటిని గుర్తించగలిగారు. నవంబరులో, రోగి మరియు ప్రాక్టీషనర్ ఇద్దరినీ అమిత ఆనందమునకు గురిచేస్తూ అతని దృష్టి పునరుద్ధరించబడింది. అతను ఇప్పుడు ప్రతిదీ స్పష్టంగా చూడగలుగుతున్నారు. ప్రసారం నిలిపివేయబడింది. మోతాదు నెమ్మదిగా OWకి తగ్గించబడి చివరకు 2020 జనవరి 10 న ఆపివేయబడింది. 2022 ఏప్రిల్ నాటికి, రోగి యొక్క దృష్టి సాధారణ స్థాయిలోనే ఉంది.
108CC బాక్సు ఉపయోగిస్తున్నట్లైతే #1: CC7.1 Eye tonic + CC7.2 Partial Vision + CC7.3 Eye infections; #2: CC7.1 Eye tonic + CC7.2 Partial Vision + CC7.3 Eye infections ఇవ్వండి.
ప్రాక్టీషనర్ వ్యాఖ్య : 2011,లో ఈ రోగి దాదాపు మంచాన పడి వైబ్రియానిక్స్ తో విజయవంతంగా చికిత్స పొందారు. అంతర్జాతీయ కాన్ఫరెన్స్ పుస్తకం లోని 151 వ పేజీని చూడండి.