అపెండిసైటిస్ 11601...India
2018 ఆగస్టు మధ్యలో 9 ఏళ్ల బాలికకు అకస్మాత్తుగా తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. ఆమె సరిగ్గా తినలేదు మరియు ప్రతిరోజూ నొప్పితో ఏడుస్తుంది. డాక్టర్ తీవ్రమైన అపెండిసైటిస్ గా నిర్ధారించి శస్త్రచికిత్సను సిఫార్సు చేశారు. అతను ఎటువంటి మందు రాయలేదు మరియు చాలా తేలికైన ఆహారం తీసుకోవాలని బాలికకు సూచించాడు. నాలుగు రోజుల తర్వాత 2019 ఆగస్టు 19 బాలిక యొక్క అమ్మమ్మ ఆమెను ప్రాక్టీషనర్ వద్దకు తీసుకువెళ్లారు. ప్రాక్టీషనర్ ఈ క్రింది రెమిడీ ఇచ్చారు:
CC4.1 Digestion tonic + CC4.3 Appendicitis + CC10.1 Emergencies + CC12.2 Child tonic…ప్రతీ 10 నిమిషాలకు ఒక మోతాదు చొప్పున ఒక గంట వరకు ఆ తరువాత ఒక వారం వరకు 6TD తర్వాత TDSకి తగ్గింప బడుతుంది.
రీఫిల్‌లను తీసుకువెళుతున్నప్పుడు పాప వాళ్ళ అమ్మమ్మ, రోగికి నొప్పి లేదని మరియు బాగా తిని నిద్రపోతున్నదని ప్రాక్టీషనరుకు తెలియజేసారు. అక్టోబరు 12న, అపెండిక్స్ పరిమాణం తీవ్ర పరిస్థితి నుంచి కొంచెం తక్కువ తీవ్ర పరిస్థితికి (అక్యూట్ నుండి సబ్‌అక్యూట్‌కు) తగ్గిందని నివేదిక రావడంతో మోతాదు TDS వద్ద కొనసాగించబడింది. డిసెంబరు 30న, రోగి యొక్క తల్లి స్కాన్‌లో అపెండిక్స్ పరిమాణం మరింత తగ్గిందని మరియు ఇప్పుడు సాధారణ పరిధిలో ఉందని మరియు ఆమె కుమార్తె పూర్తిగా క్షేమంగా ఉందని ప్రాక్టీషనరుకు తెలియజేసారు. మోతాదు ఒక నెల పాటు ODకి తగ్గించబడింది మరియు 2019 జనవరి 31 న ఆపివేయబడింది. 2022 మార్చి నాటికి, నొప్పి పునరావృతం రాలేదు.