మొటిమలు 03554...Guyana
34 ఏళ్ల మహిళ 2016 జనవరి నుండి ముఖం అంతా తీవ్రమైన మొటిమలతో బాధపడుతున్నారు. చర్మవ్యాధి నిపుణుడితో సహా అనేక మంది వైద్యులను ఆమె సంప్రదించారు, యాంటీబయాటిక్స్ మరియు ఇతర మందులతో పాటు సిఫార్సు చేసిన ఫేషియల్ క్రీమ్‌లను కూడా ఉపయోగించారు కానీ అవి ఏమీ సహాయం చేయలేదు. మొటిమలు ఎండిపోయిన వెంటనే, కొత్త మచ్చలు కనిపిస్తాయి. వైద్యుని సలహా మేరకు మూత్రపిండాలు, అండాశయాలు మరియు పిత్తాశయం యొక్క అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్నారు, మరియు క్యాన్సర్, పాప్ స్మియర్, మామోగ్రామ్, హార్మోన్లు, థైరాయిడ్, కాలేయం, కొలెస్ట్రాల్ మరియు బ్లడ్ షుగర్ పరీక్షలు కూడా మొటిమల కారణము వెల్లడించలేదు. ఆమె ఇటీవలే తన నాలుక యొక్క రుచిని కోల్పోయింది, అలాగే ఆమె కుడి చెవిలో వినికిడిని కోల్పోవడం ప్రారంభించింది, పరీక్షలో ఓటోస్క్లెరోసిస్ అని నిర్ధారణ అయింది. 2016 అక్టోబరు 21 న ఆమె ప్రాక్టీషనరును సంప్రదించగా క్రింది రెమిడీ ఇచ్చారు:
మొటిమలకు :
#1. CC8.1 Female tonic + CC10.1 Emergencies + CC21.2 Skin infections…6TD in water for 7 days
వినికిడి శక్తి లోపానికి :
#2. CC5.2 Deafness + CC15.1 Mental & Emotional tonic…TDS నీటిలో, రెండు చుక్కలు చెవిలో కూడా వేసుకోవలసి ఉంది.
రోగి #1 మాత్రమే తీసుకున్నారు, 3 రోజుల తర్వాత పుల్ అవుట్ ఏర్పడి -` అతిసారం మరియు వాంతులు - రెండు గంటల పాటు కొనసాగాయి. మొటిమలు ఎండిపోవడం ప్రారంభించాయి మరియు కొత్తవి ఏర్పడలేదు. ఒక వారం తర్వాత మోతాదు TDSకి తగ్గించబడింది. 2017 జనవరి 10 నాటికి, 95% ముఖం సాధారణ స్థితికి చేరుకుంది, మరియు మచ్చలు కూడా మసకబారడం ప్రారంభించాయి. ఆగస్ట్‌లో ఆమెకు మొటిమల దగ్గర మంటగా అనిపించ సాగింది కానీ రెమిడీ #1 ని TDS లో కొనసాగించడంతో వెంటనే తగ్గిపోయింది. నవంబర్ 2017 నవంబర్ నాటికి అన్ని మచ్చలు మాయమైనందున ఆమె రెమిడీలు నిలిపివేసారు. 2022 ఫిబ్రవరి నాటికి ఆమెకు ఈ పరిస్థితి పునరావృతం కాలేదు.
రోగి 2016 అక్టోబర్ 27 నుండి #2 తీసుకోవడం ప్రారంభించారు. ఒక వారంలోపు, వినికిడిలో 20% మెరుగుపడింది, మరియు నాలుక యొక్క రుచి కూడా తిరిగి వచ్చింది. ఉదయం మేల్కొన్న తర్వాత ఆమె చెవిలో ఎండిపోయిన మైనమున వంటి పదార్థమును కనుగొనడం ప్రారంభించారు. 2017 జనవరి 10 నాటికి, ఆమె వినికిడి శక్తి 60% మెరుగయ్యింది. కానీ 2017 నవంబర్ వరకు ఆ పైన ఎటువంటి మెరుగుదల లేకపోవడంతో, ఆమె #2ని కూడా ఆపివేసారు.
ఎడిటర్ యొక్క వ్యాఖ్యానం: నూనెను చెవిలొ చుక్కల మందుగా (ఇయర్‌డ్రాప్స్‌గా) ఉపయోగించమని మేము సిఫార్సు చేస్తున్నాము (30ml వర్జిన్ ఆలివ్/కొబ్బరి నూనెలో ఒక చుక్క రెమెడీని డ్రాప్పర్ బాటిల్‌లో వేయాలి) మరియు ఎప్పుడూ నీటిలో వేయకూడదు. చెవిలో చేరిన నీరు వినికిడి లోపంతో సహా అనేక సమస్యలను కలిగిస్తుంది. టింపానిక్ మెంబ్రెన్ లో రంధ్రం కారణంగా చెవుడు వచ్చినప్పుడు రోగికి చెవి చుక్కలు ఇవ్వకూడదు.