Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

దీర్ఘకాలిక దగ్గు 03567...USA


52 ఏళ్ల మహిళ గత నాలుగు సంవత్సరాలకు పైగా రోజుకు కనీసం రెండు లేదా మూడు సార్లు తరుచుగా పొడి దగ్గును ఎదుర్కొంటున్నారు. దగ్గు అకస్మాత్తుగా మొదలై 20 నుండి 30 నిమిషాల పాటు స్వల్ప విరామాలతో కొనసాగుతుంది, దీనితో ఆమె చాలా అలసిపోతుంది. ఈ దగ్గును అణచివేయడానికి ఆమె వేడి నీటిని త్రాగుతుంది లేదా లాజెంజ్‌లను (చప్పరించే మాత్రలను) తీసుకుంటుంది. ఆమెకు ఇతర శ్వాసకోశ సమస్యలు ఏమీ లేవు. డాక్టర్ అనేక పరీక్షలను సూచించారు కానీ అవి ఏమీ రోగ కారణాన్ని వెల్లడించలేదు మరియు ప్రిస్క్రిప్షన్ మందులు ఏమాత్రం సహాయం చేయలేదు. ప్రాక్టీషనరు ఉంటున్న మేడిటేషన్ గ్రూపు లోనే రోగి ఉన్న కారణంగా ప్రాక్టీషనర్ ఆమెకు అనేక సందర్భాల్లో వైబ్రియానిక్స్ చికిత్సను తీసుకోమని కోరినా ప్రతీసారీ ఆమె సున్నితంగా తిరస్కరించారు.

ఆమె తీసుకుంటున్న చికిత్సతో ఎటువంటి ఉపశమనం లేనందున రోగి ఇకపై పరిస్థితిని ఎదుర్కోలేక అయిష్టంగానే వైబ్రియానిక్స్ ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. ఆమె అన్ని ఇతర మందులను నిలిపివేసి  2020 మార్చి 1 న  ప్రాక్టీషనర్ ని సంప్రదించగా వారు క్రింది రెమిడీ ఇచ్చారు:  

CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.1 Chest tonic + CC19.6 Cough chronic…TDS 

రెండు నెలలుగా పేషెంట్ నుంచి ఎలాంటి ఫీడ్ బ్యాక్ రాలేదు! 2020 మే లో, ప్రాక్టీషనర్ రోగికి ఫోన్ చేసినప్పుడు, దగ్గు పూర్తిగా తగ్గిపోయిందని మరియు ఈ మొత్తం అనుభవం ఆమెను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆమె తెలిపారు. మోతాదు  మెయింటెనెన్స్ డోసేజ్‌కి క్రమంగా తగ్గించబడింది, అనారోగ్యం మళ్లీ తలెత్తకుండా చూసుకోవడానికి ఆమె 2020 చివరి వరకు OW గా కొనసాగించారు. ఆమె ఇకపై దగ్గు తో ఇబ్బంది పడే సంఘటనలు ఎదుర్కోవాల్సిన అవసరం రాదని తెలిసి ఎంతో  ఉపశమనం పొందారు. వైబ్రియోనిక్స్ చికిత్స కోసం ఆమె తన కుటుంబంలోని ఒక సభ్యుడిని కూడా ప్రాక్టీషనర్‌కి సూచించారు. 2022 ఫిబ్రవరి నాటికి, ఒక సంవత్సరం తర్వాత, రోగి బాగానే ఉన్నారు. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడల్లా, ఆమె ఇప్పుడు సంతోషంగా చికిత్స కోసం వైబ్రియానిక్స్ వైపు చూస్తున్నారు.