ముఖం మీద దద్దుర్లు 02802...UK
47సంవత్సరాల మహిళ ఒక సంవత్సరం నుండి ముఖం మీద దద్దుర్లతో బాధపడుతున్నారు. ఇది రోసేసియా అని నిర్ధారించబడింది. ఇది ముఖంపై వచ్చే దీర్ఘకాలిక వ్యాధి. ఈ దద్దుర్లు ఎరుపు నేపథ్యంలో కనిపిస్తాయి. ఈ కేసు విషయంలో రోగి గడ్డం చుట్టూ ఇవి ఏర్పడ్డాయి. అనేక రకాల యాంటీ బయోటిక్స్ ఇవ్వబడ్డాయి కానీ మెరుగుదల లేదు. ఆమె ఆరు నెలల పాటు మూలికా వైద్యుని చేత చికిత్స కూడా చేయించుకుంటూ నియమితమైన ఆహారాలే (పథ్యం) తీసుకున్నారు. ఆమె గోధుమలు లేదా పాల ఉత్పత్తులు కూడా తీసుకోవడం లేదు ఎందుకనగా కొన్ని ఆహార పదార్థాల విషయంలో ఆమెకు ఎలర్జీ ఉందని ఆమె భావించారు. మూలికా వైద్యం వలన ఆమె పరిస్థితి మెరుగుపడలేదు. ఆమెకు ముఖం మీద దద్దుర్లు మరియు దానికి గల కారణం నిమిత్తం మరియు ఆమె ఎదుర్కొనే ఒత్తిడి మరియు కాలేయ బలహీనత కోసం క్రింది రెమిడీ సూచించ బడింది:
CC4.2 Liver & Gallbladder tonic + CC4.10 Indigestion + CC15.1 Mental & Emotional tonic + CC21.1 Skin infections
రెండు వారాల్లో తిరిగి రిపోర్టు చేయవలసిందిగా ఆమెకు సూచించారు. అయినప్పటికీ ఆమె రెండు నెలల తర్వాత మాత్రమే రీఫిల్ కోసం అభ్యాసకుని చూడటానికి వచ్చారు. ఎందుకంటే ఆ రెమిడీ తీసుకున్న వెంటనే చర్మం మెరుగుపడటం ప్రారంభించి క్రమంగా 75%మెరుగుపడిందని చెప్పారు. ఆమె ఇప్పటికీ చికిత్స కొనసాగిస్తునే ఉన్నారు.