Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అధికముగా ఉప్పు తినాలనే కోరిక 12051...India


5 సంవత్సరముల బాలికకు రెండు సంవత్సరాల వయసు నుంచే ఉప్పు మరియు ఉప్పగా ఉండే పదార్థాలు పట్ల విపరీతమైన కోరిక ఉండేది. తల్లి ఇంటి సహాయకురాలిగా పనిచేస్తూ ఉండగా సమీపంలోని దుకాణానికి వెళ్లి తన పాకెట్ మనీతో ఉప్పగా ఉండే ఊరగాయ చిన్న ప్యాకెట్ కోసం ఖర్చు చేస్తూ ఉండేది. ఇంట్లో ఆమె ఉప్పు మరియు ఇటీవల నిమ్మకాయ వంటి పుల్లని పండ్లు తినడానికి అలవాటు పడింది. తల్లిదండ్రులు ఈ అలవాటు అడ్డుకునేందుకు అనేక విధాలుగా ప్రయత్నించినా ఫలించలేదు. ఆమెకు ఆకలి తక్కువగా ఉన్నందున బరువు తక్కువగా ఉంది మరియు ఎప్పుడూ కాలు నొప్పి గురించి ఫిర్యాదు చేస్తూ ఉండేది. డాక్టర్లు కొన్ని పరీక్షలు సిఫారసు చేసినా ఇష్టం లేక తల్లిదండ్రులు అవి చేయించ లేదు.   2021 ఫిబ్రవరి 12న ఈ విషయాలను చెప్పినపుడు ప్రాక్టీషనరు ఆమెకు క్రింది రెమిడీ ఇచ్చారు.  

CC6.1 Hyperthyroid + CC12.2 Child tonic…TDS 

18 రోజుల తర్వాత మార్చి 2న తన కుమార్తెకు కోరికలు 80% తగ్గాయని మరియు ఇప్పుడు బాగా తింటున్నదని తల్లి సంతోషంగా తెలియజేశారు. మే 21 నాటికి ఇది 100% మెరుగుపడింది మరియు అమ్మాయి అదనపు ఉప్పును ఇచ్చినా కూడా తినలేదు. మోతాదు రెండు వారాలకు BD మరో రెండు వారాలకు OD కి తగ్గించబడి జూన్ 16న ఆపివేయ బడింది. 2022 నాటికి తన బిడ్డ ఆరోగ్యం మెరుగైందని బరువు పెరిగిందని మరియు కాలు నొప్పి గురించి ఫిర్యాదు చేయడం లేదని తల్లి చాలా సంతోషంగా తెలియజేశారు.