Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

నిద్రా వైకల్యం, కోవిడ్-19 తదనంతర సమస్యలు, చిత్తవైకల్యపు మందుల యొక్క ప్రతికూల ప్రభావాలు 03598...UK


87 సంవత్సరాల వ్యక్తికి 2019లో తేలికపాటి చిత్తవైకల్యం ఉన్నట్లు నిర్ధారణ అయింది, కానీ దీనికి ఎలాంటి ఔషధం తీసుకోవలసిన అవసరం రాలేదు. అతను కోవిడ్-19 నుండి బయట పడిన కొన్ని నెలల తర్వాత 2020 జూలైలో అతను దీర్ఘకాల కలత నిద్రకు  గురికావడంతో ఆ సమయంలో అతనిలో ఆందోళన, నిద్రలో కేకలు వేయడం వంటి లక్షణాలు పెంపొందాయి. ఇలా నెలలో రెండు మూడు సార్లు సమస్య ఏర్పడడంతో సంరక్షకులకు ఆ సమయంలో అతనిని మేల్కొల్పడం కూడా కష్టంగా ఉంది. 2021 జూన్ లో అతని చిత్త వైకల్యం కోసం అరిసెప్ట్ ఔషధాన్ని సూచించారు. దీనివల్ల ఉదయం నిద్రలేవగానే విపరీతమైన బలహీనత, నడవడంలో ఇబ్బంది, మరియు కొద్దిపాటి శ్రమకు కూడా గుండె దడ, ఊపిరి అందకపోవడం వంటి లక్షణాలు ఏర్పడ్డాయి. ఎరిసెప్ట్ వాడడం మానివేస్తే ఈ లక్షణాలు ఆగిఓపోతున్నాయి కానీ తిరిగి ప్రారంభించిన తర్వాత పునరావృతం అవుతున్నాయి. అతని కార్డియాలజిస్ట్ ఇవి ఎరిసెప్ట్ ఔషధం యొక్క దుష్ప్రభావాలని ధ్రువీకరించారు, అయితే ఇవి కలుగుతున్నప్పటికి వారు దాన్ని కొనసాగించాలనే నిర్ణయించుకున్నారు. 2021 సెప్టెంబర్ 10న ఇతనికి నిద్ర రుగ్మతల కోసం క్రింది రెమిడీ ఇవ్వబడింది:

#1. CC15.6 Sleep disorders…1 dose నిద్రించ డానికి 30 నిమిషాల ముందు  

మూడు వారాల తర్వాత పీడకల ఫ్రీక్వెన్సీ తగ్గింది. అతనికి ఇప్పుడు మూడు వారాల్లో ఒకసారి మాత్రమే ఇలా కలుగు తున్నది అనగా 30% మెరుగుదల ఏర్పడింది. నిద్రపోవడం ఎప్పుడూ అతనికి సమస్య కాలేదు కానీ అతను ఇప్పుడు మరింత గాఢ నిద్ర పోతున్నట్లు భావించాఋ. అక్టోబర్ 3న అతని చిత్తవైకల్యం మరియు అరిసెప్ట్ ఔషధం యొక్క దుష్ప్రభావాలు ఎదుర్కోవడానికి ఈ క్రింది రెమిడీ అందించబడింది:

#2. CC3.4 Heart emergencies + CC3.6 Pulse irregular + CC9.1 Recuperation + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC17.3 Brain & Memory tonic + CC18.2 Alzheimer’s disease…TDS

దీనివలన ఎటువంటి మెరుగుదల కలగక పోవడంతో అక్టోబర్ 20న #2  క్రింది విధంగా మెరుగుపరచబడినది:

#3. Aricept potentised at 200C + #2…TDS

నవంబర్ 15 నాటికి అనగా ఒక నెల కంటే తక్కువ వ్యవధిలోనే రోగి 100% మెరుగైన అనుభూతిని పొందినట్లు తెలిపారు. అతని శక్తి స్థాయిలు సాధారణ స్థితికి రావడం మరియు అతని నడక మరియు శ్వాస ఇబ్బందులు ఇంకా గుండె దడ పూర్తిగా తొలగిపోయినందుకు అతను ఎంతో ఆనందించారు. అతనికి పీడకలల విషయంలో క్రమమైన తగ్గుదల కలిగి చివరి సారిగా  డిసెంబర్ 1న ఏర్పడింది. ఆరు వారాల పాటు కలత నిద్రలు అనుభవించిన అనంతరం 2022 జనవరి మధ్యలో #1 తీసుకోవడం ఆపివేయబడింది. 2022 ఫిబ్రవరి నాటికి రోగి ప్రశాంతమైన నిద్రను కొనసాగిస్తున్నారు మరి ఇప్పుడు అరిసెప్ట్ ను సిఫార్సు చేయబడిన మోతాదులో సగమే కొనసాగిస్తున్నారు. అతను చిత్త వైకల్యాన్ని నివారించడానికి మరియు అరిసెప్ట్ యొక్క దుష్ప్రభావాలను ఎదుర్కోవడానికి #3 ను TDS గా కొనసాగించడానికి ఇష్టపడుతున్నారు.