గింజలకు అలెర్జీ మరియు తీవ్రమైన పొడి చర్మపు సమస్య 02802...UK
ఒక అంధ పాఠశాలలో నివసిస్తున్న 18 సంవత్సరాల యువకుడు సెలవుల్లో ఇంటికి వచ్చాడు. అతనికి గింజలు తింటే పడదని ముఖ్యంగా బాదంపప్పు ఎలర్జీ ఉండడం వలన అది తింటే కడుపు నొప్పి, వాంతులు వస్తాయని అతని తల్లి అభ్యాసకుడిని పిలిపించి చెప్పారు. ఆ అబ్బాయి ప్రతీరోజూ క్రీమ్ తప్పకుండా ఉపయోగించాల్సిన అవసరం కలిగినటువంటి పొడి చర్మం కలిగి ఉన్నాడు. అతనికి ఈ క్రింది రెమిడీ పోస్టు ద్వారా పంపబడింది:
CC4.10 Indigestion + CC 7.1 Eye tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies + CC21.1 Skin tonic…OD మెల్లిగా TDS కు పెంచడం
పై రెమిడీ తీసుకున్న ఒక నెల తర్వాత తల్లి అభ్యాసకుడికి కృతజ్ఞతలు చెప్పడానికి ఫోన్ చేసారు. తన కుమారుడు ఇప్పుడు ఎటువంటి సమస్య లేకుండా బాదంపప్పు తినగలుగుతున్నాడని చెప్పారు. కాబట్టి మోతాదు తగ్గించి OD గానే ఇవ్వమని అభ్యాసకుడు సలహా ఇచ్చారు. అయితే తన అబ్బాయి మొదటి నుండి OD గానే తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. అలాగే అబ్బాయి చర్మం కూడా అప్పటికంటే ఇప్పుడు చాలా మెరుగుగా ఉంది!