పిల్లి పాదమునకు గాయం 01644...USA
సుమారు నాలుగు సంవత్సరాల వయసు కలిగిన అభ్యాసకుని ఆడ పిల్లి ఇంటికి వస్తూ తన ఎడమ పాదము పై బరువు మోపకుండా పైకెత్తి కుంటుకుంటూ వచ్చింది. పిల్లి జుట్టు మీద కొన్ని రక్తపు చుక్కలు కూడా ఉన్నాయి. ఆ పిల్లి బద్ధకంగా కనిపించింది మరియు బంతివలె (ముడుచుకొని)పడుకో పెట్టాలని ప్రయత్నించింది. రక్తంఎక్కడ వచ్చిందో అభ్యాసకునికి కనపడలేదు కనుక సాయిరాం హీలింగ్ వైబ్రేషన్ మిషను తో పిల్లి చిత్రాన్ని రేమిడి వెల్ లో ఉంచి:
NM20 Injury నివారణ నిరంతరంగా రెండు రోజులపాటు ప్రసారం చేసారు.
అభ్యాసకుడు మరొక నివారిణి కింది విధంగా తయారు చేశారు:
CC1.1 Animal tonic + CC10.1 Emergency + CC20.7 Fractures + CC21.11 Wounds & Abrasions
ఈ మిశ్రమాన్ని నీటితో తయారుచేసి పిల్లి తాగే గిన్నెలో రెండు రోజులు ఉంచారు. రాత్రి సమయంలో పిల్లి ఆ నీటిని తాగుతుందో లేదో అభ్యాసకుడికి తెలియదు కానీ అది ఎంతో కొంత నీరు తాగింది. మరుసటి రోజు ఉదయం పైకి లేచి దాని పాదంపై పూర్తి బరువు పెట్టి నడవసాగింది అంతేకాక దాని బెస్ట్ ఫ్రెండ్ 72 పౌండ్ల కుక్కతో ఏమీ జరగనట్టే ఆడుకోవడం ప్రారంభించింది.