అదనంగా
Vol 1 సంచిక 2
November 2010
ఆరోగ్య చిట్కాలు
అధిక రక్తపోటు సమస్యకు వేడి కోకో ఒక "అధ్బుత ఔషధం" కావచ్చా? ఈ అమోఘమైన ఆవిష్కరణను ప్రశంసించిన హార్వర్డ్ పరిశోధకులు!
ఇటీవల అంచనాల ప్రకారం, అమెరికాలో దాదాపు ముగ్గురు వయస్కులలో ఒకరికి అధిక రక్తపోటు సమస్య ఉంది. కానీ పనామా యొక్క కరేబియన్ తీరం వద్ద ఉన్న ద్వీపాల సమూహంలో నివసిస్తున్న కునా భారతీయులకు అధిక రక్తపోటు సమస్య లేనే లేదు. నిజానికి 60 ఏళ్ళ వయస్సు వచ్చిన కునా భారతీయుడి రక్తపోటు 110/70 మాత్రమే.
దీనికి కారణం వీరు ఉప్పు తక్కువగా తినడమా? లేదు. నిజానికి కునా భారతీయులు ఎక్కువగా ఉప్పు తింటారు. మరి దీని కారణం వారి జన్యువులా? కాదు. ఈ ద్వీపాల నుండి దూరం వెళిపోయిన కునా భారతీయులకు ఇతర ప్రదేశాలలో ఉన్న వ్యక్తుల వలె రక్తపోటు వచ్చే అవకాశముంది. అయితే ఇక్కడున్న వ్యక్తులకు రక్తపోటుకు "రోగనిరోధక" శక్తి ఎలా వచ్చింది? రక్తపోటు సమస్య లేనందు వలన ఈ వ్యక్తులకు గుండె జబ్బులు, స్ట్రోకు, డయాబెటిస్, కాన్సర్ వంటి జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ.
ఈ ప్రదేశంలో ఉన్న కునా భారతీయులు ప్రతిరోజు ఐదు కప్పుల కోకో తాగుతున్నారని తెలిసి హార్వర్డ్ పరిశోధకులు ఆశ్చర్యపోయారు. నిజమే, కోకో! కోకోలో ఉన్న ఫ్లావనాల్స్ అన్న పదార్థం, శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ యొక్క ఉత్త్పత్తిని పెంచి గుండె, మెదడు మరియు ఇతర అవయవాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి అని అనేక పరిశోధనలలో నిర్ధారించబడింది. ఒక పరిశోధనలో కోకో, ఆస్పిరిన్ మాత్ర వలె రక్తం పల్చపర్చడానికి ఉపయోగపడుతుందని తెలిసింది.
అంతే కాదు. కోకోను ఉపయోగించి ఆర్టరీలలో( ధమనులు) ఏర్పడిన అడ్డగింపులు, కంజెస్టివ్ హార్ట్ ఫైల్యూర్ , స్ట్రోక్ , చిత్తవైకల్యం మరియు నపుంసకత్వం వంటి సమస్యలను నయంచేయవచ్చని, హార్వర్డ్ మెడికల్ స్కూల్ లో ఒక ప్రొఫెసర్ చెప్పారు. మూలం: డైలీ హెల్త్ న్యూస్.
మనము ఆలోచించవలసిన ప్రతిపాదిత చట్టం
UK ,యూరోప్ (2011 ఎప్రల్ నుండి ఈ చట్టము అమలుకి వస్తుంది) మరియు USA దేశాలలో ఆరోగ్యం మరియు ఆహార పదార్థాలైన విటమిన్లు, మినరల్సు, మూలికలు ,ఆయుర్వేద మరియు ఇతర ప్రత్యామ్నాయ మందులు చట్ట విరుద్ధమైనవని ఒక ప్రతిపాదిత చట్టం యేర్పరచడము జరిగింది. ఇది ఇప్పటికే ఆస్ట్రేలియాలో ఒక చట్టంగా మారింది.
వైబ్రియానిక్స్ మందులలో ఏ భౌతిక పదార్ధం లేకపోయినప్పటికీ, ప్రజల స్వేచ్చను పరిమితం చేసే ఇటువంటి ప్రతిపాదిత చట్టంపై మన వైబ్రో హీలర్లు తమ అసమ్మతిని వ్యక్తం చేస్తారని భావిస్తున్నాము. ఇధి చట్టంగా మారితే అనేక సహజ ఆరోగ్య క్లినిక్లు, ఆరోగ్య దుకాణాలు మరియు వ్యాపారాలు మూసివేయబడతాయి. అంతే కాకుండా ప్రజలు ఆరోగ్య సంరక్షణ కోసం ఎటువంటి దుష్ప్రభావాలు కలుగచెయని ఇంత ఉత్తమమైన మందులను ఉపయోగించే అవకాశాన్ని కోల్పోతారు.
ఈ చట్టం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందవచ్చు కాబట్టి, ఈ విషయంలో తగిన రీతిలో వ్యవహరించే కొరకు వైబ్రో సాధకులకు, ఈ చట్టం గురించి పూర్తిగా తెలుసుకునే హక్కు ఉందని మేము భావిస్తున్నాము. ఉదాహరణకు ఇది చట్టంగా మారే ముందుగా UK సాధకులు, ఈ క్రింద ఇవ్వబడిన లింకులో ఉన్న అర్జీను (పెటిషణ్) సంతకం చేయవచ్చు.
http://www.ipetitions.com/petition/ joininghandsinhealth/#sign_petition
"జాయినింగ్ హాండ్స్ ఇన్ హెల్త్ " అన్న ఒక వీడియోలో, ఈ కొత్త ప్రతిపాదిత చట్టం యొక్క నేపధ్యాన్ని అందచేసారు:
http://www.grammasintl.com/html/ campaigns/jhih_videos.asp.
ఈ వీడియోలో డేమ్ జూడీ డెంచ్ వ్యాఖ్యాత. USAలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్కు చెందిన అనేక కాంగ్రెస్స్ అధికారులు మరియు సీనియర్ అధికారుల
పై ఈ వీడియోలో రూపొందించబడింది. ఇది ప్రపంచవ్యాప్త శక్తిగల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వంటి అంతర్జాతీయ సంస్థలకు సంభందించినది. మీరు ఈ విషయం పై ఎరుక కలిగియుండడం అవసరం.
జన్యుపరంగా మార్చబడిన ఆహారాలు
మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అత్యంత తీవ్రమైన మరో సమస్య జన్యుపరంగా మార్చబడిన ఆహారాలు. వీటిని GM లేదా GMO అని అంటారు. మన పేషంట్ల మరియు కుటుంభ సభ్యుల ఆరోగ్య సంరక్షణ కొరకు మనము ఈ విధమైన ఆహారాలని గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.
దివ్యమైన మన ప్రకృతి తల్లి మనకు రోగ నివారణకు ఉపయోగపడే అనేక మూలికలను మరియు మొక్కలను అందించడం ద్వారా, తన భిడ్డలమైన మనపై తన అపారమైన ప్రేమను చూపిస్తుంది. మన భూమిపై మరియు మన పర్యావరణంపై మనకున్న అనుభందాన్ని అనేక మంది "వెబ్ ఆఫ్ లైఫ్"( జీవిత అల్లిక) అని అన్నారు.
పెద్ద లాభాల కోసం విజ్ఞాన శాస్త్రాన్ని వ్యాపారాలలో ప్రయోగించడం జరుగుతోంది. ఇటువంటి వ్యక్తులు ప్రజలకున్న రోగాల చికిత్సకై విషపూరిత మందులను తయారు చేయడమే కాకుండా, ప్రజలను పౌష్టిక ఆహార సప్ప్లిమేన్ట్లను మరియు మూలికలను తీసుకోకుండా ఆపివేసి, మానవులు మరియు జంతువులు ఆహారంగా తీసుకొనే అనేక ధాన్య, పళ్ళ మరియు కూరగాయిల విత్తనాలలో జన్యు పరమైన మార్పులను చేస్తున్నారు.
జన్యుపరంగా మార్చబడిన ఆహారం సేవించడం మన ఆరోగ్యంపైన మాత్రమే కాకుండా, అనేక తరాల వరకు దాని దుష్ప్రభావం చూపుతుంది. వైబ్రో సాధకులు జన్యుపరంగా మార్చబడిన ఆహారాల గురించి మరియు వీటి ద్వారా కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకోవడం మంచింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాధకులందరు వీటి ప్రమాదాల గురించి తెలుసుకుని, తమ స్నేహితులకు మరియు ఇరుగు పొరుగులో ఉన్నవారందరికీ తెలియచేస్తే, వారికి ఎంతో సహాయపడినవారవుతాము. అవగాహన శక్తివంతమైనది మరియు అజ్ఞ్యానం ప్రమాధకరమైనధి. మన ఆరోగ్య సంరక్షణ, మన కుటుంభ సభ్యుల ఆరోగ్య సంరక్షణ మరియు ఈ ప్రపంచంలో ఉన్న సోదరీ సోదరుల ఆరోగ్య సంరక్షణ కన్నా ప్రధానమైనది మరొకటి ఏముంటుంది? GM ఆహారంపై మరికొన్ని వివరాల కోసం: Google: జన్యుపరంగా మార్చబడిన ఆహారం.