డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
Vol 1 సంచిక 2
November 2010
ప్రియమైన వైబ్రో సాధకులకు
మేము వైబ్రియానిక్స్ వార్తాలేఖ యొక్క ప్రథమ సంచిక విడుదల చేసినప్పటి నుండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధకుల నుండి చాలా బలమైన ప్రతిస్పందన మాకు లభించింది. మా ఈ కొత్త ప్రయత్నం మీ అందరికి ఉపయోగకరంగాను మరియు మీరు మెచ్చుకునే విధంగాను ఉందన్న విషయం తెలిసి మేము ఎంతో ఆనందిస్తున్నాము. US నుండి ఒక అభ్యాసకురాలు ప్రథమ సంచికలో ప్రచురింపబడిన, ఒక కేసులో ఉపయోగించిన మందుల వివరాలను చూసి, అదేవిధమైన రోగ లక్షణాలున్న ఒక రోగికి ఆమె అవే మందులని ఇవ్వడం ద్వారా సఫిలతాలు లభించాయని మాకు తెలియచేసింది. ఇటువంటి సఫలమైన కేసు వివరాలను మరియు అనుభవాలను నిరంతరం మీరందరు మాకు పంపుతూ ఉంటారని ఆశిస్తున్నాము.
2010 సెప్టంబర్ 17న వైబ్రియానిక్స్ వార్తాలేఖ యొక్క ప్రథమ సంచికను మన ప్రియమైన భగవాన్ భౌతికంగా ఆశీర్వదించారన్న శుభవార్తని మీకు ఆనందంగా తెలియచేస్తున్నాను (ఫోటోను చూడండి). స్వామి వార్తలేఖను తమ దివ్య హస్తాలతో తీసుకొని, అందులో ఉన్న నాలుగు పేజీలను చూసి తమతో పాటు తమ నివాసానికి తీసుకు వెళ్ళారు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా వైబ్రో సాధకులు అందిస్తున్న సేవను స్వామి అంగీకరించి ప్రోత్సాహన అందచేసారు.
2007 సంవత్సరానికి ముందు వైబ్రో అభ్యాసంపై శిక్షణ పొందిన సాధకులకు, సాయిరామ్ హీలింగ్ వైబ్రేషణ్ పోతంటైసర్ను ఉపయోగించే విధానంపై విశేష శిక్షణ ఇవ్వబడింది. మీరిచ్చిన ప్రతిపుష్టి ద్వారా, మీలో కొందరికి 108 కామన్ కాంబోలపై ఎరుక లేదని మేము గ్రహించాము. 900 రోగ లక్షణాలకు పైగా నయం చేయగల రెడీమేడ్ మందుల సమితులే, ఈ 108 కామన్ కాంబోలు. వీటిని ఉపయోగించడం మరింత సులభం. నూతన వైబ్రియానిక్స్ అభ్యాసకులకు వీటి ఉపయోగాన్ని పై శిక్షణ ఇవ్వబడుతోంది.
2008 మార్చ్లో భగవాన్ 108 కామన్ కాంబోల బాక్సును భౌతికంగా ఆశీర్వదించారు. దీని తర్వాత సాధకులు అద్భుతమైన ఫలితాలను పొందుతున్నారు. ప్రతి నెల రిపోర్టును క్రమం తప్పక పంపిస్తున్న ప్రతియొక్క అభ్యాసకుడు/అభ్యాసకురాలు ఈ బాక్సును పొందడానికి అర్హులే. అర్హులైన సాధకులు ప్రశాంతి నిలయానికి వచ్చినప్పుడు ఈ బాక్సును మా వద్ద నుండి తీసుకోవచ్చని తెలుపుకుంటున్నాము.
ఎప్పటిలాగే ఈ వార్తలేఖను మరింత మెరుగు పరచడానికి మీరు మాకు పంపిచే విలువైన సలహాలను మరియు ఆలోచనలను మేము ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటాము. మీరందరు మీ అభిప్రాయాలను లేదా ప్రశ్నలను పంపడానికి కొంత సమయాన్ని కేటాయించవలసిందిగా మా మనవి.
మీ నిరంతర ప్రేమను మరియు సహకారాన్ని ఆశిస్తున్నాము. మీరు చేస్తున్న గొప్ప సేవను కొనసాగించండి.
ప్రేమపూర్వకంగా సాయి సేవలో ఉన్న
జిత్ అగ్గర్వాల్