డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో
Vol 7 సంచిక 2
March/April 2016
ప్రియమైన వైబ్రియో అభ్యాసకులారా
వైబ్రియోనిక్స్ ద్వారా మానవాళికి సేవ చేయాలనే ఉన్నత ఆశయం గలవారికి శిక్షణ ఇచ్చి సాయిరాం హీలింగ్ వైబ్రేషణ్ పోటెంటైజర్ ద్వారా దివ్య తరంగాలను అందరికీ (మొక్కలకి,జంతువులకి,మనుషులకు ) ప్రసరింప జేయాలనే దివ్య సంకల్పము తో 22 సంవత్సరాల క్రితం ఈ బీజం అంకురించింది . ఆనాటి సంకల్పమే ఈనాడు వేలకొద్ది ప్రాక్టీషనర్లలో అద్భుతమైన పరివర్తన తెస్తూ వారి హృదయ మందిరాలను ప్రేమ మందిరాలుగా మారుస్తోంది. అ ప్రేమే లక్షలకొద్దీ జీవితాలను నిస్వార్ధ ప్రేమ ద్వారా స్పృశిస్తూఉంది. మనవోద్ధారణ కోసం కంకణం కట్టుకొన్న కొన్ని జీవితాలు నిష్కామ కర్మ ద్వారా (ఏ విధ మైన ఫలితాన్ని ఆశించకుండా)ప్రపంచ గతిని మార్చగలవు అని చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యమిది. సంకల్ప దశ నుండి ప్రపంచవ్యాప్త ఉద్యమం గా రూపుదిద్దుకున్నక్రమమును మనం వైబ్రియోనిక్స్ విషయంలో చూస్తున్నాము.
మన సంస్థ విషయంలో గతం నుండి కూడా పరిపాలనా పరంగా అనేక కార్యకలాపాలలో మెరుగైన విధానాలను అమలుపరుస్తూ వస్తున్నాము. సంస్థ విస్తరించే కొలదీ దీని అంతరనిర్మాణం పెంచుకోవలసిన ఆవశ్యకతనుకూడా గుర్తించాము. అంతేకాక సంస్థ పాలనా సౌలభ్యం కోసం కొన్ని ప్రత్యేక సంస్కరణలు ప్రవేశ పెట్టవలసిన అవసరం కూడా ఉంది.ఎందుకంటే అత్యంత బలంగా నిర్మించికున్న ఈ పునాది పైన సంస్థ పురోగతి అనూహ్యంగా పెరిగిపోతున్న వైనం మనం భవిష్యత్తులో చూడబోతున్నాము. ఈ దిశలో పాలనా బాధ్యతలను తమ భుజస్కందాలపైన వేసుకొని సంస్థను ముందుకు తీసుకుపోగలిగిన దక్షత గలిగిన ప్రాక్టీషనర్ ల సేవలు ఎంతో అవసరం .విస్తృతంగా వ్యాపించి ఉన్న పరిపాలనా అంశాలను అనేక విభాగాలుగా వికేంద్రికరణ చేయడం ద్వారా సేవచేయడానికి ఎక్కువమందికి అవకాశం కల్పించబడింది. అటువంటి కొన్నివిభాగాలు –క్రొత్తగా ప్రవేశించే వారికి దరఖాస్తులు అందించడం,వివిధ దేశాలలో కోఆర్డినేటర్లు ,సమన్వయకర్తలు,టీచర్ల సంఖ్యను అభివృద్ధి పరచడం,వెబ్సైట్ నిర్వహణాభాద్యత తీసుకోవడం, ఇంకా వార్తాలేఖలను తయారు చేయడంలోనూ ,ఇతర భాషలలోనికి తర్జుమా చేయడంలోనూ,వివిధరకాల విభాగాలలో ప్రాక్టీషనర్ లకు శిక్షణ ఇవ్వడంలోనూ,వై బ్రియోనిక్స్ కు చెందిన పుస్తకాలూ,ఇతర స్టడీమెటీరియల్ ను పునః సమీక్షించడం లోనూ,వార్తా సంచికలను ప్రచురించడం లోనూ,పరిశోధనా ప్రాజెక్టులను చేపట్టడం లోనూ,ప్రాక్టీషనర్ లు మరియు అశేష జనావళి నిమిత్తము దృశ్య శ్రవణ కార్యక్రమములు,తయారుచేయడంలోను,సమాచార క్రోడీకరణ నిమిత్తము , ఇలా అనేక రంగాలలో విస్తృతంగా వ్యాపించి ఉన్న పనిని మన వైబ్రియోనిక్స్ టీం లో ఉన్న స్వచ్చంద సేవకులు భాగస్వామ్యం వహించి సరళీకృతం చేయడానికి ముందుకు రావలసిందిగా సూచన.
నేను మీ అందరినీ కోరేదేమిటంటే స్వచ్చందంగా ముందుకు వచ్చి ఈ పరిపాలనా విభాగంలో వివిధ పాత్రల నిర్వహణకు మీకు బాగా తెలిసిన రంగంలో గానీ లేదా మీకు బాగా అభిరుచి గల రంగంలో గానీ పేర్లు నమోదు చేసుకోవలసిందిగా సూచన. ఈవిధముగా మీరు చేసే సేవ మీ మాసవారి నివేదికలో నెలవారీ సేవా గంటలుగానే నమోదు చేసే అవకాశం కూడా ఉంది.
మన సంస్థను వృత్తిపరంగా బలోపేతం చేసే కార్యక్రమములో భాగంగా ప్రస్తుతం ఉన్న రెండు హోదాలలో వెంటనే అమలులోనికి వచ్చే విధంగా చిన్న మార్పులు తీసుకువస్తున్నాము. ఇకనుండి అసిస్టెంట్ వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ అనేది అసోసియేట్ వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ (AVP) గానూ జూనియర్ వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ (JVP) అనేది వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్(VP)గానూ పిలవబడతాయి. ఈ మార్పు ప్రాక్టీషనర్లకు ఇచ్చే శిక్షణ,అమరియు వీరి అనుభవం రూపంలో మరింత స్పష్టంగా వ్యక్తమవుతుంది.
ఈ కాలం వైబ్రియోనిక్స్ కు ఉద్విగ్న భరితమైన కాలం. ఉత్సాహవంతులయిన, అంకితభావం గల ప్రాక్టీషనర్ లద్వారా వారి చేయూత ద్వారా మనం అదనపు వనరులను సమకూర్చుకొని వైబ్రియోనిక్స్ ద్వారా ఉచితంగా అందరికీ ఆరోగ్యం అనే బృహత్కార్యక్రమానికి, నూతన పరిణామ దశ వైపు అడుగిడదాం .
ప్రేమతో సాయి సేవలో
జిత్ కె.అగ్గర్వాల్