ప్రశ్నలు సమాధానాలు
Vol 7 సంచిక 2
March/April 2016
1. ప్రశ్న : వైబ్రియో రెమిడిలను హోమియో లేదా ఆయుర్వేద మందులతో పాటు తీసుకోకూడదనే విషయం నాకు తెలుసు మరి ఇతర అనుబంధ పదార్ధాలైన విటమిన్లు, ఖనిజ లవణాలను, మూలికలను ఈ రెమిడి లతో కలిపి తీసుకోనవచ్చా ?
జవాబు : నిరభ్యంతరంగా తీసుకోవచ్చు కానీ రెమిడి లకు ఈ అనుబంధ పదార్ధాలకు మధ్య 20 నిమిషాల విరామం తప్పనిసరిగా ఉండాలి.
________________________________________
2. ప్రశ్న: నా పేషంట్లకు ఆరోగ్య సలహాలు ఇవ్వడానికి -ఏ ఏ ఖనిజ లవణాలు ఆరోగ్యానికి మంచివి ఇవి ఏ ఆహార పదార్ధాలలో లభిస్తాయి?
జవాబు: ఈ ప్రశ్న ఈ ‘‘ప్రశ్నోత్తర వాహిని’’ పరిధికి మించినది. ఏ మైనప్పటికీ చికిత్సా నిపుణులు ఆహారము జీవన విధానం,ఆరోగ్యము వ్యాధులు పట్ల తమ జ్ఞానాన్ని పఠనము,పరిశోధన ద్వారా ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి. ఇప్పుడు అంతర్జాలంలో చక్కటి సమాచారము లభిస్తున్నది. ఐతే కొన్ని సైట్ లు తమ ఉత్పత్తులు పెంచుకోవడానికి టప్పుడు సమాచారము అందిస్తూ ఉంటాయి. వాటికి దూరంగా ఉంటూ విద్యా సంబంధమైన ప్రసిద్ధ వెబ్సైట్లు అందించే వాటిని స్వీకరించాలి. .
________________________________________
3. ప్రశ్న ఇటీవల దోమల ద్వారా వ్యాపించే క్రొత్తగా కనుగొన్న వ్యాధి జికా గురించి చాలా ప్రచారము జరుగుతున్నది. దీని నివారణకు ఏదయినా ప్రివెంటివ్ రెమిడి ఉందా ?
జవాబు: వ్యాధి ఎక్కువగా ప్రబలి ఉన్న ప్రాంతంలో SR300 Malaria Off 200C…BD ను వరుసగా మూడు రోజులు అలా మూడు నెలలు ఇవ్వండి. ఈ మూడు రోజులు ఏ ఇతర హోమియో లేదా వైబ్రియో రెమిడి లు ఇవ్వకండి. పైన పేర్కొన్న మందు హోమియో స్టోర్స్ లో లభిస్తుంది. ఇది మన CC9.3 Tropical diseases.లో కూడా చేర్చబడి ఉన్నది.
________________________________________
4. ప్రశ్న: ఎవరైనా పేషంటు మరణ శయ్యపై ఉంటే అది మనం ఎలా తెలుసుకోవచ్చు? అతనికి ఏ రెమిడి ఇవ్వాలి ?
జవాబు: సాధారణముగా పేషంటు యొక్క దగ్గర బంధువులద్వారా గానీ /పేషంటు యొక్క సంరక్షకుని యెద్ద నుండి గానీ లేదా డాక్టర్ వద్దనుండి గానీ ఈ సమాచారము పొందవచ్చు. ఇటువంటి పేషంట్లకు ప్రశాంతంగా ఉంచే రెమిడి SR272 Arsen Alb CM లేదా CC15.1 Mental & Emotional tonic…QDS చాలా ఉపకరిస్తాయి. ఏమయినప్పటికీ మరణాన్ని ఎవరూ ఉహించలేరు కానీ మరణం సమిపిస్తోందని తెలుసుకోవచ్చు.అటువంటి సందర్భంలో ప్రశాంతముగా మరణించడానికి పైన పేర్కొన్న రెమిడి లు ఉపకరిస్తాయి.అంతే కాకుండా ఇట్టి పేషంటుకు దగ్గరగా ఉన్న వారు కూడా తగినటువంటి రెమిడి తీసుకోవడం అత్యంత ఆవశ్యక మైనది.
________________________________________
5. ప్రశ్న: ఒక ప్రత్యేకమైన వ్యాధికి బ్లడ్ నోసోడ్ తయారు చేసినప్పుడు మరే ఇతర వైబ్రో రెమిడి ఇవ్వకూడదని నేను అనుకుంటున్నాను. ఐతే ఈ నోసోడ్ తీసుకుంటూ ఉన్నప్పుడే పేషంటుకు జుట్టురాలిపోవడం,చుండ్రు సమస్యలు తలెత్తినపుడు డానికి ప్రత్యేకమైన రెమిడి ఇవ్వవచ్చా?
జవాబు: ఏ వ్యాధి కైనా బ్లడ్ (లేదా వెంట్రుకలతో)నోసోడ్ ఇచ్చినపుడు అది ఇతర వ్యాధుల పైన కూడా పనిచేస్తుంది. అనగా ఈ నోసోడ్ పేషంటుకు పూర్తిగా స్వస్థత చేకూర్చడానికి ప్రయత్నిస్తుంది. అందువల్ల మరే ఇతర రెమిడి ఇవ్వవలసిన అవసరం లేదు అలా ఇస్తే అది నోసోడ్ యొక్క ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంది .
________________________________________
6. ప్రశ్న: బ్రాడ్కాస్టింగ్ చేయడానికి పేషంటు యొక్క ఫోటో దొరకనప్పుడు ఒక పేపరు మీద వివరాలు వ్రాసి (పేషంటు యొక్క పేరు,తేది, పుట్టిన ఊరు, పేషంటు యొక్క సమస్య )రెమిడి వెల్ లో వేయవచ్చా ?
జవాబు: రెమిడి వెల్ ద్వారా బ్రాడ్కాస్టింగ్ చేయడానికి తప్పనిసరిగా పేషంటు తాలూకు వస్తువు ఉండాలి ఎందుకంటే పేషంటు తాలూకు వైబ్రేషణ్ దానిలో దాగి ఉంటుంది. కనుక పేషంటు వివరాలు పేపరు మీద వ్రాసి దానిని ఉపయోగించడం సరియయిన పధ్ధతి కాదు.కనుక పేషంటు యొక్క రక్తపు చుక్క గానీ ,వెంట్రుక గానీ లేదా ఫోటో గానీ (పూర్తి నిడివి కలిగినది ఐతే మంచిది) ఉపయోగించడం మంచిది.
________________________________________
7. ప్రశ్న:నా దగ్గరకు వచ్చిన ఒక పేషెంటు కు ఒక సమస్య నిమిత్తం రెమిడి ఇస్తే అతనికి 3 రోజులనుండి మలవిసర్జన ఆగిపోయింది. మలబద్ధకం పుల్లౌట్ లో భాగమేనా నేను ఆమెతో ఎక్కువ నీరు త్రాగాలని కూడా చెప్పాను.
జవాబు : ఈ పేషంటు కు మలబద్ధకం లేనట్లయితే ఇది రెండవ రకము పులౌట్ గా భావించవచ్చు. సాధారణంగా పెద్దప్రేవులో నీరు ఎక్కువగా శోషించబడితే మలము గట్టిగా మారి మలబద్దకం ఏర్పడుతుంది. ఈ మలబద్దకము తోపాటు కడుపులో అసౌకర్యము కూడా తోడయితే అప్పుడు తాత్కాలికంగా డోసేజ్ ని తగ్గించే ప్రయత్నము చేయాలి లేదంటే ఏమీ చేయవద్దు. ఎక్కువగా నీరు తీసుకోవడం మలబద్ధకం ఉన్నవారికి చాలా మంచిది. అల్బకరా గానీ దాని జ్యూస్ గానీ లేదా సై లియం పైన పొట్టు కూడా మలబద్ధకానికి బాగా పనిచేస్తుంది.
________________________________________
8. ప్రశ్న: 108CC పుస్తకంలో కంటి సమస్యలతో బాధ పడుతున్నవారు (ఉదా:కేటరాక్ట్ ) 25,000 IU (ఇంటర్నేషనల్ యూనిట్ల) విటమిన్ A ను తీసుకోవాలని సూచించబడింది, ఇది సరియయినదేనా?
జవాబు : మనం రోజూ తీసుకోవలసిన విటమిన్ A నిర్ధారిత ప్రమాణము 10,000 IU కన్నా తక్కువ. స్వామి నారాయణి సూచించిన 25,000 IU అనేది ఇప్పుడు వాడుకలో లేదు. 108CC పుస్తకం తరువాత సంచికలో ఈ విషయం చేరుస్తాము.
________________________________________
9. ప్రశ్న: కూరగాయల పైనా,పండ్ల పైనా చేరి ఉన్న పురుగుమందులను శుభ్రము చేయుట గురించి నా పేషంట్లతో ఏమీ చెప్పాలి?
జవాబు : తగిన ప్రమాణము గల ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక చెంచా నిండుగా ఉప్పు, రెండు చెంచాల వినెగర్ వేసి బాగా కలపాలి.కూరగాయలు ,పండ్లను ఆ బౌల్ లో 20 నిముషాలు నాననివ్వాలి. ఈ విధానము కూరగాయలు,పండ్ల పైన ఉన్న పురుగుమందులను తొలగిస్తుంది. ఇలా చేసిన తర్వాత నల్లా క్రింద వీటిని ఉంచి నీటిని ప్రవహింప చేస్తే ఆ పురుగుమందుల తాలూకు శేషము ఏ మైనా ఉన్నా తొలగిపోతుంది.