అదనపు సమాచారం
Vol 7 సంచిక 2
March/April 2016
శరణార్ధుల కోసం గ్రీస్ దేశంలో వైబ్రియో మెడికల్ క్యాంప్
ఆఫ్రికా మరియు మధ్య ప్రాచ్య దేశముల మధ్య ఏర్పడిన సంక్షోభం కారణంగానూ,పేదరికం కారణంగానూ వలస వచ్చిన శరణార్ధులకు మానవతా దృక్పధంతో గ్రీస్ దేశంలోని ఎథెన్స్ నగరం ఆశ్రయం కల్పిస్తోంది. గత రెండున్నర నెలలులుగా ప్రాక్టీషనర్ లు 01768, 03118, 03107, 01379 ఈ క్యాంపులలోని శరణార్ధులకు వైబ్రియో సేవలు అందిస్తున్నారు.
హొమియోపతీ డాక్టర్ గానూ మరియు ఆక్యుపంక్చర్ నిపుణురాలు గానూ ఉన్న ఒక సాయి సోదరి మాతో కలసి ఎందరో శరణార్ధులకు సేవలందించారు.ఆ అనుభవాలు మీతో పంచుకోదలుచుకున్నాము.
ఈ సేవ 2015 డిసెంబర్ 12 న ప్రారంభమయ్యింది. ఇప్పటి వరకు 10 మార్లు సందర్శించిన ఈ ఎథెన్స్ ప్రాంతంలోని రెండు వేరువేరు క్యాంపులలో 135 మంది పేషంట్లను వీరు చూడడం జరిగింది. ప్రాక్టీషనర్లు ప్రధానంగా గాయాలు,మరియు హానికరమైన ,కఠిన తరమైన ప్రయాణం వల్ల ఏర్పడినసమస్యలకు మందులు ఇవ్వడం జరిగింది. చాలామంది శరణార్ధులు గ్రీస్ చేరుకునే ప్రస్థానంలో బలవంతంగా టర్కీ సముద్రపుటొడ్డున ప్రయాణము చేయవలసి రావడంతో జలుబు మరియు ఫ్లూ బారిన పడ్డారు. దిగ్బంధనం చేయబడిన ఈ ప్రాంతం నుండి తమ పిల్లలను,సామానును తీసుకొని రావడానికి పర్వతాలను కూడా దాటవలసి రావడంతో వీరిలో చాలామందికి కండరాల సమస్యలు ఏర్పడ్డాయి. ఎవరికైతే ఈ మందులు ఇవ్వబడ్డాయో వారి నుండి చక్కని స్పందన లభించింది కానీ తిరిగి ఈ మందులు కొనసాగించడానికి అవకాశం లేకుండా పోయింది, ఎందుకంటే వీరు యూరప్ కు తమ ప్రయాణం కొనసాగించడానికి ముందుకు సాగిపోతూ ఉండేవారు. ప్రాక్టీషనర్ లు వారి భావాలను ఇలా వ్యక్తం చేస్తున్నారు. ‘‘అద్భుత మైన విషయం ఏమిటంటే మేము ఓపికతో ప్రేమతో శరణార్ధులు చెప్పేదంతా విని స్వాంతన వచనాలు పలుకుతూ రెమిడి లు ఇవ్వడం వారికెంతో తృప్తిని ఇచ్చింది. వారి బాధా తప్త ముఖాలలో మా కరుణామయ మాటలద్వారా ,మా ప్రేమద్వారా కల్పించగలిగిన ఆనందాన్ని స్ప్సష్టంగా చూడగలిగాము’’. మా సేవలో భాగంగా కొందరు పశ్చిమ ప్రాంత అలోపతి డాక్టర్ లను కూడా కలుసుకొనే భాగ్యం కలిగింది . ఈ వైద్య సిబ్బంది ముఖ్యంగా డాక్టర్లు మేము చేసే సేవలకు తమవంతు సహకారం అందించారు. మొట్టమొదట ఈ సిబ్బంది లో ఉన్న ఒక నర్సు మా వైద్య విధానము పట్ల ఎన్నో సందేహాలు వెలిబుచ్చినా పేషంట్ల తో మేము ప్రవర్తించే తీరు కరుణ, ప్రేమలతో కూడిన మా సేవ విధానము చూసి ఆవిడ తన అభిప్రాయాన్ని మార్చుకున్నది.
_________________________________________
పరిపాలనా విభాగపు సేవకు గుర్తింపు
ప్రాక్టీషనర్ 02868…యుఎస్ఎ వీరు వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ గా 2012 లోన్ సీనియర్ వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ గా 2015 లోనూ నమోదు చేయబడినారు. నిరంతర ప్రవాహ పరంపరగా వస్తున్న వార్తాలేఖల విభాగమునకు డిజిటల్ యాక్సెస్ కల్పించడానికి ,ఈ వార్తాలేఖలను అభివృద్ధి పరుచబడిన అన్వేషణ,కార్యాచరణ సహితంగా మన వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి గల విస్తృత అవకాశాలను దృష్టిలో ఉంచుకొని వీరు ముందుకు వచ్చి దీనికంతటికి బాధ్యత తీసుకున్నారు. ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన విభాగము ఎందుకంటే అనేక విభాగాలుగా ఉన్న వార్తాలేఖను సమీక్షించడం,ఫార్మేట్ చేయడం,ట్యాగ్ చేయడం వ్యక్తిగతంగా పంపించడం ఇవన్నీ దీనిలో భాగమే..
వార్తాలేఖలను పొందు పరచడం లోనూ 12 భాషలలో లభ్యమవుతున్న వీటిని సులభంగా అందుబాటులో ఉంచేలా చూడడంలోనూ వీరు కీలక పాత్ర నిర్వహిస్తున్నారు. వీరికి అంకితభావం గల ఆరుగురు ప్రాక్టీషనర్లు వార్తాలేఖలను ఇతర భాషలలోనికి అప్లోడ్ చేయడంలో సహకరిస్తున్నారు. ఈ విధంగా తమ నిశ్శబ్ద విప్లవం మాదిరిగా తమ సేవానిరతితో ప్రపంచవ్యాప్త అశేష పాఠకలోకానికి సేవలందిస్తున్నవీరు వీరి బృందాన్నిఅబినందించకుండా ఉండలేము. . .
ప్రాక్టీషనర్ 11964...ఇండియా వీరి వైబ్రియోనిక్స్ ప్రవేశము 2014 నూతన సంవత్సరం నాడు కావించబడింది.అత్యంత తక్కువ సమయంలోనే వీరు AVP నుండి వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ గా అయ్యారు. వీరి సంకల్పము దీక్ష ఒక్క సంవత్సరం లోనే వీరిని సీనియర్ వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ గా చేసింది. అనంతరం వీరు కేస్ హిస్టరీ లు రాయడం, ఎడిటింగ్ చేయడం అనే పనిని చేపట్టారు. వైబ్రియోనిక్స్ సంస్థ లో ప్రపంచ స్థాయి ప్రామాణికతను తీసుకురావడానికి గల ప్రత్యేకమైన అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ఇటివలే వీరు ఇంటర్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాయి వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్స్ (IASVP). లో అప్లికేషన్స్ ఫర్ మెంబర్ షిప్ విభాగంలో పూర్తీ స్థాయి బాధ్యతను తీసుకోవడం జరిగింది. ఈ పనిలో వీరికి ఎంతో అంకిత భావంతో పనిచేసే ఇద్దరు సీనియర్ ప్రాక్టీషనర్లు 11271 & 11231…India గుర్తింపు కార్డులు తయారీలోనూ వాటిని పంపించే ప్రక్రియ లోను సహాయపడుతున్నారు. ఇంతటి బృహద్ బాధ్యతను చక్కగా నిర్వహిస్తున్న వీరికి అభినందనలు తెలుపుతున్నాము.