అదనపు సమాచారం
Vol 7 సంచిక 1
January/February 2016
అమెరికాలో మొదటి SVP వర్క్ షాప్, వెస్ట్ విర్జీనియా, 18-20 తేదీలు సెప్టెంబర్ 2015
శరత్ కాలపు నీరెండలలో వాషింగ్టన్ డిసికి దగ్గర 2015 సెప్టెంబర్ 18-20 వారాంతపు తేదిలలో మొదటి సీనియర్ వైబ్రియో నిపుణుల శిక్షణా శిబిరము జరిగింది. 6 జూనియర్ ప్రాక్టీషనర్లు అమెరికా, కెనడా కోఆర్డినేటర్ 01339, ఇద్దరు సీనియర్ ప్రాక్టీషనర్లు పాల్గొన్న ఈ శిక్షణా శిబిరము ను శ్రీమతి మరియు శ్రీ జిత్ కె.అగ్గర్వాల్ గారు నిర్వహించారు. ఈ శిక్షణకు రాకముందు JVP విద్యార్ధులు SVP దరఖాస్తును పూర్తిచేసి 9 నెలల SVP e-కోర్సును కూడా విజయవంతంగా పూర్తిచేసారు. ఈ శిక్షణ యొక్క ప్రధాన లక్ష్యము SRHVPను సమర్ధవంతంగా వినియోగించుట గురించి. ప్రధానంగా సిమ్యులేటర్ కార్డులు ఉపయోగించి రెమిడిలు తయారుచేయడం, నోసోడ్లు ( సన్ నోసోడ్ తో సహా) తయారుచేయడం, ప్రసారం చేయడం, అల్లోపతిక్ మందులను పోటేన్టైజ్ చేయడం, అలెర్జీ నిరోధకాలు వాటి అనుబంధాలు, గతంలో ఇచ్చిన రెమిడిలను తటస్థ పరచడం వీటి గురించి ప్రధానంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. డాక్టర్ అగ్గర్వాల్ SRHVP యొక్క పనితీరును వివరిస్తూ ఇది అనుకూలంగా స్వస్థత చేకూర్చే వైబ్రేషణ్ మాత్రమే ఇస్తుందని, అనగా వ్యాధిగ్రస్తమైన పదార్ధాన్ని పోటెంటైజ్ చేసినపుడు వచ్చే రెమిడికి వ్యాధి నయం చేసే వై బ్రేషణ్ మాత్రమే ఉంటుందని తెలిపారు.
రెమిడి లను ఎంచుకోవడం, పులౌట్, మియాజంలకు వైద్యం, క్షాళన లేదా క్లెన్సింగ్ నిర్వహణా నియమాలు, పెండ్యులం లేదా లోలకాన్ని ఉపయోగించడం గురించి సవివరమైన విషయాలను ప్రస్తావించడం జరిగింది. చికిత్సా నిపుణులకు వైబ్రియోనిక్స్ లో ఉన్న స్వస్థత చేకూర్చే నిర్మాణాలు (హీలింగ్ మెకానిజం) గురించి అనగా శరీరము తనకు తానే స్వస్థపరుచుకుంటుందని వైబ్రియో గోళీలు కేవలం అలా స్వస్థ పరుచుకొనే ప్రక్రియను క్రియాశీలం చేస్తాయని వివరంగా చెప్పారు.
ఈ SVP శిక్షణతో పాటుగా చికిత్సా నిపుణులను అనేక ప్రయోగాలలో పాల్గొని తమ పరిశీలనా ఫలితాలను తెలియపరచవలసినదిగా సూచించడమైనది.
1. ఒక రెమిడిని పేషంట్ TDS గా తీసుకుంటున్న సందర్భంలో మొదటి డోస్ ను నీటితో ప్రతీ 10 నిమిషాలకు ఒకటి చొప్పున రెండూ గంటలు వేసుకొని మిగతా రెండు డోసులు మామూలుగా వేసుకోమని చెప్పి ఫలితాలను రికార్డ్ చెయ్యాలి.
2. SRHVPతో ప్రసరింపచేస్తూ ఉన్నప్పుడు 200C పొటెన్సి, ఫలితాన్ని ఇవ్వనప్పుడు 1M పొటెన్సి నిచ్చి ఫలితాన్ని రికార్డ్ చేయండి.
3. ఫంగస్ లేదా బూజు వ్యాధి సోకిన ఒక మొక్క నుండి వ్యాధికి గురైన ఒక ఆకును తీసుకొని నీటితో నోసోడ్ ను తయారు చేయండి. ఇలా చార్జ్ చేసిన నీటిని మరింత ఎక్కువ చేసి వ్యాధి సోకిన మొక్కకు, ఇతర మొక్కల పైన చల్లండి, ఫలితాన్ని రికార్డ్ చేయండి. ఒక వ్యాధి సోకిన మొక్క నుండి తయారు చేసిన నోసోడ్ ఇతర వ్యాధి సోకిన మొక్కల పైన ప్రభావం చూపుతుందా లేదా రికార్డ్ చేయండి.
శిబిరములో పాల్గొన్న భాగస్వాములంతా శిక్షణ విజయవంతమైనట్లు భావించారు. వీరంతా తమ ప్రతిస్పందనలు (ఫీడ్బ్యాక్) తెలియ జేస్తూ కలిసికట్టుగా పనిచేస్తూ నేర్చుకోవడం అనేది ఈ శిక్షణా శిబిరములోని గొప్ప అంశమని అభిప్రాయపడ్డారు. ఇతర చికిత్సానిపుణుల అనుభవాలను, వారి సమాధానాలను తెలుసుకోవడం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు. ఏదో వారాంతపు కార్యక్రమంగా వచ్చిన వీరికి ఇంత అద్భుతమైన శిక్షణ లభించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ శిక్షణ, సభ్యుల మధ్య ఒక అనుభందాన్ని సహకార తత్వాన్ని పెంపొందించింది. ముఖ్యంగా ఆతిధ్యం ఇచ్చిన కోఆర్డినేటర్ మరియు వారి భర్త తమ గృహాన్నే కాదు తమ హృదయాన్ని కూడా తెరిచి మర్యాద చేసినందుకు అందరు అభినందనలు తెలియజేసారు. సాయం సమయంలో వీరి అందమైన భవనంలో కలుసుకొని తమ దినచర్య పైన సమీక్ష నిర్వహించుకోవడం ఒక చక్కని అనుభూతిగా భావించారు.
ఈ శిక్షణ జరుగుతున్నప్పుడు ఈ ప్రోగ్రాం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి అగ్గర్వాల్ గారు ఎంతో విస్తృతమైన దీనిని 3 రోజులకు ప్రోగ్రాంగా కుదించడం నిజంగా ఒక సవాలు. ఐనప్పటికీ పాల్గొన్న వారంతా కష్టపడి పనిచేసారు, ఎందుకంటే వీరి పరీక్షలలో ఆ ప్రతిభ కనబడింది. స్వామి ఈ శిక్షణ జరుగుతున్నన్ని రోజులలో తమతోనే ఉన్నట్లు సభ్యులు అనుభూతి పొందారు. వీరందరికీ తెలుసు తాము ఇతరులకు నిస్వార్ధంగా సేవ చెయ్యాలనే ఒక ఉన్నతమైన లక్ష్యానికి ఎన్నుకోబడ్డ వారమని. ఈ శిబిరంలో జ్ఞానము తో బాటు ఇతర చికిత్సా నిపుణులనుండి ఒక హాస్య రస వాతావరణంలో తమ భావాలను పంచుకోవడానికి అవకాశం కలిగింది. ప్రతీ ఒక్కరుకూడా ద్విగుణీకృతమైన ఉత్సాహంతో మరింత ఎక్కువగా మనుషులు, జంతువులూ, మొక్కలను విబ్రియోనిక్స్ ద్వారా సేవించాలనే పట్టుదలతో తమ ఇళ్ళకు చేరుకున్నారు.
మెడికల్ క్యాంప్, జఖోల్, ఉత్తరాఖండ్, భారత దేశము, 2015 సెప్టెంబర్ 21-25 తేదీలు
ఉత్తరాఖండ్ లోని హిమాలయ మారుమూల ప్రాంతమైన జఖోల్ లో 2015 సెప్టెంబర్ నెల 21-25 తేదీల మధ్య వైబ్రో మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి ముగ్గురు ప్రాక్టీషనర్లకు ఆహ్వానం అందింది. ఇంగ్లాండ్ కి చెందిన బెటర్ లైవ్స్ ఫౌండేషన్ మరియు ఉత్తరాఖండ్ లో డెహ్రాడున్ లో గల నిర్మల్ ఆశ్రమం కంటి ఇన్సిట్యూట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈ క్యాంప్ నిర్వహించబడింది. యుకె 02894, కెనడా 02750 మరియు ఉత్తరాఖండ్ 11121 ఈ ముగ్గురూ కలసి 1,080 పేషంట్లను చూడడమే కాక అదనంగా 350 మంది విద్యార్ధులకు సాధారణ టానిక్ లు ఇవ్వడం కూడా జరిగింది. ఈ క్యాంప్ అందరికీ ఎంతో సంతృప్తిని ఆనందాన్నిఇచ్చింది. అంతేకాకుండా స్థానిక డాక్టర్లు, నర్సులు, ప్యారామెడికల్ సిబ్బంది మరియు నిర్వాహకులకు వైబ్రియోనిక్స్ పట్ల అభిరుచి అవగాహనను పెంపొందించింది. ఒక ప్రాక్టీషనర్ వైబ్రియోనిక్స్ పట్ల డాక్టర్లకు సవివరమైన సమాచారాన్నికూడా అందించారు.
శిక్షణాశిబిరము, ఆలువా ,కేరళ , ఇండియా , 2015 అక్టోబర్ 2
ప్రొఫెసర్ ముకుందన్ డాక్టర్ ప్రొఫెసర్ ముకుందన్ గారి ప్రారంభోత్సవ ఉపన్యాసము పంకజాక్షన్ తో కలసి జ్యోతి ప్రజ్వలన
2015 అక్టోబర్ 2వ తేదీన కేరళలోని ఆలువాలో కేరళ రాష్ట్ర వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ల శిక్షణా శిబిరము జరిగింది. కేరళలోని వివిధ ప్రాంతాల నుండి 39మంది పాల్గొన్నారు. ప్రాక్టీషనర్ 11231 అతిధులను ఆహ్వానిస్తూ స్వాగతోపన్యాసం చేసారు.
ముఖ్య అతిధిగా విచ్చేసిన కేరళ రాష్ట్ర సత్యసాయి సేవాసంస్థ అధ్యక్షులు ప్రొఫెసర్ ముకుందన్ గారు స్వామితో తమ అనుబంధాన్ని, అద్వితీయ అనుభవాలను వివరిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసారు. కేరళ కోఆర్డినేటర్ 02090 సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక కాలంలో వైబ్రియోనిక్స్ యొక్క ప్రాముఖ్యతను వివరించి చెప్పారు. ప్రస్తుత తరుణంలో అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వైబ్రియోనిక్స్ ద్వారా సమాజ సేవలో పాల్గొనాలని రానున్న కాలంలో మరింత ఎక్కువ సేవలు అందించాలనే ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రాక్టీషనర్ 11231 వివిధ రకాల పోషినిలు ఉదాహరణకు “బాలపోషిని” (పిల్లల టానిక్ ) విద్యాపోషిని (విద్యార్ధుల టానిక్) గురించి వివరించారు. వీరు రక్తము యొక్క pH బ్యాలెన్స్, వత్తిడిని సమర్ధవంతంగా అరికట్టే విధానము గురించి కూడా వివరించారు. ప్రాక్టీషనర్ 11993...ఇండియా గారి, మానవ దేహంలో గల చక్రాలు సాయి వైబ్రియోనిక్స్ వాటికి గల సంబంధం అనే టాపిక్తో ఉదయం సమావేశము ముగిసింది. మధ్యాహ్నం సమావేశంలో ప్రాక్టీషనర్లందరూ కేస్ హిస్టరీల గురించిన సమాచారాన్ని, తమ అనుభవాలను తెలియజేసారు. సభ్యులందరూ కూడా వైబ్రో రెమిడిల యొక్క అద్భుత అనుభవాలను వివరించారు. ఇవి మిగతా వారికి ఎంతో ప్రేరణ నివ్వడంతో ఇటువంటి శిబిరాలు సంవత్సరానికి ఒక సారి గానీ, రెండుసార్లు గానీ నిర్వహించుకోవాలని సూచన చేయబడింది.
తమ ముగింపు ఉపన్యాసంలో కేరళ కోఆర్డి నేటర్ 02090 ప్రాక్టీ షనర్లందరూ తమ కోపాలను, ఇతరులను గూర్చి చెడుగా మాట్లాడడం, విచారంగా ఉండడం వంటివి పోగొట్టుకోవాలని చెప్పారు. ఇంకా ఎర్నాకులం జిల్లాలో జరుగుతున్నట్లుగా నెలకు ఒకసారి ప్రాక్టీషనర్ల సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా వారు చెప్పారు. కరతాళ ధ్వనులతో అందరూ దీనిని ఆమోదించగా హారతితో సమావేశము ముగిసింది.
JVP శిక్షణ మరియు రెఫ్రెషర్ కోర్సు, పూణే, మహారాష్ట్ర, భారత్ దేశము, 2015అక్టోబర్ 10-11తేదీలు
2015 అక్టోబర్ 10 -12 తేదీలలో పూనాలో, 11 మంది AVP లు మరియు 9 మంది JVP ల తో శిక్షణా శిబిరము మరియు రిఫ్రేషర్ కోర్సు జరిగింది. వైబ్రియోనిక్స్ టీచర్ మరియు పూనా కోఆర్డినేటర్10375 ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఇంకా వైబ్రియోనిక్స్ టీచర్లు 11422 & 02789 మరియు ముంబాయి కోఆర్డినేటర్ 10014 లు అభ్యాసకులకు విలువైన సమాచారమును అందించారు. శిక్షణకు ముందు AVPలు JVP మాన్యువల్లో ఉన్న అవసరమైన e-కోర్సు ను పూర్తిచేసారు. ఈ శిక్షణలో వైబ్రియోనిక్స్ ఆవిర్భావము, దీని అనువర్తనము గురించి చెప్పబడింది. ప్రాక్టీషనర్లకు సామూహిక కృత్యాలు ఇచ్చి కేస్ హిస్టరీలను డాక్యుమెంటేషన్ చేయడం, వీరికి ఇవ్వబడ్డ కేసులకు సంబంధించి మందు యొక్క మోతాదు (డోస్ మరియు డోసేజ్) సూచించే కృత్యాలు ఇవ్వబడ్డాయి. పాల్గొన్న వారికి బోధనా సిబ్బంది వైబ్రియోనిక్స్ పైన సమగ్ర జ్ఞానాన్ని అందించడమే కాక ఉపయోగకరమైన ఆరోగ్య చిట్కాలు కూడా తెలియచేసారు.
శిక్షణ ముగింపు రోజున పాల్గొన్నవారికి డాక్టర్ అగ్గర్వాల్ గారితో స్కైప్ కాల్ ఏర్పాటు చేయబడింది. స్వామి దయవల్ల గంటన్నర సమయం సాగిన ఈ పరస్పర చర్చ ప్రసార మాద్యమం ఇబ్బందులేమి లేకుండా చక్కగా జరగడం విశేషం. అనంతరం 108CC కిట్లు చార్జింగ్ చేసే సందర్భంలో అక్కడ వాతావరణం అంతా ఓంశ్రీసాయిరాం నామ స్మరణతో మార్మ్రోగిపోయింది. విభూతి వాసన హాలంతా వ్యాపించడంతో స్వామి తమతోనే ఉన్నారనే భావన సభ్యులను పులకింపచేసింది. ప్రతీ ఒక్క ప్రాక్టీ షనర్ స్వామి ఆశీస్సులు ఆ విధంగా అందినందుకు కృతజ్ఞతా భావంతో రెట్టించిన ఉత్సాహంతో పేషంట్లకు సేవచేసేటందుకు తమ ఇళ్ళకు తరలివెళ్లారు.
ప్రాక్టీ షనర్లు అందించిన ఫీడ్ బ్యాక్ లో శిక్షణలో కల్పింప బడ్డ అనేక ప్రదర్శనలు తమకు అనేక రకాలుగా ఉపయోగపడేవిధంగా ఉన్నాయని వ్రాసారు. ఒక సభ్యుడు ఇక్కడ అభ్యాసనా కృత్యాలు ఇతర సభ్యులతో భాషణలు తనను నిజమైన ప్రాక్టీ షనర్ గా రూపుదిద్దుకునేలా చేసాయని వ్రాసారు. మరొకరు వైబ్రియోనిక్స్ రంగంలో వచ్చిన నూతన మార్పులను తెలుసుకొనడానికి ఇది ఒక చక్కని వేదిక అని వ్రాసారు.
ఓం సాయి రామ్!