Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో

Vol 4 సంచిక 1
January/February 2013


ప్రియమైన ప్రాక్టీషనర్లకు,

ఈ 2013 నూతన మరియు పవిత్రమైన సంవత్సరం మీ అందరికీ ఎంతో ఆనందాన్ని అందించాలని అభిలషిస్తూ ప్రారంభిస్తున్నాను!                                                                                                                       స్వామి యొక్క అపారమైన దయ ద్వారా వైబ్రియానిక్స్ గత సంవత్సరం గొప్ప పురోగతి సాధించింది. మన భోధనా కార్యక్రమం యొక్క సంపూర్ణ పునర్నిర్మాణం విజయవంతంగా నిర్వహించాము. శిక్షణా కార్యక్రమాల నాణ్యతను మెరుగుపరచడానికి అన్ని స్థాయిలలో 6-10 వారాల వ్యవధి గల కరెస్పాండెన్స్ కోర్సును అన్నీ స్థాయిలలో ఏర్పాటు చేసాము. ప్రాక్టీషనర్ గా అర్హత సాధించడానికి తదుపరి 2-5 రోజుల ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా నిర్వహించాలని తలపెట్టాము. గత సంవత్సరం ఎంతోమంది నూతన అభ్యాసకులు శిక్షణ పొందారు, ఇప్పటికే ఉన్న చాలా మంది ఉన్నత స్థాయిని పొందారు మరియు అనేక మంది అభ్యాసకులు సర్టిఫైడ్ ఉపాధ్యాయులుగా కూడా మారారు. ఇది మన వైబ్రియానిక్స్ ఉద్యమం వేగంగా అభివృద్ధి చెందడానికి దోహదం చేసింది. దీనికి నేతృత్వం వహించిన ఉపాధ్యాయులు మరియు సలహాదారులు అంకితభావంతో మరియు అవిరామంగా చేసిన కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మన వైబ్రియానిక్స్ కుటుంబంలో కొత్తగా చేరిన సభ్యులందరికీ ఆత్మీయ స్వాగతం!

మన వైబ్రియానిక్స్ లో నిర్వర్తించవలసిన కార్యక్రమాల స్థాయి పెరుగుతున్నందున పరిపాలన మరియు నిర్వహణలో సమన్వయ కర్తలుగా స్వచ్ఛంద సేవ అందించానికి చురుకైన అభ్యాసకులు అవసరం. మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా వైబ్రియానిక్స్ సేవలో ఏ స్థాయిలో నైనా ముందంజలో ఉండాలి అంటే దయచేసి మీ పేరు, అర్హత, మరియు అనుభవం తెలియజేస్తూ మాకు ఈ మెయిల్ పంపండి. ఈ విధంగా తగినంతమంది సమన్వయకర్తలు సమకూరినట్లయితే ఈ సంవత్సరం చివరిలో ప్రశాంతి నిలయంలో ఒక సమావేశము నిర్వహించాలని భావిస్తున్నాము.  

కొంతమంది అభ్యాసకులు వారికి సంబంధించిన విజయవంతముగా స్వస్థత పొందిన కొన్ని అద్భుతమైన కేసుల గురించి కథలను నిరంతరం ఫోన్ ద్వారా మౌఖికంగా నివేదిస్తున్నారు, కానీ వాటిని వ్రాసి పంపడానికి తమ అశక్తతను వ్యక్తం చేస్తున్నారు. అటువంటి సందర్భంలో కేసుల రిపోర్టింగ్ సులభతరం చేయడానికి ఫోనులో పూర్తి కేసు వివరాలను తీసుకోవడానికి ముందుకు వచ్చిన అనేకమంది వాలంటీర్లను మేము నియమించాంచాము. ఇవి ఈమెయిల్ ద్వారా ప్రచురణకోసం మాకు సమర్పింప బడతాయి. మీరు ఈ సేవలు పొందాలనుకుంటే   [email protected]  కు ఈమెయిల్ పంపండి. మీరు సంప్రదించడానికి అందుబాటులో ఉన్న వాలంటీర్ యొక్క వివరాలను మేము మీకు అందిస్తాము. అలాగే మీలో ఎవరికైనా చాలా అసాధారణమైన కేసులు ఉండి ఇతరుల ప్రయోజనం కోసం అవి ప్రచురింపబడాలని మీరు కోరుకుంటే మా వార్తలేఖ యొక్క భవిష్యత్ సంచికలో సంబంధిత అభ్యాసకుని ప్రత్యేక విషయంగా చోటు చేసుకుంటుంది. కాబట్టి మీ అత్యుత్తమ కేసులను ఇప్పుడే ప్రోగు చేయడం ప్రారంభించండి!   

డిసెంబర్లో మేము రెండు ప్రత్యేక పునశ్చరణ సదస్సులు - ఒకటి  ముంబైలో మరొకటి భారతదేశంలోని కేరళలో నిర్వహించాము   (వీటికి సంబంధించిన ఫోటోలు త్వరలో మా వెబ్ సైట్ లో పోస్ట్ చేయ బడతాయి). ముంబైలో జరిగిన ఈ వర్క్ షాప్ లో భారత రాష్ట్రములైన మహారాష్ట్ర మరియు గోవాకు చెందిన 108 మంది అభ్యాసకులు పాల్గొన్నారు. సత్యసాయి సంస్థకు చెందిన రాష్ట్ర అధ్యక్షుడు మరియు అఖిల భారత ఉపాధ్యక్షునితో సహా సీనియర్ ఆఫీస్ కార్యకర్తలందరూ పాల్గొని వైబ్రియానిక్స్ కు తమ ధృఢమైన నిరంతర మరియు బేషరతు మద్దతు అందించడానికి హామీ ఇచ్చినందులకు మా కృతజ్ఞతలు. కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో జరిగిన ఈ వర్క్ షాప్ లో 51 మంది అభ్యాసకులు పాల్గొన్నారు. వ్యక్తిగతంగా హాజరు కాలేక పోవడంతో రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొన్న వారిని ఉద్దేశించి టెలిఫోన్లో ఉత్తేజకరమైన సందేశం అందించారు. ప్రపంచంలోని అత్యంత ఘోరమైన పురుగుమందుల విషాదములలో ఒకటైన ఎండోసల్ఫాన్ విషాద బాధితులకు చికిత్స చేయడానికి ఈ జిల్లా అభ్యాసకులు ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టును చేపట్టారు. మేము కూడా ఈ ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించాము. మా అభ్యాసకులు చేసిన కృషి ప్రశంసించతగినది.

నెలవారీ పురోగతి నివేదికలను పంపడం యొక్క ప్రాముఖ్యత గురించి మరోసారి మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. మీరు చురుకైన అభ్యాసకులని మేము తెలుసుకోవాలనుకునే సందర్భంలో మీ ప్రాంతంలో భవిష్యత్తులో రాబోయే రోగులకు మేము మీ సంప్రదింపుల సమాచారం ఇవ్వగలము. ఇది మా వార్షిక నివేదిక కోసం సమగ్ర గణాంకాలను సమకూర్చడానికి కూడా సహాయపడుతుంది. మీ అనుభవాలపై మీ అభిప్రాయం మరియు మీ కేస్ హిస్టరీలు మా పుస్తకాలను అప్ టు డేట్ గా ఉంచడానికి మాకు సహాయపడుతుంది. కనుక ప్రతీ నెల మీ నివేదికలను సకాలంలో మాకు పంపడం కొనసాగించమని మేము మిమ్మల్ని కోరుకొంటున్నాము.                                                                                               భారతదేశంలోని ఢిల్లీ- ఎన్ సి ఆర్ లోని మా అభ్యాసకులు కొందరు ప్లాంట్ టానిక్ ఉపయోగించి మొక్కల పై ప్రయోగాలు చేసారు. ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి! తదుపరి సంచికలో వారు కనుగొన్న విషయాల పూర్తి సమాచారం అందించబడుతుంది.

చివరిగా మీ అందరికీ ఈ నూతన సంవత్సరం ఒక అద్భుతమైన సంవత్సరం కావాలని కోరుకుంటున్నాను. స్వామి మన హృదయాలను ప్రేమతో మరియు శరీరాలను శక్తితో నింపాలని మనం ఎంచుకున్న సేవను ఉత్సాహంతో మరియు రెట్టింపు ప్రయత్నముతో  కొనసాగించాలని కోరుకుంటున్నాను.

ప్రేమతో సాయి సేవలో మీ

జిత్ కె అగర్వాల్.