Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో

Vol 4 సంచిక 2
March/April 2013


ప్రియమైన ప్రాక్టిషనర్స్,

2011 లో స్వామి తమ భౌతిక దేహాన్ని వీడి మనందరినీ దుఃఖసాగరంలో ముంచెత్తిన సమయం ఈ మాసమే. స్వామిభౌతిక దేహము పైన మనకున్న అభిమానముతో మనం స్వామిలేరని భావిస్తున్నప్పటికీ, నిస్వార్థంగానూ, ప్రేమతోనూ వారిసేవలో పాల్గొన్నవారికి స్వామి తమలోనే ఉన్నారు అనే భావన కలుగక మానదు. స్వామి మనకందించిన ఈ సాయి వైబ్రియోనిక్స్ సేవ ఎంత మహత్తరమైనదంటే – మనకి మనం మరియు ఇతరులకు నయం చేయడానికి, స్వామి యొక్క దయకు మరియు అనుగ్రహానికి పాత్రులు కావడానికి ఇది ఒక అద్భుతమైన వరం.

మీ అందరికి తెలిసే ఉంటుంది గతనెల నుండే  మనం అధికారికంగా గుర్తింపబడినాము. ద ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాయి వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్స్ (IASVP) (సాయి వైబ్రియానిక్స్ చికిత్సా నిపుణుల అంతర్జాతీయ సంస్థ) ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ చేయబడిన చట్టబద్దమైన అధికారిక సంస్థ. కనుక ఎవరయితే రోగులకు వైబ్రియానిక్స్ మందులు ఇస్తూ క్రమం తప్పకుండా నెలవారీ నివేదికలు పంపుతున్నారో వారు దీనిలో సభ్యత్వం కోసం నమోదు చేసుకోవలసిందిగా విజ్ఞప్తి. త్వరలో మన వెబ్సైట్ లో దరఖాస్తు ఉంచబడుతుంది. దీనిని డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకొనవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వారికి అధికారికంగా సాయి వైబ్రియానిక్స్ ప్రాక్టీసు చేసుకోవచ్చునని తెలుపుతూ ఒక సర్టిఫికెట్ మరియు ఒక ఐడెంటిటీ కార్డు లభిస్తుంది. పాలనా పరమైన ఖర్చుల నిమిత్తం 100 రూపాయలు వార్షిక చందా మీవద్ద స్వీకరించబడుతుంది. ముఖ్య గమనిక ఏమిటంటే  నమోదు చేసుకున్న సభ్యులు IASVP చేత సూచింపబడిన నియమాలను, తప్పనిసరిగా అనుసరించాలని అట్లు చేయనినాడు వారి సభ్యత్వం రద్దుచేయబడుతుందని గమనించాలి.

మన సాయివైబ్రియానిక్స్ కుటుంబము ప్రపంచవ్యాప్తంగా 80 దేశాలకు వ్యాప్తి చెందింది. కనుక ఎక్కువ సభ్యులు ఉన్న దేశాలలో IASVP  సంస్థ వలె రిజిస్ట్రేషన్ చేయించుకొనడనికి  ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాము. ఎందుకంటే, ఇది  మన వైద్య విధానాన్ని ప్రచారం చేయడానికి విస్తరించడానికి ఉపకరిస్తుంది. ఐతే మీ సహాయము లేనిదే ఇది అసాధ్యము కనుక మీ మీ దేశాలలో ఈ విధంగా మన సంస్థను ముందుకు తీసుకు వెళ్ళడానికి చొరవ చూపవలసిందిగా విజ్ఞప్తి.

మీ నుండి అందివచ్చే సహకారంతోనే, వైబ్రియానిక్స్ క్రమంగా శాఖోపశాఖలుగా విస్తరిస్తోంది. మీలో కొంతమందికి గుర్తుండే ఉంటుంది. రోగులకు రెమిడిలు ఇచ్చే సందర్భాలలో మనం కాఫీ ని వ్యతిరేకించే వారము. అలాగే టీవీ మొబైల్స్ నుంచి కూడా దూరంగా ఉంచేవారము. ఆ తర్వాత రేడియేషన్ కలిగించే వివిధరకాల వస్తువుల నుండి రెమిడి లను ఎలా కాపాడుకోవాలో సమాచారం అందింది. 2007 లో స్వామి మొదటి సారి 108CC బాక్స్ ను ఆశీర్వదించినప్పుడు, దీనిలో యాంటి రేడియేషన్ కూడా వుంది.  ఐనప్పటికీ, ఈ బాక్సులను రేడియేషన్ కు గురి అయ్యే పరికరాలకు ఎప్పుడయినా అజాగ్రత్తగా స్వల్పకాలం ఉంచడం వలన నష్టమేమి లేదు కానీ, ఎక్కువగా రేడియేషన్ కు గురిచేయడం శ్రేయస్కరం కాదని సూచన. ఏది ఏమయినప్పటికీ ఈ రెమిడిల సామర్ధ్యం పైన వస్తున్న వార్తలు చాలా ప్రోత్సహజనకంగా ఉన్నాయి. ఈ రెమిడి లను మరో 300 వ్యాధులకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దిన సరికొత్త 108CCబాక్సును స్వామి 2008 మార్చి లో ఆశీర్వదించారు (మీ 108CC పుస్తకంలో ఫోటోను చూడండి ). కొన్ని చిన్న చిన్న మార్పులతో మరో  200 వ్యాధులకు రెమిడి లు ఉపయోగకరమైన విధంగా మార్చిన సరికొత్త 108CC బాక్సును 2011ఆగస్టు నెలలో స్వామి దివ్య పాదాల చెంత సమర్పించడం జరిగింది. ఎపుడైనా సరికొత్త సమాచారము అందినపుడు మన పరిశోదనా బృందము వెంటనే దానిపైన అధ్యయనం చేసి తగు పరీక్షలు నిర్వహించిన తర్వాతనే ప్రాక్టీషనర్లకు అందుబాటులోనికి తెస్తుంది. 

వైబ్రియానిక్స్ ఉద్యమం కొంత పుంతలు తొక్కుచున్ననేపధ్యంలో, మనం దీనిని మరింత ముందుకు తీసుకు పోవడానికి వాలంటీర్లు కోసం ఎదురు చూస్తున్నాము. ఇండియా లో మన ప్రాక్టీషనర్ లు కొందరు పాలనా సంబంధమైన బాధ్యతలు తీసుకోవడానికి ముందుకు వచ్చారు - వారికి హృదయ పూర్వక ఆహ్వానం! నేను రాష్ట్ర కోఆర్డినేటర్ లతో నిర్వహించిన సమావేశాములలో రాష్ట్రాన్ని కొన్ని జోన్లుగా విభజించి సబ్ కో ఆర్డినేటర్ లను నియమించడానికి నిర్ణయం తీసుకున్నాము. ప్రస్తుతం మన రాష్ట్ర కో ఆర్డినేటర్లు తమ ప్రాంతాలలో నిర్వహిస్తున్న రిఫ్రెషర్ వర్క్ షాప్ లు చురుకుగా వైబ్రియానిక్స్ సేవ చేస్తున్న వారికే కాక కాస్త మందకొడిగా ఉన్న ప్రాక్టీషనర్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటున్నాయి. కనుక ప్రస్తుతం ఇదే పద్దతిలో ఇతర దేశాలలో కూడా చేయవలసిన ఆవశ్యకత ఉంది.

కనుక  క్రియాశీలక ప్రాక్టీషనర్లందరూ మీ ప్రాంతాలలో వైబ్రియానిక్స్ పట్ల అవగాహన కలిగించడానికి ఉద్యమాన్ని ముందుకుతీసుకు పోవడానికి స్వచ్చందంగా ముందుకు రావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది స్వామియొక్క పని - ఇది మన ప్రేమమూర్తి స్వామి భౌతికంగా ఉన్నప్పుడు స్వయంగా ఆశీర్వదించి అందించిన వైద్య విధానము కనుక దీనిని బలహీన పరచకుండా మరింత విస్తరింప చేయడం మనందరి భాద్యత! స్వామి ఉపదేశించిన అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అనే దివ్య మంత్రం ద్వారా శక్తిపొంది మన హృదయాలలోనూ ఇతరుల హృదయాలలోనూ స్వామిని చూస్తూ స్వామిబాట లో పయనిద్దాం .

ప్రేమతో సాయిసేవలో మీ

జిత్. కె.అగ్గర్వాల్