డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
Vol 4 సంచిక 3
May/June 2013
ప్రియమైన చికిత్సా నిపుణులకు,
ఇటీవల కాలంలో మన చికిత్సా నిపుణుల వద్ద నుండి చాలా ప్రోత్సాహకరమైన ఫీడ్ బాక్ అందుకున్నాము – అందువల్ల అందరికీ ధన్యవాదాలు.108సిసి బాక్సు ఉపయోగిస్తూ పొందుతున్నఫలితాలు ఆశించిన దాని కన్నా అద్భుతమైన విధంగా ఉన్నాయి. దీని కంతటికీ కారణమయిన మన స్వామి అనుక్షణం మనతో ఉంటూ మనల్ని ముందుకు తీసుకువెళుతున్న స్వామి దివ్య అనుగ్రహ హస్తమునకు కృతజ్ఞతలు. ముందుగానే కోంబోలను తయారు చేసి ఉపయోగించే ఆలోచన ఎలా వచ్చిందనేది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2000 సంవత్సరంలో, నా శ్రీమతి హేమ మరియు మరో ఇద్దరు చికిత్సా నిపుణులు పుట్టపర్తిలో ఉన్న బాలికల పాఠశాలను సందర్శిస్తూ అవసరమైన వారికి చికిత్స నందించేవారు. వీరిలో చాలా మంది పిల్లలు ఒకే రకమైన రుగ్మతలతో బాధపడుతున్న సందర్భంలో, ఒకేరకమైన రెమిడీని పదేపదే సాయిరాం హీలింగ్ పోటెంటైజర్ నుండి తయారు చేసి ఇవ్వవలసి వచ్చేది. ఇలా చేయడానికి చాలా సమయం వృధా అయ్యేది. కనుక వారికి పని తేలికగా అవ్వడంకోసం, వారు తరుచుగా ఉపయోగించే వాటిని పెద్ద బాటిల్సులో తయారు చేసి పెట్టుకుని ఉపయోగించడం ప్రారంభించారు. ఇదే ఆ తర్వాత మెడికల్ క్యాంపు లలోనూ పైన పేర్కొన్న స్థితి వంటి సందర్భాల్లో ఉపయోగించడానికి వీలుగా ఉండే 108 సిసి బాక్సు రూపకల్పనకు నాంది అయ్యింది. 2000 జూన్ 14వ తేదీన హేమ స్వామి కి ఇవ్వాలని ఉత్తరం వ్రాసి ఉదయం దర్శనం లైనులో కూర్చుని ఉండగా, స్వామి తమ నివాసానికి తిరిగి వెళుతూ ఆగి, ఉత్తరం తీసుకుని విభూతి సృష్టించి ఇచ్చారు. ఆ సమయంలో మాకు స్వామి 108సిసి బాక్సు రూపొందించడం కోసం మమ్మల్ని తయారు చేస్తున్నారు అన్న అవగాహన లేదు. ఆ విధంగా స్వామి దయతో 2007 లో 108 సిసి బాక్సు రూపొందింపబడడం దానిని స్వామి ఆశీర్వదించడం, 2008 లో దీని తుది రూపమూ ఏర్పడ్డాయి (108CC పుస్తకం లో ఉన్న ఫోటో ను మీరు చూడవచ్చు).
గతనెలలో, మహారాష్ట్ర సత్యసాయి బుక్స్అండ్ పబ్లికేషన్స్ వారి ద్వారా సాయివైబ్రియోనిక్స్ పై ఒక పుస్తకము ప్రచురింప బడింది. దీనిని మన ప్రాక్టీషనర్ 02640 మరియు అలోపతీ డాక్టర్ (ప్రస్తుతం అలోపతి మానివేసి అవసరమైతేనే సేవ రూపంలో ఉపయోగిస్తున్నారు) చే రచింపబడింది. ఈ పుస్తకం సాయి వైబ్రియోనిక్స్ ద్వారా పరిష్కరించబడిన అనేక విజయవంతమైన కేసుల గురించి సమాచారం అందించడమే కాక ఎందరో కొత్త వారిని కూడా ఈవిధానము పట్ల ఆకర్షితులయ్యే విధంగా ఉంది. ఐతే దీనిలో చికిత్స నిమిత్తం వినియోగించిన కోంబోల వివరాలు లేనప్పటికీ చికిత్సా నిపుణులు క్లిష్టమైన ఎన్నో కేసులు చికిత్స చేసేందుకు ప్రోత్సహించేదిగానూ వాటిని అందరితో పంచుకొనేందుకు కూడా ప్రోత్సాహకరంగానూ ఉంది. ఈ పుస్తకం ధర్మక్ఞేత్రం మరియు ప్రశాంతినిలయం పుస్తక విక్రయశాలలో లభ్యమవుతుంది.
భారత దేశంలో ప్రస్తుతం మనం వేసవి సెలవుల మధ్యలో ఉండగా పశ్చిమ దేశాల వారు వీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సెలవులు లో మీరు ఏదైనా ఊరు వెళ్ళే ప్రణాలికలలో ఉంటే ఒక విషయం మీకు గుర్తు చేద్దామనుకుంటున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వెంట చిన్న సంచిలో వెల్నెస్ కిట్టును కూడా వెంటతీసుకు వెళ్ళండి.108 కోంబో పుస్తకం 2వ పేజీ లో దీని వివరణ ఉంది. ఇది వెంట ఉంటే కడుపు నొప్పి. మడముల నొప్పి, ఫ్లూతో మీ సెలవులు వ్రృధా చేసుకోవలసిన అవసరమే ఉండదు. అంతేకాదు, మీరు మలేరియా లేదా మరేదైనా ఉష్ణమండల వ్యాధులకు లోనయ్యే ప్రాంతానికి వెళుతున్న పక్షంలో, వెళ్ళే ముందుగా ప్రివెంటివ్ డోస్ తీసుకోవడం మరిచిపోవద్దు అంతేకాక మీరు తిరిగి మీ స్వస్థలాలకు వచ్చే వరకు వీటిని మానవద్దు. భారత దేశంలో ఋతుపవనాలు రానున్న నేపధ్యంలో వ్యాధులు వచ్చాక బాధపడేదానికన్నా- అవి ప్రబలకుండా ముందే జాగ్రత్తలు తీసుకునుట మేలు. ఒకవేళ మీరు గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించతలపెడితే మీరు తీసుకోవడంతో పాటు పేషంటు లందరికీ ప్రివెంటివ్ డోస్ ఇవ్వండి.
ప్రతీ వార్తాలేఖలోనూ, మీస్పందన తెలియచేయవలసిందిగానూ అది మా కెంతో ఆనందం కలిగిస్తుందని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే చికిత్సా నిపుణులు బాగున్నవాటిని ఆనంద ప్రదము లైన వాటిని పంపిస్తున్నారు తప్ప, తాము ఇబ్బందులు పడుతున్న అంశాలను పంపడానికి ముందుకు రావడం లేదు. ఇటువంటి వాటిని కూడా నిజాయితీగా మీరు పంపినట్లైతే మనమంతా కలసి.నడుస్తున్న ఈ” వైబ్రో ప్రయాణం“ ప్రోత్సాహ జనకంగా ఉంటుంది. అలాగే మీ వద్ద ఆరోగ్యానికి సంబంధించిన ఏవైనా వ్యాసాలు ఉంటేవాటిని తప్పక మాకు పంపండి. మీరు చికిత్స చేసిన ఉత్తమమైన రోగ చరిత్రలు ఎప్పటిలాగే పంపిస్తూ ఉండండి. ప్రతీ ఒక్కదాని నుండి కూడా మనం లబ్ధి ని పొందగలము.
మీ అందరికీ ఈ సెలవులు ప్రేమ ప్రదంగా ఆనందదాయకంగా ఉండాలనీ - స్వామి ప్రేమ అనే ఉషస్సులో మనమంతా మునకలిడి మరింతగా అంకితభావంతో వైబ్రియో సేవలు చేయాలని ఆకాంక్షిస్తున్నాను.
ప్రేమతో సాయి సేవలో మీ
జిత్ కె అగ్గర్వాల్