డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
Vol 4 సంచిక 4
July/August 2013
ప్రియమైన ప్రాక్టీషనర్లకు,
ప్రపంచ వ్యాప్తంగా క్రమ క్రమంగా పెరుగుతున్న మన సాయి వైబ్రియానిక్స్ కుటుంబ సభ్యులతో ఇటీవలే జరిగిన ఒక పరిణామాన్ని గురించి పంచుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. సమీప భవిష్యత్తులో ప్రశాంతి నిలయంలో సాయి వైబ్రియానిక్స్ అంతర్జాతీయ సదస్సు (ఇది సత్యాసాయి సంస్థకు గాని లేదా ట్రస్టుకు గానీ అనుసంధానింపబడకుండా స్వతంత్రంగా ఏర్పాటు చేసుకొనేది) నిర్వహించాలని సాయి సంస్థల అఖిలభారత అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీనివాసన్ గారు సూచించారు.సాయి వైబ్రియానిక్స్ గురించి ప్రపంచానికి తెలపటానికి మరియుఈ అద్భుత చికిత్సా విధానం పట్ల అవగాహన కల్పించడానికి భగవాన్ బాబావారు ఇచ్చిన అరుదైన అవకాశంగా భావిస్తున్నాము.
26 జనవరి 2014 న ఈ సమావేశాన్ని నిర్వహించాలని ప్రతిపాదించాము. స్వామి ప్రసాదించే ఇంతకంటే విలువైన బహుమతి మరింకేముంటుంది. 21 ఏప్రిల్ 2007న, స్వామి ఒక ఇంటర్వ్యూలో రాబోయే రోజులలో అంతర్జాతీయ వైబ్రియానిక్స్ సదస్సు పుట్టపర్తిలో జరుగుతుందని చెప్పినప్పుడు మేము పూర్తిగా ఆశ్చర్యానికి గురయ్యాము. స్వామి మాటలు ఇప్పుడు నిజముతున్నట్లుగా అనిపిస్తోంది.
సాయి వైబ్రియానిక్స్ కు ఈ సంఘటన ఒక ముఖ్యమైన మైలురాయివంటిది. ప్రపంచవ్యాప్తంగా రోగులకు నిస్వార్ధ ప్రేమ మరియు సేవలను రోజువారీగా వైబ్రేషన్స్ రూపంలో అందించే అనేక మంది అభ్యాసకుల సమిష్టి కృషి ఫలితంగా ఒనగూడనున్న అద్భుత కానుక.
మీరు భావిస్తున్నట్లుగానే ఈ సమావేశమును విజయవంతం చేయడానికి చెయ్యాల్సింది ఎంతో ఉంది. చురుకైన వైబ్రియానిక్స్ అభ్యాసకులుగా మనకు ఇది చాలా పెద్ద బాధ్యత. ప్రశాంతి నిలయంలో ఒక సమావేశాన్ని నిర్వహించడం సామాన్యమైన విషయం కాదు. దీనికి రూపొందించవలసిన ప్రణాళిక, నిర్వహణకు సంబంధించి నెలల తరబడి కృషి చేయవలసి ఉంది. మీ చురుకైన భాగస్వామ్యం మరియు హృదయ పూర్వకమైన మద్దతు లేకుండా ఇంత భారీ కార్యక్రమాన్ని చేపట్టలేము. అందువల్ల మీఆలోచనలను ఒకచోట చేర్చి ఈ ప్రయత్నం లో ఏ రంగం వైపు మొగ్గు చూపుతారు, ఏ విధంగా సహకరిస్తారు అనేది సూచించ వలసిందిగా బహిరంగముగా ఆహ్వానిస్తున్నాము. ఆసక్తికరమైన, ప్రత్యేకమైన కేసుల సమర్పణ మరియు వివిధ అంశాలపై కథనాలను అందించాలని ప్రతిపాదిస్తున్నాము. గత 20 ఏళ్లుగా వైబ్రియానిక్స్ యొక్క పెరుగుదల మరియు అభివృద్ధిని వివరించే ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు చేయాలని మేము ఆశిస్తున్నాము. వైబ్రియానిక్స్ కు సంబంధించినంతవరకు స్వామితోపంచుకున్న వివిధ పరస్పర అనుభూతులను ప్రత్యేక ఆకర్షణగా నిలపడానికి ప్రయత్నిస్తున్నాము.
ప్రణాళిక మరియు సమన్వయ సహకారానికి, ప్రదర్శనకు కావలసిన సరంజామా సమకూర్చడానికి, సమర్పించాల్సిన పత్రాలను రాయడానికి, మరియు సదస్సు తేదీలు సమీపించినప్పుడు ప్రతినిధుల బాగోగులు చూడడానికి, కాన్ఫరెన్స్ రిజిస్ట్రేషన్, వసతి మొదలగు వాటి నిమిత్తం స్వచ్ఛంద సేవకులు కూడా అవసరము. మాతో సన్నిహితంగా ఉంటూ భగవదాశీర్వదాన్నిపొందిన ఈ కార్యక్రమంలో మీరు ఏ రూపంలో సేవలందించబోతున్నారో [email protected] ద్వారా మాకు తెలియ జేయండి. ఇది నెలల దూరంలో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ నన్ను నమ్మండి ఇది చాలా సమీపంలోనికి వచ్చేసింది. మేము మీ యొక్క ఆలోచనలు వైఖరులను స్వాగతిస్తున్నాం. మీరు ఈ సమావేశంలో ఏమి చూడాలనుకుంటున్నారు ఏమి వినాలి అనుకున్నారో కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నాము. కనుక దయచేసి ఆగస్టు 31 లోగా మీ పేరును మీ ప్రాధాన్యతా క్రమాన్ని అనగా; a. మీరు హాజఋ కావాలనుకొంటే b. మీరు సదస్సుకు కానీ ప్రదర్శనకు గానీ ఏదైనా సమర్పించ దలచుకుంటే c. సదస్సుకు ముందు లేదా సమావేశ సమయంలో మీరు ఏ సేవ చేయాలనుకొంటున్నారో మాకు తెలియ జేయండి. రాబోయే వారాలలో మొదటి వైబ్రియనిక్స్ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడానికి అవసరమైన వివిధ రకాల సేవల జాబితా తయారుచేసి మన వెబ్ సైట్ www.vibrionics.orgలో అభ్యాసకుల సెక్షన్ లో ఉంచుతాము. కనుక క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉండండి.
ఈ అద్భుత కార్యక్రమాన్ని చూడడానికో లేదా దీనిలో పాల్గొనడానికో అభ్యాసకులందరూ భౌతికంగా ప్రశాంతి నిలయమునకు హాజరు కాలేకపోవచ్చనే విషయాన్ని మేము అర్థం చేసుకుంటున్నాం. ఐతే మీసేవలను స్వచ్ఛందంగా అందించడానికి మీనివాస గృహాలనుండే మాకు సహాయం చేయడానికి చక్కని అవకాశం ఉన్నప్పుడు మీరు ఎందుకు దూరంగా ఉండాలి. సేవచేయడానికి సిద్ధంగా ఉన్న వారందరికీ మేము విధులను కేటాయిస్తాము. ప్రియమైన స్వామి యొక్క స్పష్టమైన సంకల్పం మరియు ఆశీర్వాదం లేకుండా ఇంత పెద్ద సంఘటన జరగదు, మరియు స్వామి ఆశ్రమంలో జరగబోయే ఈ సమావేశంలో ఏ స్వల్ప సేవలో నైనా పాల్గొనే అవకాశాన్ని తేలికగా తీసుకోకూడదు. ఇది మన గురువు మరియు దైవము ఐన స్వామికి కృతజ్ఞతా పూర్వక సమర్పణగా చేయవలసి ఉంది. కనుక దీనిని అద్భుతంగా తీర్చి దిద్దడానికి కావలసిన అన్ని ప్రయత్నాలు చేయాలి.
ప్రత్యామ్నాయ వైద్యవిధానాలలో ప్రముఖ వ్యవస్థగా వైబ్రియానిక్స్ తన ముద్ర వేయడానికి ఇది ఒక మైలురాయి వంటి అవకాశం. ఈ సమావేశ వేదిక ద్వారానే సామూహిక అనుభవాలు ఉత్తమంగా సంగ్రహించడతాయి, ప్రచురింప బడతాయి, ప్రదర్శించబడతాయి, మరియు ప్రతి ఒక్కరి ప్రయోజనం కోసం ఈ విలువైన జ్ఞానవీచికలు భాగస్వామ్యం చేయబడతాయి. త్వరలో మీనుండి వచ్చే వార్తకోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాము. మరియు ఈ సమావేశాన్ని సాకారం చేయడానికి స్వామి మాకు మార్గనిర్దేశం చేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మానవాళికి, జంతువులు మరియు మొక్కలు అన్నింటికీ వైబ్రియానిక్స్ అందుబాటులో ఉంచే లక్ష్యం కోసం మనమంతా కలిసి పని చేద్దాము.
ప్రేమ పూర్వక సాయి సేవలో మీ
జిత్ కె.అగ్గర్వాల్